Jake Fraser-McGurk : జేక్ ఫ్రెజర్..! 22 ఏళ్లు ఈ కుర్రాడు ఈ ఐపీఎల్ కే సరికొత్త ఊపును తీసుకొస్తున్నాడు. నిన్న ముంబయిపై 27 బాల్స్ లోనే 84 పరుగులతో రఫ్పాడించాడు. ఇదొక్కటనే కాదు...మొత్తంగా ఈ ఐపీఎల్ లో 104 బాల్స్ ఫేస్ చేయగా..అందులో 77 బాల్స్ ను బౌండరీలుగా కొట్టేందుకే షాట్స్ ఆడాడు. ప్రతి 4 బాల్స్ లో 3 బౌండరీలే కొట్టాలన్న ఊపుతో ఉన్నాడు. అలా సాగుతోంది మనోడి విధ్వంసం. ఈ ఐపీఎల్ లో 5 మ్యాచులు ఆడగా.. 237కుపైగా స్ట్రైక్ రేట్ తో 247 పరుగులు కొట్టాడు. ఎలాంటి బెదురు లేకుండా అతడు ఆడుతున్న తీరు అద్భుతం. ఐపీఎల్ అనే కాదు...మనోడి బ్యాటింగ్ తీరే అంతా. వన్డే ఐనా.. టీ20 ఐనా బాదుడు ఒక్కటే తెలుసు.
లిస్ట్ -a క్రికెట్ లో 29 బాల్స్ లో సెంచరీ కొట్టి ఏబీడెవిలియర్స్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇంకా..టీ20 క్రికెట్ లోనూ 30 బాల్స్ లోనే సెంచరీ కొట్టి క్రీస్ గేల్ రికార్డు తుడిచిపెట్టాడు. ఇలా.. ఒకటా రెండా మనోడి స్పీడ్ కు మున్ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలి. ఇతడే కాదు SRH బ్యాటర్ ట్రావెస్ హెడ్ కూడా ప్రతి 2 బాల్స్ లో ఒక బాల్ బౌండరీ కొట్టడానికే ట్రై చేస్తున్నాడు. సో.. ఒకవేళ జేక్ ఫ్రెజర్ కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే..వీరిద్దరే టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వస్తే ఇక అపోజిట్ టీమ్స్ కు దబిడి దిబిడే.. ఫ్రెండ్స్ ఏమంటారు అంతే కదా..!