పంజాబ్ రాజస్థాన్ రాయల్స్ మీద మ్యాచ్ గెలిచింది. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో మాట్లాడిన కెప్టెన్ శామ్ కర్రన్ పంజాబ్ లాస్ట్ మ్యాచ్‌లోనూ ఫైర్ చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. అదే టైంలో తానూ, బెయిర్ స్టో ఇంగ్లండ్ వెళ్లిపోతున్నామని చెప్పి షాక్ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్‌లో భాగంగా ఇంగ్లండ్ రావాలని శామ్ కర్రన్ , బెయిర్ స్టోకు కబురు వచ్చింది. ఇదే కాదు దాదాపుగా అన్ని టీమ్స్‌లోనూ ఇదే పరిస్థితి. 


టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉన్న ఫారెన్ ప్లేయర్స్‌ని ఆయా దేశాల బోర్డులు వెనక్కి పిలిపించేస్తున్నాయి. ఆటగాళ్లు కీలక దశలో గాయపడితే దాని ప్రభావం దేశ క్రికెట్ ఉంటుందనే భయం ఓ వైపు ఉంది. అమెరికా, వెస్టిండీస్ పిచ్‌ల మీద వరల్డ్ కప్ ఆడాలి దానికి కావాల్సిన ప్రాక్టీస్ చేయించటం కోసం ఆయా క్రికెట్ బోర్డులు ప్లాన్ చేసుకుంటున్నాయి. అందుకోసమే ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్‌లో ఉన్న ఐపీఎల్ నుంచి వచ్చేయాలని ఆటగాళ్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. 


రాజస్థాన్ రాయల్స్ నుంచి జోస్ బట్లర్, చెన్నైసూపర్ కింగ్స్ నుంచి మోయిన్ అలీ, ఆర్సీబీ నుంచి విల్‌జాక్స్ లాంటి ఆటగాళ్లు వెళ్లిపోయారు. ఇంగ్లండ్ పిలిచింది కాబట్టి తమ ఆటగాళ్లను కూడా వెనక్కి పిలవాలని సౌతాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి టీమ్స్ భావిస్తున్నాయి. ఇలా క్రూషియల్ ఆటగాళ్లను వెనక్కి పిలిచేయటంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మండిపడ్డాడు. ఫారిన్ ప్లేయర్స్ ఆడితే మొత్తం సీజన్ ఆడాలని లేదంటే అసలు రావటం మానేయాలంటూ పఠాన్ ట్వీట్ చేశాడు. 


ఇప్పుడు పంజాబ్‌కి హైదరాబాద్‌తో లాస్ట్ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ పంజాబ్‌కు అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ హైదరాబాద్‌కు విజయం అవసరం. అలాంటి మ్యాచుల్లో పంజాబ్ ఫుల్ ప్లెడ్జ్ టీమ్‌తో బరిలోకి దిగి వస్తే ఓడిస్తే ఆ టీమ్‌లోని యంగ్ స్టర్స్‌కి మంచి బూస్టప్ వస్తుంది. కానీ అలా జరగటం లేదని పఠాన్ వాదన. 
పఠాన్ ట్వీట్‌కి చాలా మంది పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ రిప్లైలు ఇస్తున్నారు. మీకు డబ్బులిచ్చే టీ20లీగ్ లు ఎక్కువ కావచ్చు కానీ వాళ్లకు వాళ్ల దేశం తరపున ఆడటం ఇంపార్టెంట్ అంటూ హితోపదేశం చేస్తున్నారు.