LSG vs RCB, IPL 2022 LIVE: సెకండ్ ప్లేస్‌కు బెంగళూరు : లక్నోపై 'సూపర్' విక్టరీ
LSG vs RCB live updates: ఐపీఎల్ 2022లో 31వ మ్యాచులో నేడు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి.
ఆఖరి ఓవర్లో హర్షల్ పటేల్ 12 పరుగులు ఇచ్చి హోల్డర్ (16)ను ఔట్ చేశాడు. బిష్ణోయ్ (0), చమీరా (1) అజేయంగా నిలిచారు. బెంగళూరు 18 పరుగుల తేడాతో గెలిచింది.
హేజిల్‌వుడ్ సూపర్ బౌలింగ చేశాడు. 3 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. రెండో బంతికి స్టాయినిస్ (24)ను ఔట్ చేశాడు. హోల్డర్ (3), చమీరా (2) క్రీజులో ఉన్నారు.
హర్షల్ 10 పరుగులు ఇచ్చాడు. స్టాయినిస్ (24) ఒక బౌండరీ బాదాడు. హోల్డర్ (3) అతడికి తోడుగా ఉన్నాడు.
హేజిల్‌వుడ్ 10 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. ఆయుష్ బదోనీ (13) ఔటయ్యాడు. స్టాయినిస్ (17), హోల్డర్ (1) నిలకడగా ఆడుతున్నారు.
హసరంగ 11 పరుగులు ఇచ్చాడు. బదోనీ (11) నిలకడగా ఆడాడు. ఐదో బంతిని స్టాయినిస్ (11) సిక్సర్‌గా మలిచాడు.
సిరాజ్ 7 పరుగులు ఇచ్చాడు. ఆయుష్ బదోనీ (10) ఒక బౌండరీ బాదాడు. స్టాయినిస్ (2) క్రీజులో ఉన్నాడు. లక్నో విజయానికి 30 బంతుల్లో 65 రన్స్ కావాలి.
సిరాజ్ 5 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. మూడో బంతికి హుడా (13) ఔటయ్యాడు. ఆయుష్ బదోనీ (4), కృనాల్ (38) క్రీజులో ఉన్నారు.
షాబాజ్ 5 పరుగులే ఇచ్చాడు. దీపక్ హుడా (9), కృనాల్ (32) నిలకడగా ఆడుతున్నారు.
హసరంగ 11 పరుగులు ఇచ్చాడు. కృనాల్ (31) ఒక సిక్సర్, దీపక్ హుడా (5) ఒక బౌండరీ బాదేశారు.
షాబాజ్ 8 పరుగులు ఇచ్చాడు. కృనాల్ (25) ఒక సిక్స్ బాదేశాడు. బర్త్‌డే బాయ్ దీపక్ హుడా (1) పరుగుల ఖాతా తెరిచాడు.
హర్షల్ పటేల్ 14 రన్స్ ఇచ్చినా వికెట్ తీశాడు. కీలకమైన కేఎల్ రాహుల్ (30)ను ఆఖరి బంతికి ఔట్ చేశాడు. కృనాల్ పాండ్య (19) బ్యాటింగ్ చేస్తున్నాడు.
షాబాజ్ 6 పరుగులు ఇచ్చాడు. కృనాల్ (14), రాహుల్ (26) చకచకా సింగిల్స్ తీశారు.
సిరాజ్ 11 పరుగులు ఇచ్చాడు. ఆఖరి రెండు బంతుల్ని కృనాల్ పాండ్య (9) వరుసగా బౌండరీకి పంపించాడు. రాహుల్ (25) నిలకడగా ఆడుతున్నాడు.
హేజిల్‌వుడ్ 9 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. ఆఖరి బంతికి మనీశ్ పాండే (6)ను ఔట్ చేశాడు. అంతకు ముందు మూడో బంతిని కేఎల్ రాహుల్ (23) ఈజీగా ఫైన్‌లెగ్‌లోకి సిక్స్ కొట్టాడు.
