GT Vs CSK Latest Updates: అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మరో రసవత్తర పోరు జరుగుతోంది.  నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్  బౌలింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ ‌కు అనుకూలం. టాస్ నెగ్గే జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. గిల్ కూడా అదే పని చేశాడు. చెన్నై టీం నుంచి రహానే, గ్లీసన్ బయటికెళ్లగా గుజరాత్ టీం నుంచి సాహా, సుతార్,లిటిల్ ఔటయ్యారు. 


చెన్నైకి కీలకం.. గుజరాత్‌కి గెలిచినా ప్రయోజనం లేదు.. 


పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న గుజరాాత్, ప్లే ఆఫ్ రేసులో ఉన్న చెన్నైతో తలపడుతోంది.  ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిచినా ప్రయోజనం లేదు.  కానీ అధికారికంగా ఎలిమినేషన్ కొంత ఆలస్యమవుతుంది. చెన్నై గెలిస్తే 14 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్ బెర్తుకు దగ్గరలో కి వెళ్తుంది.  పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్‌ని వెనక్కి నెట్టి..  మూడో స్థానానికి వస్తుంది.


వీళ్లు కీలకం.. 


చెన్నైకి బౌలింగ్ విభాగంలో కీలకంగా వ్యవహరించిన పతిరణ, ముస్తఫిజుర్‌లు ఇప్పటికే టీమ్ వీడటంతో తుషార్ దేశ్ పాండే, సమర్ జిత్, శార్దూల్, జడేజా తదితరులు కీలకంగా మారనున్నారు.  బ్యాటింగ్‌ విషయానికొస్తే  కెప్టెన్ రుతురాజ్ 541 పరుగులతో  మంచి టచ్లో ఉన్నాడు.  అతన్ని ఎలా ఆపడమనేదే గుజరాత్ ముందున్న మొదటి సవాలు.  శివమ్ ధూబే, ధోని వంటి వాళ్ల నుంచి కూడా  అభిమానులు కీలక ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.  ఇక  గుజరాత్ బౌలింగ్ విషయానికొస్తే..ఈ సీజన్లో 8 వికెట్లే తీసుకున్న రషీద్ ఖాన్ పెద్దగా ప్రభావం చూపట్లేదు. కానీ శివమ్ ధూబే అతని బౌలింగ్ ఎలాఎదుర్కుంటాడనేది ఆసక్తికరంగా మారింది.  లాస్ట్ రెండు మ్యాచ్‌లు ధూబే స్పిన్ బౌలింగ్ ఎదుర్కోలేక డకౌట్ అయ్యాడు. గుజరాత్ టైటన్స్ టీమ్ బ్యాటింగ్ లోనూ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.  కెప్టెన్ శుభ్ మన్ గిల్ చివరి 5 ఇన్నింగ్స్ లో 67 రన్స్  మాత్రమే చేశాడు.  గెలిస్తేనే నిలిచే గేమ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడతాడని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నరేంద్ర మొదీ గ్రౌండ్ లో గిల్ బ్యాటింగ్ యావరేజ్ కూడా బాగుంది.  సీఎస్కే ఫ్రంట్ లైన్ బౌలర్లు.. మతీషా పతిరాణా, ముస్తఫిజుల్ రహమాన్, దీపక్ చాహర్.. లాంటి వాళ్లు లేకపోయినా  తుషార్ దేశ్ పాండే, సర్ రవీంద్ర జడేజా... ముందుకొచ్చి పంజాబ్ మీద గెలిపించారు.  


హెడ్ టు హెడ్ 


ఇప్పటి వరకు గుజరాత్, చెన్నై ఆరు మ్యాచులలో తలపడగా చెరి మూడు సార్లు గెలిచారు. గతేడాది ఫైనల్లో జీటీ పై చెన్నై చివరి బంతికి గెలిచింది. అలాగే ఈ రెండు ఈ సీజన్లో గతంలో తలపడ్డప్పుడు చెపాక్ లో గుజరాత్ పై చెన్నై పూర్తి ఆదిపత్యం చూపింది. గుజరాత్ భారీ ఓటమి చవిచూసింది. కానీ నరేంద్రమోదీ స్టేడియంలో సీఎస్కేకి..  గుజరాత్ తో పోరు  అంత ఈజీ కాదు.


గుజరాత్ టీం XI


శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, షారుఖ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మథ్యూ వేడ్, రాహుల్ అ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, కార్తీక్ త్యాగి


చెన్నై టీమ్ XI


రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్),  రవీంద్ర జడేజా, డారిల్ మిచెల్, శివమ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ధోనీ, మిచెల్ శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్ పాండే, సమర్ జీత్ సింగ్