LSG Vs DC, IPL 2022 LIVE: అదరగొట్టిన లక్నో - ఢిల్లీపై ఆరు వికెట్లతో విజయం
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. మొదటి బంతికే దీపక్ హుడా అవుటయ్యాడు. ఆయుష్ బదోని ఫోర్, సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 19.4 ఓవర్లు ముగిసేసరికి లక్నో 155-4 స్కోరును సాధించి మ్యాచ్‌ను ముగించింది. దీంతో ఆరు ఓవర్లతో విజయం సాధించింది.
కృనాల్ పాండ్యా 19(14)
ఆయుష్ బదోని 10(3)
శార్దూల్ ఠాకూర్ 3.4-0-29-1
దీపక్ హుడా (సి) అక్షర్ పటేల్ (బి) శార్దూల్ ఠాకూర్ (11: 13 బంతుల్లో)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 145-3గా ఉంది. చివరి ఓవర్లో విజయానికి ఐదు పరుగులు కావాలి.
దీపక్ హుడా 11(12)
కృనాల్ పాండ్యా 19(14)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4-0-26-0
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 131-3గా ఉంది.
దీపక్ హుడా 10(11)
కృనాల్ పాండ్యా 6(9)
శార్దూల్ ఠాకూర్ 3-0-19-0
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 126-3గా ఉంది.
దీపక్ హుడా 9(10)
కృనాల్ పాండ్యా 2(2)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3-0-12-0
ఆన్రిచ్ నార్జ్, కుల్‌దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. నార్జ్ తన రెండో బీమర్ వేయడంతో ఓవర్ మధ్యలో నుంచి కుల్‌దీప్ యాదవ్ వేయాల్సి వచ్చింది. చివరి బంతికి క్వింటన్ డికాక్ అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 122-3గా ఉంది.
దీపక్ హుడా 6(5)
కుల్‌దీప్ యాదవ్ 3.4-0-31-2
ఆన్రిచ్ నార్జ్ 2.2-0-35-0
క్వింటన్ డికాక్ (సి) సర్ఫరాజ్ ఖాన్ (బి) కుల్దీప్ యాదవ్ (80: 52 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 111-2గా ఉంది.
క్వింటన్ డికాక్ 71(48)
దీపక్ హుడా 6(5)
శార్దూల్ ఠాకూర్ 2-0-14-0
ఆన్రిచ్ నార్జ్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 104-2గా ఉంది.
క్వింటన్ డికాక్ 64(42)
దీపక్ హుడా 6(5)
ఆన్రిచ్ నార్జ్ 2-0-33-0
లలిత్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. ఎవిన్ లూయిస్ అవుటయ్యాడు. 13 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 90-2గా ఉంది.
క్వింటన్ డికాక్ 53(37)
దీపక్ హుడా 4(3)
లలిత్ యాదవ్ 4-0-21-1
ఎవిన్ లూయిస్ (సి) కుల్‌దీప్ యాదవ్ (బి) లలిత్ యాదవ్ (5: 13 బంతుల్లో)
కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 86-1గా ఉంది.
క్వింటన్ డికాక్ 53(37)
ఎవిన్ లూయిస్ 5(10)
కుల్దీప్ యాదవ్ 3-0-22-1
కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. కేఎల్ రాహుల్ అవుటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 74-1గా ఉంది.
క్వింటన్ డికాక్ 47(33)
ఎవిన్ లూయిస్ 1(2)
కుల్దీప్ యాదవ్ 2-0-15-1
కేఎల్ రాహుల్ (సి) పృథ్వీ షా (బి) కుల్దీప్ యాదవ్ (24: 25 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 70-0గా ఉంది.
క్వింటన్ డికాక్ 45(31)
కేఎల్ రాహుల్ 23(23)
అక్షర్ పటేల్ 2-0-11-0
కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 62-0గా ఉంది.
క్వింటన్ డికాక్ 38(27)
కేఎల్ రాహుల్ 22(21)
కుల్దీప్ యాదవ్ 1-0-11-0
అక్షర్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 51-0గా ఉంది.
క్వింటన్ డికాక్ 37(25)
కేఎల్ రాహుల్ 12(17)
అక్షర్ పటేల్ 1-0-3-0
ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 48-0గా ఉంది.
క్వింటన్ డికాక్ 36(24)
కేఎల్ రాహుల్ 10(12)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 2-0-8-0
ఆన్రిచ్ నోర్జే వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 45-0గా ఉంది.
క్వింటన్ డికాక్ 35(20)
కేఎల్ రాహుల్ 9(10)
ఆన్రిచ్ నోర్జే 1-0-19-0
లలిత్ యాదవ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 26-0గా ఉంది.
క్వింటన్ డికాక్ 16(14)
కేఎల్ రాహుల్ 9(10)
లలిత్ యాదవ్ 2-0-14-0
శార్దూల్ ఠాకూర్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 15-0గా ఉంది.