షాబాజ్ 7 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని మనీశ్ (5) బౌండరీకి పంపించాడు. రాహుల్ (15) మరో ఎండ్‌లో ఉన్నాడు.
హేజిల్‌వుడ్ 3 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. ఐదో బంతికి డికాక్ (3) ఔటయ్యాడు. స్లిప్‌లో మాక్సీకి క్యాచ్ ఇచ్చాడు. రాహుల్ (13) మనీశ్ పాండే, (0) క్రీజులో ఉన్నారు.
మాక్సీ మరో ఎండ్ నుంచి బౌలింగ్ ఆరంభించాడు. రాహుల్ (11), డికాక్ (2) నిలకడగా ఆడుతున్నారు.
లక్నో ఛేజ్ మొదలైంది. సిరాజ్ బౌలింగ్ ఆరంభించాడు. 9 పరుగులు ఇచ్చాడు. రాహుల్ (8) ఆఖరి రెండు బంతుల్ని బౌండరీకి పంపించాడు. డికాక్ (1) అతడికి తోడుగా వచ్చాడు.
ఆఖరి ఓవర్‌ను హోల్డర్ అద్భుతంగా వేశాడు. 4 పరుగులే ఇచ్చి వికెట్ తీశాడు. ఐదో బంతిని సెంచరీకి చేరువైన డుప్లెసిస్ (96)ను ఔట్ చేశాడు. డీకే (18) అజేయంగా నిలిచాడు.
అవేశ్ 13 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతిని డీకే (11) సిక్సర్‌గా మలిచాడు. డుప్లెసిస్ (94) సెంచరీకి కాస్త దూరంలో ఉన్నాడు.
రబి బిష్ణోయ్ 14 పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్ (90) రెండు బౌండరీలు బాదేశాడు. దినేశ్ కార్తీక్ (3) అతడికి స్ట్రైక్ ఇస్తున్నాడు.
అవేశ్ 10 పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని డుప్లెసిస్ (76) బౌండరీకి పంపించాడు. డీకే (3) నిలకడగా ఆడుతున్నాడు.
హోల్డర్ 10 పరుగులు ఇచ్చాడు. రెండో బంతికి షాబాజ్ (26) రనౌట్ అయ్యాడు. డుప్లెసిస్ (68) మాత్రం దుమ్మురేపుతున్నాడు.
కృనాల్ పాండ్య 13 పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్ (61) ఒక బౌండరీ, ఒక సిక్సర్ బాదేశాడు. షాబాజ్ (25) జోరు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు.
రవి బిష్ణోయ్ 10 పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని డుప్లెసిస్ (50) సిక్సర్ బాదాడు. తర్వాత బంతికి హాఫ్ సెంచరీ చేశాడు. ఆఖరి బంతిని షాబాజ్ (23) షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని బిష్ణోయ్ కొద్దిలో మిస్ చేశాడు.
చమీరా 7 పరుగులు ఇచ్చాడు. షాబాజ్ (21), డుప్లెసిస్ (42) ఆచితూచి ఆడుతున్నారు.
రవి బిష్ణోయ్ 8 పరుగులు ఇచ్చాడు. నాలుగో బంతిని డుప్లెసిస్ (40) స్ట్రెయిట్‌గా బౌండరీ కొట్టాడు. షాబాజ్ (16) స్ట్రైక్ రొటేట్ చేస్తున్నాడు.
కృనాల్ 5 పరుగులు ఇచ్చాడు. షాబాజ్ (15), డుప్లెసిస్ (33) సింగిల్స్ తీశారు.
హోల్డర్ 8 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతిని డుప్లెసిస్ (31) బౌండరీకి పంపించాడు. షాబాజ్ (12) పార్ట్‌నర్‌షిప్‌ను చక్కగా నిర్మిస్తున్నాడు.
లక్నో వికెట్లు తీసినప్పటికీ పరుగుల్ని లీక్ చేస్తున్నారు. స్టాయినిస్ 14 పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్ (26), షాబాజ్ (10) చెరో బౌండరీ కొట్టారు.
