KL Rahul Marriage LSG Captailn KL Rahul, Athiya Shetty to get married later this year winter wedding Report : టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) కొత్త జీవితం ఓపెన్‌ చేయబోతున్నాడు! బాలీవుడ్‌ నటి, మోడల్‌ అతియా శెట్టి (athiyashetty)ని పెళ్లిచేసుకోబుతున్నాడు. బహుశా ఈ ఏడాది శీతకాలంలో వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుందని సమాచారం. ఇప్పటికే పెళ్లి ముహూర్తం కుదిరిందని తెలుస్తోంది.


మూడేళ్లుగా కేఎల్‌ రాహుల్‌, అతియాశెట్టి డేటింగ్‌ చేస్తున్నారు. ఏడాది క్రితం వీరిద్దరూ తమ అనుబంధం గురించి బయటకు చెప్పారు. 2022 వింటర్‌ వెడ్డింగ్‌ ముహూర్తం పెట్టారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసినట్టు పింక్‌విల్లా రిపోర్టు చేసింది. ఇప్పటికే శెట్టి ఫ్యామిలీ పెళ్లి పనులు మొదలు పెట్టారని అంటున్నారు.


టీమ్‌ఇండియా కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ వెన్నెముక. ఇప్పుడు లక్నో సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్సీ చేస్తున్నాడు. కీలకంగా మారి విజయాలు అందిస్తున్నాడు. అయితే మంగళవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచులో లక్నో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 182 పరుగుల లక్ష్య ఛేదనలో 163/2తో నిలిచింది. రాహుల్‌ 24 బంతుల్లో 30 పరుగులు చేశాడు. కాగా టీ20 కెరీర్లో వేగంగా 6000 పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. 179 ఇన్నింగ్సులు తీసుకున్నాడు. కోహ్లీతో పోలిస్తే ఐదు మ్యాచులు తక్కువే ఆడాడు.


రెండు రోజులు క్రితమే రాహుల్‌ 30వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అతియా శెట్టి అతడికి శుభాకాంక్షలు తెలియజేసింది. 'ఎక్కడైనా నీతోనే, హ్యాపీ బర్త్‌డే' అంటూ కామెంట్‌ పెట్టింది.