Salaries Of Pakistani Players In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదటి సీజన్ 2008లో జరిగింది. ఈ సీజన్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు కూడా ఆడే అవకాశం లభించింది. టీ20 ఫార్మాట్‌లో తొలిసారిగా ప్రపంచ క్రికెట్‌లోని అత్యుత్తమ ఆటగాళ్లను భారత అభిమానులు చూసారు. ఐపీఎల్ తొలి సీజన్‌లో ఆడే అవకాశం పొందిన పాకిస్థాన్ ఆటగాళ్లలో షాహిద్ అఫ్రిది, సోహైల్ తన్వీర్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.


ఐపీఎల్ తొలి సీజన్‌లో పాకిస్థాన్‌కు చెందిన మొత్తం 11 మంది ఆటగాళ్లకు ఆడే అవకాశం లభించింది. వీరిలో కొంతమంది ఆటగాళ్లను తమ జట్టులో చేర్చుకోవడానికి ఫ్రాంచైజీలు కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి.


ఐపీఎల్ తొలి సీజన్‌లో షాహిద్ అఫ్రిది మొత్తం రూ.2.71 కోట్లు వేతనంగా అందుకున్నాడు. షాహిద్ అఫ్రిది తొలి సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ జట్టులో ఉన్నాడు. షోయబ్ అక్తర్ ఐపీఎల్ తొలి సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అతనికి రూ. 1.7 కోట్ల మొత్తం లభించింది.


ఐపీఎల్ తొలి సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ తరఫున పాకిస్థాన్ బౌలర్ సోహైల్ తన్వీర్ బంతితో కీలక పాత్ర పోషించాడు. కేవలం రూ.40.16 లక్షలకే సొహైల్ తన్వీర్‌ను రాజస్థాన్ జట్టు తమ జట్టులోకి చేర్చుకుంది.


ఈ ఆటగాళ్లతో పాటు సల్మాన్ బట్ కూడా ఐపీఎల్ మొదటి సీజన్‌లో ఆడాడు. అతడిని కోల్‌కతా నైట్ రైడర్స్ తన జట్టులో రూ.40.16 లక్షలకు చేర్చుకుంది. మహమ్మద్ హఫీజ్‌ను కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ. 40.16 లక్షలు చెల్లించి సొంతం చేసుకుంది. పాకిస్థానీ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్‌ను కూడా కోల్‌కతానే కొనుగోలు చేసింది. మొదటి సీజన్‌లో రూ. 60.24 లక్షలకు కోల్‌కతా అతడ్ని కొనుగోలు చేసింది.


ఐపీఎల్ తొలి సీజన్‌లో పాకిస్థాన్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు రూ.2 కోట్లకు తన జట్టులో చేర్చుకుంది. దీంతో పాటు రూ.50.2 లక్షలకు మిస్బా ఉల్ హక్ ఆర్సీబీ జట్టులో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్‌లో యూనిస్ ఖాన్ రూ.90.36 లక్షలు జీతం అందుకున్నాడు. తొలి సీజన్‌లో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆసిఫ్‌ను ఢిల్లీ జట్టు రూ.2.61 కోట్లకు కొనుగోలు చేసింది.


మరో వైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ వరస్ట్ సీజన్లలో ఒకటిగా 2023 నిలిచింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే రైజర్స్ ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అవ్వకుండా ఇంటి బాట పట్టింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 34 పరుగులతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితం అయింది.


గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (101: 58 బంతుల్లో, 13 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్ కెరీర్‌లో గిల్‌కు ఇదే మొదటి సెంచరీ. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (64: 44 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) అర్థ సెంచరీతో అత్యధిక పరుగులు సాధించాడు. ఆఖర్లో భువనేశ్వర్ కుమార్ (27: 26 బంతుల్లో, మూడు ఫోర్లు), మయాంక్ మార్కండే (18: 9 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కొంచెం ప్రయత్నించారు. మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా దారుణంగా విఫలం అయింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీకి నాలుగు వికెట్లు దక్కాయి.