హోల్డర్ 3 పరుగులు ఇచ్చి వికెట్ తీశాడు. రెండోబంతికి ప్రభుదేశాయ్ (10)ని ఔట్ చేశాడు. షాబాజ్ అహ్మద్ (2), డుప్లెసిస్ (21) నిలకడగా ఆడుతున్నారు.
రవి బిష్ణోయ్ 15 పరుగులు ఇచ్చాడు. నోబాల్ వేయడంతో వచ్చిన ఫ్రీహిట్‌ను ప్రభుదేశాయ్ (10) ఉపయోగించుకున్నాడు. సిక్సర్ కొట్టేశాడు. ఆఖరి బంతిని డుప్లెసిస్ (20) బౌండరీకి పంపించాడు.
కృనాల్ పాండ్య వికెట్ తీసి 4 పరుగులు ఇచ్చాడు. రెండో బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయిన మాక్స్‌వెల్ (23; 11 బంతుల్లో) హోల్డర్‌కు క్యాచ్ ఇచ్చాడు. డుప్లెసిస్ (15), ప్రభుదేశాయ్ (2) ఆచితూచి ఆడుతున్నారు.
పిచ్ మీద మూమెంట్ కనిపించడం లేదు. అవేశ్ 7 పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని డుప్లెసిస్ (13) బౌండరీ బాదేశాడు. మాక్సీ (23) దూకుడుగా ఉన్నాడు.
కృనాల్ పాండ్య బౌలింగ్‌కు వచ్చాడు. 7 పరుగులిచ్చాడు. మాక్సీ (21) మూడో బంతిని బౌండరీకి పంపించాడు. డుప్లెసిస్ (8) నిలకడగా ఆడుతున్నాడు.
చమీరా 19 పరుగులు ఇచ్చాడు. తొలి బంతిని డుప్లెసిస్ (6) బౌండరీకి పంపించాడు. ఆఖరి మూడు బంతుల్ని మాక్స్‌వెల్ (16) వరుసగా 4,4,6గా కొట్టాడు.
రెండో ఓవర్‌ను అవేశ్ ఖాన్ ఆరంభించాడు. 3 పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్ (1), మాక్స్‌వెల్ (2) నిలకడగా ఆడుతున్నారు.
బెంగళూరుకు తొలి ఓవర్లోనే షాకులు తగిలాయి. చమీరా అద్భుతంగా బౌలింగ్ 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. ఐదో బంతికి అనుజ్ రావత్ (4)ను ఔట్ చేసిన అతడు ఆరో బంతికి విరాట్ కోహ్లీ (0)ని గోల్డెన్ డక్‌గా పంపించాడు. డుప్లెసిస్, మాక్సీ క్రీజులో ఉన్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB Playing xi): డుప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, మాక్స్‌వెల్, ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
లక్నో సూపర్ జెయింట్స్ (LSG Playing xi): కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మనీశ్ పాండే, అయుష్ బదోనీ, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, జేసన్ హోల్డర్, దుష్మంత చమీరా, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
Background
IPL 2022, lsg vs rcb preview lucknow supergiants vs royal challengers bangalore head to head records: ఐపీఎల్ 2022లో 31వ మ్యాచులో నేడు లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow supergiants), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. డీవై పాటిల్ మైదానం (DY Patil Stadium) ఇందుకు వేదిక. రాహుల్ సేన కంప్లీట్ డెప్త్‌తో జోష్‌లో ఉంది. మరోవైపు దినేశ్ కార్తీక్ ఫినిషింగ్ టచ్‌తో బెంగళూరు గట్టిపోటీనిస్తోంది. మరి ఈ రెండు జట్లలో ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరెవరు ఉంటారు? ఎవరితో ఎవరికి ముప్పు?
