MI vs PBKS, IPL 2022 LIVE: ఆగని ముంబై ఓటముల పరంపర - వరుసగా ఐదో మ్యాచ్ కూడా పాయే!
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
ఒడియన్ స్మిత్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. జయదేవ్ ఉనద్కత్, బుమ్రా, టైమల్ మిల్స్ అవుటయ్యారు. 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై 186-8కే పరిమితం అయింది. దీంతో పంజాబ్ 12 పరుగులతో విజయం సాధించింది.
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 177-6గా ఉంది.
జయదేవ్ ఉనద్కత్ 4(4)
మురుగన్ అశ్విన్ 0(2)
కగిసో రబడ 4-0-29-2
సూర్యకుమార్ యాదవ్ (సి) ఒడియన్ స్మిత్ (బి) కగిసో రబడ (43: 30 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు)
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 171-5గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 37(26)
జయదేవ్ ఉనద్కత్ 4(4)
అర్ష్‌దీప్ సింగ్ 4-0-29-0
వైభవ్ అరోరా వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. కీరన్ పొలార్డ్ రనౌటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 166-5గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 35(23)
జయదేవ్ ఉనద్కత్ 1(1)
వైభవ్ అరోరా 4-0-43-1
కీరన్ పొలార్డ్ రనౌట్ (ఒడియన్ స్మిత్/జితేష్ శర్మ) (10: 11 బంతుల్లో, ఒక ఫోర్)
రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 150-4గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 22(19)
కీరన్ పొలార్డ్ 9(10)
రాహుల్ చాహర్ 4-0-44-0
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. తిలక్ వర్మ అవుటయ్యాడు. 13 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 131-4గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 12(11)
కీరన్ పొలార్డ్ 0(0)
అర్ష్‌దీప్ సింగ్ 3-0-24-0
తిలక్ వర్మ (రనౌట్) మయాంక్ అగర్వాల్/అర్ష్‌దీప్ సింగ్ (36: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. డేంజరస్ డెవాల్డ్ బ్రెవిస్ అవుటయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 105-2గా ఉంది.
తిలక్ వర్మ 36(20)
సూర్యకుమార్ యాదవ్ 2(4)
రాహుల్ చాహర్ 2-0-33-0
ఒడియన్ స్మిత్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. డేంజరస్ డెవాల్డ్ బ్రెవిస్ అవుటయ్యాడు. 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 105-2గా ఉంది.
తిలక్ వర్మ 34(18)
సూర్యకుమార్ యాదవ్ 0(0)
ఒడియన్ స్మిత్ 2-0-21-1
డెవాల్డ్ బ్రెవిస్ (సి)అర్ష్‌దీప్ సింగ్ (బి) ఒడియన్ స్మిత్ (49: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు)
వైభవ్ అరోరా వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 105-2గా ఉంది.
డెవాల్డ్ బ్రెవిస్ 45(22)
తిలక్ వర్మ 27(15)
వైభవ్ అరోరా 3-0-29-1
రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ఏకంగా 29 పరుగులు వచ్చాయి. డెవాల్డ్ బ్రెవిస్ నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ సాధించాడు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 92-2గా ఉంది.
డెవాల్డ్ బ్రెవిస్ 44(21)
తిలక్ వర్మ 15(10)
రాహుల్ చాహర్ 1-0-29-0
లియామ్ లివింగ్‌స్టోన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 63-2గా ఉంది.
డెవాల్డ్ బ్రెవిస్ 16(16)
తిలక్ వర్మ 14(9)
లియామ్ లివింగ్‌స్టోన్ 1-0-11-0
ఒడియన్ స్మిత్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 52-2గా ఉంది.
డెవాల్డ్ బ్రెవిస్ 15(14)
తిలక్ వర్మ 4(5)
ఒడియన్ స్మిత్ 1-0-10-0
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 42-2గా ఉంది.
డెవాల్డ్ బ్రెవిస్ 8(11)
తిలక్ వర్మ 2(2)
అర్ష్‌దీప్ సింగ్ 2-0-13-0
వైభవ్ అరోరా వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. ఐదు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 33-2గా ఉంది.
డెవాల్డ్ బ్రెవిస్ 0(6)
తిలక్ వర్మ 1(1)
వైభవ్ అరోరా 2-0-14-1
ఇషాన్ కిషన్ (సి) జితేష్ శర్మ (బి) వైభవ్ అరోరా (3: 6 బంతుల్లో)
బసిల్ తంపి వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 198-5గా ఉంది. షారుక్ ఖాన్ క్లీన్ బౌల్డయ్యాడు.
