IPL 2025 GT Latest Updates: మాజీ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ కు ఎదురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికాకు చెందిన స్టార్ పేసర్ కగిసో రబాడ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనమయ్యాడు. ఇప్పటివరకు గుజరాత్ మూడు మ్యాచ్ లు ఆడగా, రబాడ రెండు మ్యాచ్ లలో ఆడాడు. పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పై బరిలోకి దిగి ఒక్కోటి చొప్పున టోటల్ గా రెండు వికెట్లు తీశాడు. ఇక బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో రబాడ బరిలోకి దిగలేదు. అతని స్థానంలో అర్షద్ ఖాన్ ఆడాడు. తను ఆరంభంలోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వికెట్ తీశాడు. ఇక రబాడ ఎంతకాలం టోర్నీకి గైర్హాజరు అవుతాడో స్పష్టత లేదు. దీనిపై అటు రబాడ కానీ, ఇటు ఫ్రాంచైజీ యాజమాన్యం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్లతో గెలిచి, గుజరాత్ మంచి జోరుమీదుంది.
ముంబైని వీడిన జైస్వాల్..దేశవాళీల్లో ముంబైకి ఆడే భారత టెస్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తాజాగా తను గోవాక ఆడాలిని నిర్ణయం తీసుకుని, ముంబైని సంప్రదించాడు. దీనికి ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా ఓకే చెప్పింది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇక ఈ ఏడాది నుంచి దేశవాళీల్లో క్రికెటర్లు ఆడాలని బీసీసీఐ రూల్ తేవడంతో భారత క్రికెటర్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నారు. ఇటీవల ముంబై తరపున బరిలోకి దిగిన జైస్వాల్.. ఇకపై గోవా నుంచి బరిలోకి దిగనున్నాడు. గతంలో ముంబై నుంచి గోవాకు ఆడిన వాళ్లలో అర్జున్ టెండూల్కర్, సిద్దేశ్ లాడ్ ఆడారు.
సన్ రైజర్స్ లో రెండు మార్పులు.. కోల్ కతా నైట్ రైడర్స్ తో గురువారం కోల్ కతాలో ప్రారంభమైన లీగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో రెండు మార్పులు చేసింది. శ్రీలంకకు చెందిన ఆల్ రౌండర్ కమిందు మెండిస్, సిమర్జిత్ సింగ్ లకు తుదిజట్టులో చోటు కల్పించింది. దీంతో అభినవ్ మనోహర్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్లుగా పరిస్థితులను బట్టి ట్రావిస్ హెడ్, వియాన్ మల్డర్ లలో ఒకరు బరిలోకి దిగుతారు. హెడ్ బరిలోకి దిగేందుకు ఎక్కువగా అవకాశముంది. ఇక టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లో చెరో విజయాన్ని సాధించి రెండు పాయింట్లతో సన్, కేకేఆర్ నిలిచాయి. రాజస్థాన్ రాయల్స్ పై నెగ్గి, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్ ఓడిపోయింది. ఇక ఆర్ ఆర్ పైనే నెగ్గిన కేకేఆర్.. ఆర్సీబీ, ముంబై చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గెలవడం ఇరుజట్లకు కీలకంగా మారింది.