2023-27 ఐదేళ్ల కాలానికి గాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల టెండర్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జే షా వరుస ట్వీట్లు చేశారు.
ఇంతకుముంది 2019-23 సంవత్సరాలకు గాను స్టార్ నెట్ వర్క్‌కు టీవీ, డిజిటల్‌తో కూడిన మీడియా హక్కులను 255 కోట్ల డాలర్లకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం సోనీ, జియో, అమెజాన్ మీడియా హక్కుల కోసం గట్టిగా పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మీడియా హక్కులను పొందడం ద్వారా అడ్వర్టైజ్మెంట్ (ప్రకటనలు)ల రూపంలో భారీ ఆదాయాన్ని పొందడానికి ప్రసారదారులకు అవకాశముంటుంది. ఇక బెట్టింగ్ సంస్థలు ప్రకటనల మీదే కోట్లు ఖర్చు చేస్తున్నాయి.
కొత్త జట్లు
ఐపీఎల్-2022లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. గత ఐపీఎల్ వరకు ఇప్పటివరకు ఎనిమిది జట్లు పోటీపడ్డాయి. వాటిలో చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లు ఉన్నాయి. కొత్తగా అహ్మదాబాద్, లఖ్‌నవూ జట్లు వచ్చి చేరాయి.
Also Read: IPL 2022, RCB vs KKR: ఆడీ ఓడిన RCB, ఛాంపియన్‌పై గెలిచిన KKR - ఈ పోరు మాములూగా ఉండదు బాసూ!
Also Read: GT Vs LSG: లక్నోపై పేలిన షమీ గన్ - గుజరాత్‌పై ఐదు వికెట్లతో గెలిచిన హార్దిక్ సేన్!