Lucknow Super Giants vs Gujarat Titans: ఐపీఎల్ 2023 సీజన్ 24వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట లక్నో సూపర్ జెయింట్స్ (LSG) బౌలింగ్‌కు దిగనుంది.
గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహమ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
జోష్ లిటిల్, జయంత్ యాదవ్, శివం మావి, సాయి కిషోర్, కేఎస్ భరత్
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
జయదేవ్ ఉనద్కత్, కృష్ణప్ప గౌతం, డేనియల్ శామ్స్, ప్రేరక్ మన్కడ్, కరణ్ శర్మ
మూడు వారాలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్‌లో బీసీసీఐ ప్లేఆఫ్స్, ఫైనల్ జరిగే వేదికలను ప్రకటించింది. ప్లేఆఫ్స్‌లో భాగంగా క్వాలిఫయర్ - 1, ఎలిమినేటర్ చెన్నైలో జరుగనుండగా క్వాలిఫయర్ - 2, ఫైనల్ అహ్మదాబాద్ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. 2022లో కూడా ఫైనల్ (గుజరాత్ - రాజస్తాన్) అహ్మదాబాద్‌లోనే ముగియడం గమనార్హం.
మార్చి 31న మొదలైన ఈ సీజన్ లో లీగ్ దశ మ్యాచ్‌లు మే 21 వరకు జరుగనున్నాయి. మే 21న ముంబై - హైదరాబాద్, బెంగళూరు - గుజరాత్ తో ముగిసే మ్యాచ్‌లతో లీగ్ దశకు తెరపడుతుంది. అప్పటికి ఐపీఎల్ - 16 పాయింట్ల పట్టికలో టాప్ - 4 టీమ్స్ ప్లేఆఫ్స్ ఆడతాయి.
ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్, వేదికలు..
- మే 23న తొలి క్వాలిఫయర్ జరుగనుంది. టేబుల్ టాపర్స్ 1, 2వ స్థానాల్లో ఉన్న జట్లు చెన్నైలో మ్యాచ్ ఆడతాయి.
- మే 24న చెన్నైలోనే ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. 3, 4 వ స్థానాల్లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్ ఆడతాయి.
- మే 26న అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో క్వాలిఫయర్ -2 జరుగుతుంది. ఎలిమినేటర్ విజేత, క్వాలిఫయర్ -1లో ఓడిన జట్టు ఈ మ్యాచ్ లో తలపడతాయి.
- మే 28న క్వాలిఫయర్ - 1, 2 లలో విజేతగా నిలిచిన జట్లు అహ్మదాబాద్ లోనే ఫైనల్స్ ఆడతాయి. ఈ మ్యాచ్ తర్వాత లీగ్‌కు ఎండ్ కార్డ్ పడుతుంది.