సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ వేలంలో దుమ్ము రేపుతుంది. తన పర్స్‌లో సగం మొత్తాన్ని కేవలం ఇద్దరు ఆటగాళ్ల మీదనే ఖర్చు పెట్టింది. ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను రూ.13.25 కోట్లకు దక్కించుకుంది. ఇక భారత బ్యాటర్, కెప్టెన్ మెటీరియల్ మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25 కోట్లకు దక్కించుకుంది. కేవలం వీరిద్దరి మీదనే సన్‌రైజర్స్ రూ.21.5 కోట్లను ఖర్చుపెట్టింది.
సన్‌రైజర్స్ పర్స్‌లో ఇంకా రూ.20.75 కోట్లు ఉన్నాయి. వేలంలో ఇంకా శామ్ కరన్, బెన్ స్టోక్స్ వంటి క్రేజీ ప్లేయర్స్ ఉన్నారు. వీరిపై కూడా సన్‌రైజర్స్ కన్నేసే అవకాశం ఉంది. ఈ వేలంలో మొదటి నుంచి సన్‌రైజర్స్ అగ్రెసివ్‌గానే దూసుకెళ్లింది. ఇక మిగతా జట్ల విషయానికి వస్తే... కేన్ విలియమ్సన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఫాంలో ఉంటే కేన్ విలియమ్సన్ ఎంత ప్రమాదకరమైన ఆటగాడో అందరికీ తెలిసిందే.