Mohammed Shami Relatives Fraud: భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ పేరు అనుకోకుండా వివాదంలోకి వచ్చింది. తన కుటుంబ సభ్యులు స్కామ్ కు పాల్పడినట్లుగా తేలడంతో, షమీ పేరును యూస్ చేసి వార్తా కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహలో జరిగింది. తాజాగా దీనిపై అధికారులు, పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిదంటే.. యూపీలోని అమ్రోహలో షమీ సోదరి షబీనా నివాసం ఉంటోంది. అయితే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పని చేయకుండానే షబీనా కుటుంబం డబ్బులు తీసుకుంటోందని వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన అధికారలకు ఇవి నిజమేనని తెలిసింది. దీంతో షబీనా, ఆమె భర్త ఘజన్వీ, ఆమె బావలు ఆమిర్ సుహైల్, నస్రుద్దీన్, షేక్ లతోపాటు ఈ స్కామ్ కి ప్రధాన సూత్రధారి అయిన షబీనా అత్త, ఆ గ్రామ పెద్ద గులే ఆయేషా, అమె కొడుకులు, కూతుర్లపై కేసు నమోదు చేయమని జిల్లా మెజిస్ట్రేట్ నిధి గుప్తా వాట్స్ అదేశించారు.
2021 నుంచే.. నిజానికి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేయనప్పటికీ, షబీనా అండ్ కో అంతా 2021 నుంచే జాబు కార్డుల్లో పేరు నమోదు చేసుకుని, నిధులు తీసుకుంటున్నట్లు తేలింది. ఇదంతా షబీనా అత్త ఆయేషా పర్యవేక్షణలోనే జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమొత్తం దుర్వినియోగం అయింది మాత్రం తెలియడం లేదు. అయితే ఈ నిధులను తిరిగి వారి నుంచి రాబట్టడానికి ప్రయత్నిస్తామని అధికారులు చెబుతున్నారు. దీనిపై లోతైన విచారణ చేస్తున్నామని, త్వరలోనే ఇది కొలిక్కి వస్తుందిని పేర్కొన్నరు.
అధికార్ల పాత్రపైనా..ఇక ఈ స్కామ్ లో అధికార్ల పాత్రపైన దర్యాప్తు జరుగుతోంది. స్థానిక విలేజ్ డెవలప్మెంట్ అధికారి, అసిస్టెంట్ ప్రొగ్రామ్ ఆఫీసర్, ఆపరేటర్, గ్రామ్ ప్రధాన్, ఆమె అనుచరులపైనా దర్యాప్తు జరుగుతోందని సమాచారం. ఇక తాజా ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఒక ఇండియన్ క్రికెటర్ కుటుంబ సభ్యులు ఇలాంటి స్కామ్ కు ఎలా పాల్పడ్డారాని సోషల్ మీడియాలో నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. ఇక, షమీ వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందులో ఉన్న సంగతి తెలిసిందే. అతని భార్య ఇష్రాత్ జహాన్.. షమీపై ఫిక్సింగ్ ఆరోపణలు సహా చాలా చేసి, విడాకులకు ప్రయత్నిస్తోంది. అలాగే అతడు, అతని కుటుంబ సభ్యులపై డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెట్టినట్లు సమాచారం. షమీ ఏకైకా కుమార్తె కూడా ఇష్రత్ ఆధీనంలోనే ఉంది. 2023లో గాయం బారిన పడి, గతేడాదే టీమిండియా లోకి అడుగు పెట్టిన షమీ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత తుది జట్టులో సభ్యునిగా ఉన్నాడు. ఐపీఎల్లో తన ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గురువారం డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ మ్యాచ్ ఆడనుంది.