జితేష్ శర్మ 30(15)
ఒడియన్ స్మిత్ 1(1)
బసిల్ తంపి 4-0-47-2
షారుక్ ఖాన్ (బి) బసిల్ తంపి (15: 6 బంతుల్లో, రెండు సిక్సర్లు)
జస్ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 182-4గా ఉంది.
జితేష్ శర్మ 29(13)
షారుక్ ఖాన్ 3(3)
జస్‌ప్రీత్ బుమ్రా 4-0-28-1
జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 174-4గా ఉంది.
జితేష్ శర్మ 23(9)
షారుక్ ఖాన్ 1(1)
జయదేవ్ ఉనద్కత్ 4-0-44-1
బసిల్ తంపి వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 151-4గా ఉంది. శిఖర్ ధావన్ అవుటయ్యాడు.
జితేష్ శర్మ 3(4)
బసిల్ తంపి 3-0-31-1
శిఖర్ ధావన్ (సి) పొలార్డ్ (బి) బసిల్ తంపి (70: 50 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు)
టైమల్ మిల్స్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 139-3గా ఉంది.
శిఖర్ ధావన్ 59(45)
జితేష్ శర్మ 2(3)
టైమల్ మిల్స్ 4-0-37-0
జస్ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 132-3గా ఉంది. లియాం లివింగ్‌స్టోన్ అవుటయ్యాడు.
శిఖర్ ధావన్ 53(40)
జితేష్ శర్మ 1(2)
జస్‌ప్రీత్ బుమ్రా 3-0-21-1
లియామ్ లివింగ్ స్టోన్ (బి) జస్‌ప్రీత్ బుమ్రా (2: 3 బంతుల్లో)
జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 128-2గా ఉంది. జానీ బెయిర్‌స్టో అవుటయ్యాడు.
శిఖర్ ధావన్ 45(35)
లియామ్ లివింగ్ స్టోన్ 1(1)
జయదేవ్ ఉనద్కత్ 3-0-21-1
జానీ బెయిర్‌స్టో (బి) జయదేవ్ ఉనద్కత్ (12: 13 బంతుల్లో, ఒక ఫోర్)
టైమల్ మిల్స్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 120-1గా ఉంది.
శిఖర్ ధావన్ 45(35)
జానీ బెయిర్‌స్టో 11(11)
టైమల్ మిల్స్ 3-0-30-0
మురుగన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 112-1గా ఉంది.
శిఖర్ ధావన్ 43(33)
జానీ బెయిర్‌స్టో 5(7)
మురుగన్ అశ్విన్ 4-0-34-1
మురుగన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 99-1గా ఉంది. మయాంక్ అగర్వాల్ అవుటయ్యాడు.
శిఖర్ ధావన్ 35(26)
జానీ బెయిర్‌స్టో 1(2)
మురుగన్ అశ్విన్ 3-0-29-1
మయాంక్ అగర్వాల్ (సి) సూర్యకుమార్ (బి) మురుగన్ అశ్విన్ (52: 32 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)
టైమల్ మిల్స్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 90-0గా ఉంది. మయాంక్ అగర్వాల్ అర్థ సెంచరీ పూర్తయింది.
శిఖర్ ధావన్ 27(23)
మయాంక్ అగర్వాల్ 52(31)
టైమల్ మిల్స్ 2-0-22-0
బసిల్ తంపి వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 80-0గా ఉంది.
శిఖర్ ధావన్ 25(21)
మయాంక్ అగర్వాల్ 44(27)
బసిల్ తంపి 2-0-19-0
మురుగన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 70-0గా ఉంది.
శిఖర్ ధావన్ 20(18)
మయాంక్ అగర్వాల్ 39(24)
మురుగన్ అశ్విన్ 2-0-20-0
టైమల్ మిల్స్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 65-0గా ఉంది.
శిఖర్ ధావన్ 18(15)
మయాంక్ అగర్వాల్ 38(21)
టైమల్ మిల్స్ 1-0-12-0
మురుగన్ అశ్విన్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 53-0గా ఉంది.
శిఖర్ ధావన్ 13(12)
మయాంక్ అగర్వాల్ 33(18)
మురుగన్ అశ్విన్ 1-0-17-0
జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 36-0గా ఉంది.
