Lucknow Super Giants vs Mumbai Indians Eliminator: ఐపీఎల్‌ 2023 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట లక్నో సూపర్ జెయింట్స్ (LSG) బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.


లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
ఆయుష్ బడోని, దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా (కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, యశ్ ఠాకూర్, మొహిసిన్ ఖాన్


లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
కైల్ మేయర్స్, డేనియల్ సామ్స్, యుధ్వీర్ సింగ్, స్వప్నిల్ సింగ్, అమిత్ మిశ్రా


ముంబై ఇండియన్స్ తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, క్రిస్ జోర్డాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆకాష్ మధ్వాల్


ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
రమణదీప్ సింగ్, విష్ణు వినోద్, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, సందీప్ వారియర్


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు 2023లో మరొకరి జర్నీ నేటితో ముగియనుంది! చెపాక్‌ వేదికగా సాయంత్రం ఎలిమినేటర్‌ జరుగుతోంది. మూడు, నాలుగు పొజిషన్లలో నిలిచిన లక్నో సూపర్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ తలపడుతున్నాయి.


అరంగేట్రం చేసిన ఏడాది నుంచి వరుసగా రెండోసారీ ప్లేఆఫ్‌ చేరుకుంది లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Super Giants)! అదీ మూడో స్థానంతోనే! విచిత్రంగా రెండు సార్లూ రెండో పొజిషన్లో నిలిచిన జట్టుతో సమానంగా పాయింట్లు సాధించినా నెట్‌రన్‌రేట్‌తో వెనకబడింది. ఐపీఎల్‌ చరిత్రలోనే మోస్ట్‌ కన్సిస్టెంట్‌ ఓపెనర్‌, కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) లేనప్పటికీ లక్నో దూసుకెళ్తోంది. కృనాల్‌ పాండ్య (Krunal Pandya) ఎల్‌ఎస్‌జీ బ్రిగేడ్‌ను బాగా నడిపిస్తున్నాడు. ఎప్పుడు ఎలాగైనా చెలరేగే ఆటగాళ్లు దాని సొంతం! కానీ చిన్న చిన్న మూమెంట్స్‌లో ఒక్కోసారి వెనకబడుతోంది.


కైల్‌ మేయర్స్ కాస్త ఫామ్‌ కోల్పోయాడు. అయితే సీఎస్కేపై చెన్నైలో అతడి వీర బాదుడు అందరికీ గుర్తుండే ఉంటుంది! మరోసారి అతడు అలాగే ఆడాలి. క్వింటన్‌ డికాక్‌ దూకుడుగా ఆడుతున్నాడు. మార్కస్‌ స్టాయినిస్‌ (Marcus Stoinis), నికోలస్‌ పూరన్‌ (Nicholas Pooran) జట్టుకు ట్రబుల్‌ షూటర్లుగా మారారు. కృనాల్‌ బ్యాటింగూ బాగానే ఉంది. ఆయుష్ బదోనీ తన ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ప్రదర్శిస్తున్నాడు. ప్రేరక్‌ మన్కడ్‌ పర్లేదు. అవేశ్‌ను తీసుకోకుండానే యుధ్‌వీర్‌, యశ్‌ ఠాకూర్‌, మొహిసిన్ ఖాన్‌, నవీనుల్‌ హఖ్‌తో పేస్‌ బండి నడిపిస్తున్నారు. స్టాయినిస్‌, మేయర్స్‌ మీడియం పేస్‌ వేయగలరు. రవి బిష్ణోయ్‌ తన గూగ్లీలతో బోల్తా కొట్టిస్తున్నాడు. కృనాల్‌, కృష్ణప్ప గౌతమ్‌, అమిత్‌ మిశ్రా అతడికి తోడుగా ఉన్నారు. సరిగ్గా ప్లాన్‌ చేస్తే.. దానిని అమలు చేస్తే లక్నో క్వాలిఫయర్‌-2కు వెళ్లగలదు!