Go Digit IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల వరుస ప్రవేశాలు కొత్త పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నాయి. సెలబ్రిటీల దగ్గరి నుంచి సాధారణ రిటైల్ ఇన్వెస్టర్ల వరకు అందరూ తమ డబ్బును తక్కువ కాలంలోనే రెట్టింపు చేసుకునేందుకు ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. రానున్న వారంలో సైతం ఐపీవోల రద్దీ మార్కెట్లలో కొనసాగుతూనే ఉంది.


మే 15న రిటైల్ ఇన్వెస్టర్ల కోసం గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇష్యూ ప్రారంభం అవుతుంది. వాస్తవానికి ఈ కంపెనీలో భారతీయ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ పెట్టుబడి పెట్టడం చాలా మంది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకోసం ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.258 నుంచి రూ.272గా నిర్ణయించింది. ఈక్విటీలు వద్దు ఐపీవోలో ముద్దంతున్న నేటి తరం ఇన్వెస్టర్లు కోహ్లీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధమౌతున్నారు. ప్రస్తుతం గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లు ఒక్కో షేరుకు రూ.50 ప్రీమియం రేటు పలుకున్నాయి. ఈ లెక్కన కంపెనీ షేర్లు లిస్టింగ్ రోజున సుమారు రూ.322 వద్ద అరంగేట్రం చేయవచ్చని అంచనాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే తొలిరోజు ఇన్వెస్టర్లకు 18.38 శాతం లాభం అందుకుంటారు.


రిటైల్ పెట్టుబడిదారులు ఈ ఇన్సూరెన్స్ కంపెనీ ఐపీవోలో పాల్గొనేందుకు మే 15 నుంచి మే 17 వరకు అవకాశం ఉంది. ఇందుకోసం లాట్ పరిమాణాన్ని 55 షేర్లుగా నిర్ణయించింది. ఎవరైనా ఇన్వెస్టర్ ఇందులో పాల్గొనాలంటే లాట్ కోసం రూ.14,960 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం షేర్ల కేటాయింపు మే 21న, లిస్టింగ్ మే 23న ఉండొచ్చని తెలుస్తోంది. కంపెనీ షేర్లు ఈ క్రమంలో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో షేర్లు జాబితా అవనున్నాయి. కంపెనీ ప్రమోటర్ గో డిజిట్ ఇన్ఫోవర్క్స్, ఇతర షేర్ హోల్డర్లు ఐపీవోలో షేర్ల విక్రయం ద్వారా తమ వాటాలను కంపెనీలో తగ్గించుకుంటున్నారు. గో డిజిట్‌లో ఎఫ్‌ఎంఎల్ కార్పొరేషన్ మొత్తం వాటా 45.30 శాతం, కమేష్ గోయల్ 14.96 శాతం, ఒబెన్ వెంచర్స్ LLP 39.79 శాతం కంపెనీలో వాటాలను హోల్డ్ చేస్తున్నాయి. 


విరాట్ కోహ్లీ 2020లో ఈ కంపెనీలో రూ.2 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దీనికింద కంపెనీలో 2.66 లక్షల షేర్లను కోహ్లీ పొందారు. ఇదే క్రమంలో ఆయన భార్య అనుష్క శర్మ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ఐపీవో తర్వాత కూడా వీరు తమ వాటాలను అలాగే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ సంస్థ IRDAI ఐపీవో ఫ్లోట్ చేస్తున్న గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీపై రూ.కోటి ఫైన్ విధించింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్‌పై కంపల్సరీగా కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్ల మార్పిడి నిష్పత్తిలో మార్పును వెల్లడించనందుకు ఈ జరిమానా విధించింది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు కంపెనీ ఐపీవోలో పెట్టుబడి పెట్టడానికి ముందు పూర్తిగా తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఐపీవో మెయిన్ కేటగిరీలో వస్తోంది.


Also Read: తర్వలోనే మహా సంక్షోభం.. వార్నింగ్ బెల్, మ్యాటర్ ఏంటంటే?