క్వింటన్ డికాక్ 6(9)
కేఎల్ రాహుల్ 8(9)
శార్దూల్ ఠాకూర్ 1-0-7-0
జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 149-3గా ఉంది. లక్నో విజయానికి 120 బంతుల్లో 150 పరుగులు కావాలి. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడం విశేషం.
రిషబ్ పంత్ 39(36)
సర్ఫరాజ్ ఖాన్ 36(28)
జేసన్ హోల్డర్ 4-0-30-0
అవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 142-3గా ఉంది.
రిషబ్ పంత్ 36(33)
సర్ఫరాజ్ ఖాన్ 33(25)
అవేష్ ఖాన్ 3-0-32-0
జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 136-3గా ఉంది.
రిషబ్ పంత్ 31(28)
సర్ఫరాజ్ ఖాన్ 32(24)
జేసన్ హోల్డర్ 3-0-23-0
అవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 130-3గా ఉంది.
రిషబ్ పంత్ 29(26)
సర్ఫరాజ్ ఖాన్ 29(20)
అవేష్ ఖాన్ 2-0-26-0
ఆండ్రూ టై వేసిన ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 117-3గా ఉంది.
రిషబ్ పంత్ 28(25)
సర్ఫరాజ్ ఖాన్ 17(15)
ఆండ్రూ టై 3-0-28-0
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 99-3గా ఉంది.
రిషబ్ పంత్ 12(20)
సర్ఫరాజ్ ఖాన్ 16(14)
రవి బిష్ణోయ్ 4-0-22-2
ఆండ్రూ టై వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 14 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 90-3గా ఉంది.
రిషబ్ పంత్ 6(17)
సర్ఫరాజ్ ఖాన్ 13(11)
ఆండ్రూ టై 2-0-10-0
కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 13 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 87-3గా ఉంది.
రిషబ్ పంత్ 5(15)
సర్ఫరాజ్ ఖాన్ 11(7)
కృనాల్ పాండ్యా 2-0-12-0
కృష్ణప్ప గౌతమ్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 80-3గా ఉంది.
రిషబ్ పంత్ 3(13)
సర్ఫరాజ్ ఖాన్ 6(3)
కృష్ణప్ప గౌతమ్ 4-1-23-1
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. రొవ్‌మన్ పావెల్ అవుటయ్యాడు. 11 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 80-3గా ఉంది.
రిషబ్ పంత్ 3(7)
సర్ఫరాజ్ ఖాన్ 6(3)
రవి బిష్ణోయ్ 3-0-13-2
రొవ్‌మన్ పావెల్ (బి) రవి బిష్ణోయ్ (3: 10 బంతుల్లో)
కృష్ణప్ప గౌతమ్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 73-2గా ఉంది.
రొవ్‌మన్ పావెల్ 3(8)
రిషబ్ పంత్ 3(6)
కృష్ణప్ప గౌతమ్ 3-0-23-1
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో రెండు పరుగులు వచ్చాయి. డేవిడ్ వార్నర్ అవుటయ్యాడు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 70-2గా ఉంది.
రొవ్‌మన్ పావెల్ 2(6)
రిషబ్ పంత్ 1(2)
రవి బిష్ణోయ్ 2-0-7-1
డేవిడ్ వార్నర్ (సి) బదోని (బి) రవి బిష్ణోయ్ (4: 12 బంతుల్లో)
కృష్ణప్ప గౌతమ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. పృథ్వీ షా అవుటయ్యాడు. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 68-1గా ఉంది.
డేవిడ్ వార్నర్ 4(11)
రొవ్‌మన్ పావెల్ 1(3)
కృష్ణప్ప గౌతమ్ 2-0-20-1
పృథ్వీ షా (సి) క్వింటన్ డికాక్ (బి) కృష్ణప్ప గౌతమ్ (61: 34 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు)
కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 57-0గా ఉంది. పృథ్వీ షా అర్థ సెంచరీ పూర్తయింది.
పృథ్వీ షా 51(31)
డేవిడ్ వార్నర్ 4(11)
కృనాల్ పాండ్యా 1-0-5-0
ఆండ్రూ టై వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 52-0గా ఉంది.
పృథ్వీ షా 47(27)
డేవిడ్ వార్నర్ 3(9)
ఆండ్రూ టై 1-0-7-0
రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 45-0గా ఉంది.
పృథ్వీ షా 40(22)
డేవిడ్ వార్నర్ 3(8)
రవి బిష్ణోయ్ 1-0-5-0
అవేష్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 40-0గా ఉంది.
పృథ్వీ షా 35(17)
డేవిడ్ వార్నర్ 3(7)
అవేష్ ఖాన్ 1-0-13-0
జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 27-0గా ఉంది.
