KKR vs PBKS IPL 2024 Head to Head records : ఇండియన్ ప్రీమియర్ లీగ్  2024... 42వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌(PBKS)తో కోల్‌కత్తా (KKR)తలపడనుంది. పాయింట్ల పట్టికలో రెండు జట్లతో భిన్నంగా ఉంది. కోల్‌కతా ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. పంజాబ్‌ ఇప్పటివరకూ ఎనిమిది మ్యాచులు ఆడి ఆరు మ్యాచుల్లో ఓడిపోయి రెండే మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి పంజాబ్‌పై కోల్‌కత్తాదే  పైచేయి ఉంది. రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన పంజాబ్‌పై కోల్‌కత్తా స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. 


హెడ్‌ టు హెడ్‌ రికార్డులు
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 32 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో కోల్‌కత్తా 22 సార్లు విజయం సాధించింది. పంజాబ్‌ 11 సార్లు విజయం సాధించింది. 2012, 2014 సంవత్సరాల్లో కోల్‌కత్తా టైటిళ్లు విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో కోల్‌కత్తా మాజీ ఓపెనర్‌ గంభీర్‌ 492 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేశాడు. తర్వాత 438 పరుగులతో రాబిన్ ఉతప్ప రెండో స్థానంలో ఉన్నాడు. ఆండ్రూ రస్సెన్‌ 402 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ రెండు జట్ల మధ్య పంజాబ్‌పై కోల్‌కత్తా బౌలర్‌ 33 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. తర్వాత పేస్ బౌలర్ ఉమేష్ యాదవ్ 19 వికెట్లతో రెండో స్థానంలో, పీయూష్ చావ్లా 14 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. 2018 సీజన్‌లో కోల్‌కత్తా.... 245 పరుగుల భారీ స్కోరు చేసింది. సునీల్ నరైన్, దినేష్ కార్తీక్ అర్ధ సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌  214 పరుగులకే ఆలౌటైంది. 2014 ఎడిషన్‌లో పంజాబ్‌ 132 పరుగుల అత్యల్ప స్కోరు చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ విజయం సాధించింది. కోల్‌కత్తాను కేవలం 109 పరుగులకే ఆలౌట్‌ చేసింది. 



కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), కెఎస్ భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్ మరియు ముజీబ్ ఉర్ రెహమాన్


పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్‌), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్యా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.