శిఖర్ ధావన్ 12(11)
మయాంక్ అగర్వాల్ 17(13)
జయదేవ్ ఉనద్కత్ 2-0-13-0
జస్ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 30-0గా ఉంది.
శిఖర్ ధావన్ 9(8)
మయాంక్ అగర్వాల్ 14(10)
జస్‌ప్రీత్ బుమ్రా 1-0-9-0
జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 17-0గా ఉంది.
శిఖర్ ధావన్ 7(4)
మయాంక్ అగర్వాల్ 9(8)
జయదేవ్ ఉనద్కత్ 1-0-7-0
బసిల్ తంపి వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి పంజాబ్ స్కోరు 10-0గా ఉంది.
శిఖర్ ధావన్ 1(2)
మయాంక్ అగర్వాల్ 9(4)
బసిల్ తంపి 1-0-10-0
శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో (వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, ఒడీన్ స్మిత్, కగిసో రబాడా, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్
ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డెవాల్డ్ బ్రెవిస్, కీరన్ పొలార్డ్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్, బాసిల్ థంపి
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
ఐపీఎల్ 2022లో 23వ మ్యాచులో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians), పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తలపడుతున్నాయి. లీగ్ చరిత్రలోనే అత్యంత బలమైన జట్టుగా పేరుపడ్డ ముంబయి ఈ సీజన్లో ఒక్క మ్యాచైనా గెలవలేదు. మరోవైపు చక్కని హిట్లరతో పంజాబ్ జోష్‌లో ఉంది. మరి ఈ రెండు జట్లలో ఎవరిది ఆధిపత్యం? తుది జట్లలో ఎవరెవరు ఉంటారు? గెలిచేదెవరు?
ముంబై ఐదోదైనా గెలుస్తుందా?
ముంబయి ఇండియన్స్ (MI) ఈ సీజన్లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిపోయింది. నేటి మ్యాచులో వారు గెలవడం అత్యంత అవసరం. లేదంటే దాదాపుగా వారు ప్లేఆఫ్‌కు దూరమైనట్టే! ఒకప్పుడు భీకరమైన బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో బలంగా కనిపించిన రోహిత్ సేన (Rohit Sharma) ఈ సారి డీలా పడింది. మిడిల్ ఓవర్లలో పరుగులు చేయడం లేదు. పైగా బౌలర్లు విపరీతంగా పరుగులు ఇచ్చేస్తున్నారు. పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)నూ ప్రత్యర్థులు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. అయితే తిలక్ వర్మ (Tilak varma), బ్రూవిస్ వంటి కుర్రాళ్లు రాణిస్తుండటం భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ (PBKS) సూపర్ డూపర్ హిట్టర్లతో ఉంది. లియామ్ లివింగ్‌స్టన్ (Liam Livingstone) మిడిల్ ఓవర్లలో పరుగులు చేస్తున్నాడు. అయితే బౌలింగ్, ప్రత్యేకించి డెత్ బౌలింగ్ బాగాలేకపోవడం వారిని వేధిస్తోంది.
పంజాబ్ కింగ్స్‌దే పైచేయి!
ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగులో ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ (MI vs PBKS) 28 సార్లు తలపడ్డాయి. అయితే పంజాబ్‌దే కాస్త పైచేయిగా ఉంది. వారు 15 సార్లు గెలిస్తే ముంబయి 12 సార్లే గెలిచింది. రీసెంట్‌గా ఆడిన ఐదు మ్యాచుల్లో 3-2తో ముంబయిదే ఆధిపత్యం. ఇందులో ఒక డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ ఉంది. ప్రస్తుతానికైతే పంజాబ్‌కు అవకాశాలు ఉన్నాయి. అలాగని ఇప్పటికే 4 మ్యాచులో ఓడిపోయిన ముంబయి బలంగా పుంజుకున్నా ఆశ్చర్యం లేదు.
ముంబయి ఇండియన్స్ తుదిజట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, డీవాల్డ్ బ్రూవిస్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలన్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, తైమల్ మిల్స్, జయదేవ్ ఉనద్కత్ / బాసిల్ థంపి
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు (అంచనా)
శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్‌స్టన్, జితేశ్ శర్మ, షారుక్ ఖాన్, ఒడీన్ స్మిత్, కాగిసో రబాడా, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్షదీప్ సింగ్
- - - - - - - - - Advertisement - - - - - - - - -