ఈ సీజన్లో లక్నో (LSG), బెంగళూరు (RCB) చెరో 6 మ్యాచులు ఆడాయి. 4 గెలిచి 8 పాయింట్లతో ఉన్నాయి. నెట్ రన్‌రేట్ మాత్రమే ఇద్దరికీ తేడా! లక్నోతో పోలిస్తే బెంగళూరు బ్యాటింగ్‌లో నిలకడ లోపించింది. డుప్లెసిస్ (Faf Du Plessis), అనుజ్ రావత్ ఓపెనింగ్ భాగస్వామ్యాలు బాగాలేవు. వన్‌డౌన్‌లో వస్తున్న విరాట్ కోహ్లీ (Virat kohli) హఠాత్తుగా ఔటైపోతున్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell), దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) ఫినిషింగ్ టచ్ ఇస్తూ విజయాలు అందిస్తున్నారు. షాబాజ్ అహ్మద్ సైతం అద్భుతంగా ఆడుతున్నాడు.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ యూనిట్ సూపర్ ఫామ్‌లో ఉంది. కేఎల్ రాహుల్ (KL Rahul), క్వింటన్ డికాక్ (Quinton Decock) ఓపెనింగ్‌కు తిరుగులేదు. వన్‌డౌన్లో వస్తున్న మనీశ్ పాండే (Manish Panday) ముంబయి మ్యాచుతో ఫామ్‌లోకి వచ్చేశాడు. ఎవిన్ లూయిస్, కృష్ణప్ప గౌతమ్ సైతం ఫర్వాలేదు. మార్కస్ స్టాయినిస్ (Marcuk Stoinis) రావడంతో బౌలింగ్ మరింత బలపడింది. ఈ రెండు జట్ల పోటీలో కొన్ని మ్యాచ్‌అప్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
* దినేశ్ కార్తీక్‌ను ఆపడం ఎవరికీ సాధ్యమవ్వడం లేదు. పేస్‌లో బీభత్సమైన హిట్టింగ్ చేస్తున్న అతడు రిస్ట్‌స్పిన్‌లో మాత్రం కాస్త తడబడుతున్నాడు. రవి బిష్ణోయ్ (Ravi Bishnoi)తో అతడికి కచ్చితంగా ప్రమాదం ఉంది. 2020 నుంచి రైటార్మ్ రిస్ట్ స్పిన్నర్ల బౌలింగ్‌లో 47 బంతులాడిని డీకే 42 పరుగులే చేశాడు. బిష్ణోయ్ వేసిన 20 బంతుల్లో 25 పరుగులే చేశాడు.
* ముంబయి తర్వాత కేఎల్ రాహుల్ ఎక్కువగా ఎంజాయ్ చేసేది బెంగళూరుపైనే! అయితే మాక్స్‌వెల్‌తో అతడికి ప్రమాదం పొంచివుంది. 4 ఇన్నింగ్సుల్లో 18 బంతులు ఆడిన కేఎల్ కేవలం 20 పరుగులు చేసి రెండుసార్లు ఔటయ్యాడు.
* ఐపీఎల్ 2022 పవర్‌ప్లేలో ఈ రెండు జట్లు ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేస్తున్నాయి. లక్నో 8.61, బెంగళూరు 7.86 ఎకనామీతో పరుగులు ఇస్తున్నాయి.
* లక్నో బౌలింగ్‌లో అవేశ్ ఖాన్ (Avesh Khan) మళ్లీ కీలకం కానున్నాడు. 2022 ఐపీఎల్‌లో పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో చెరో 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ బౌలర్ నటరాజన్‌కు మాత్రమే ఈ రికార్డు సొంతమైంది.
LSG vs RCB Probable Playing XI
లక్నో సూపర్ జెయింట్స్ (LSG Playing xi): కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మనీశ్ పాండే, అయుష్ బదోనీ, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, జేసన్ హోల్డర్, దుష్మంత చమీరా, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB Playing xi): డుప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, మాక్స్‌వెల్, ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్
- - - - - - - - - Advertisement - - - - - - - - -