పృథ్వీ షా 22(12)
డేవిడ్ వార్నర్ 3(6)
జేసన్ హోల్డర్ 2-0-18-0
కృష్ణప్ప గౌతమ్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 13-0గా ఉంది.
పృథ్వీ షా 11(7)
డేవిడ్ వార్నర్ 2(5)
కృష్ణప్ప గౌతమ్ 1-0-9-0
జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 4-0గా ఉంది.
పృథ్వీ షా 3(3)
డేవిడ్ వార్నర్ 1(3)
జేసన్ హోల్డర్ 1-0-4-0
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రోమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ఆన్రిచ్ నార్జ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఎవిన్ లూయిస్, కృష్ణప్ప గౌతమ్, దీపక్ హుడా, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
ఐపీఎల్ 2022లో ఓ అద్భుతమైన మ్యాచ్‌కు రంగం సిద్ధం అయింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తలపడుతున్నాయి. రెండు జట్లలోనూ మంచి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌లు బాగుంది. భారత జట్టుకు భవిష్యత్తు సారథులుగా భావిస్తున్న కేఎల్ రాహుల్ (KL Rahul), రిషభ్ పంత్ (Rishabh Pant)లో గెలుపెవరిది?
ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్, లక్నో సారథి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అంటే ఇష్టపడని వారుండరు. ఎందుకంటే బ్యాటింగ్ ఇంత ఈజీగా ఉంటుందా అన్నట్టు వారి షాట్లు ఉంటాయి. అందుకే ఈ మ్యాచ్‌పై ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ మ్యాచుకు ముందు లక్నో (LSG) మూడింట్లో రెండు గెలిచింది. సూపర్ జోష్‌లో ఉంది. ఢిల్లీ (DC) రెండు ఆడితే ఒకటి గెలిచి మరొకటి ఓడింది.
డీవై పాటిల్‌లో (DY Patil Stadium) తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 170 పైగా ఉంది. టాస్ కీలకమే అయినా టార్గెట్లను డిఫెండ్ చేసుకోవడం సాధ్యమవుతోంది. కాబట్టి డ్యూతో సంబంధం లేకుండా పోటీ ఉండొచ్చు. ఢిల్లీతో పోలిస్తే లక్నో డెత్ బౌలింగ్ కాస్త వీక్‌గా ఉంది. అవేశ్ ఖాన్ (Avesh khan) ఒక్కడిపైనే ఆధార పడాల్సి వస్తోంది. విదేశీ పేసర్లు మరింత మెరుగ్గా వేస్తే బెటర్.
* ఈ మ్యాచుకు డేవిడ్ వార్నర్ (David Warner), ఆన్రిచ్ నార్జ్ (Anrich Nortje) అందుబాటులో ఉంటారు. వారి క్వారంటైన్ పూర్తైంది. వీరిద్దరి రాకతో ఢిల్లీ మరింత భయంకరంగా మారుతుంది. పృథ్వీ షా (Prithvi Shaw)కు బెటర్ ఓపెనింగ్ పార్ట్‌నర్‌గా డేవిడ్ భాయ్ ఉంటాడు. గాయం నుంచి కోలుకున్న నార్జ్ ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి.
* ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టాయినిస్ (Marcus Stoinis) రావడంతో లక్నో డెప్త్ మరింత పెరిగింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో అతడు ఉపయోగపడతాడు. ఇప్పటికే భీకరంగా ఉన్న మిడిలార్డర్‌కు ఇప్పుడు అతడి రూపంలో మరో ఫినిషర్ దొరికాడు.
* డేవిడ్ వార్నర్‌పై రవి బిష్ణోయ్ (Ravi Bishnoi) రికార్డు బాగుంది. నాలుగు బంతుల్లో ఐదు పరుగులు ఇచ్చి రెండుసార్లు ఔట్ చేశాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ స్లో బంతులతో బోల్తా కొట్టించే అక్షర్ (Axar Patel)ను కేఎల్ రాహుల్‌పై ప్రయోగించొచ్చు. అతడు 13 బంతులేసి 14 పరుగులిచ్చి 3 సార్లు ఔట్ చేశాడు. రిషభ్ పంత్, రవి బిష్ణోయ్ ఫైటింగ్ బాగుంటుంది.
లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు (అంచనా)
కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, ఎవిన్ లూయిస్, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్య, జేసన్ హోల్డర్, అంకిత్ రాజ్‌పుత్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్
ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు (అంచనా)
డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్ /యశ్ ధుల్ /మన్‌దీప్ సింగ్, రిషభ్ పంత్, లలిత్ యాదవ్, రోమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్ యాదవ్, ఆన్రిచ్ నార్జ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
- - - - - - - - - Advertisement - - - - - - - - -