IPL Mini Auction 2023: IPL 2023 కోసం ఆటగాళ్ల వేలానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాబోయే సీజన్ కోసం ఆటగాళ్ల వేలం డిసెంబర్ 23వ తేదీన కొచ్చిలో జరగనుంది. అటువంటి పరిస్థితిలో అన్ని ఫ్రాంచైజీలు వారి బృందంలోని ప్రతి విభాగాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును పరిశీలిస్తే, అది అత్యంత సమతుల్య జట్టుగా ఉంది. ఆర్సీబీ జట్టులో చాలా మంది అంతర్జాతీయ స్థాయి బౌలర్లు ఉన్నారు. అంతే కాకుండా చాలా మంది విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌లు కూడా ఉన్నారు. కానీ వికెట్‌కీపర్‌గా మాత్రం అనుభవం ఉన్న దినేష్ కార్తీక్ ఒక్కడే ఉన్నాడు. వయసు పెరగడం దినేష్ కార్తీక్ ముందున్న పెద్ద సమస్య. అటువంటి పరిస్థితిలో అతనికి కొన్ని మ్యాచ్‌లలో విశ్రాంతి కూడా ఇవ్వవచ్చు. ఈ పరిస్థితిలో అతనికి జట్టులో ఎవరు బ్యాక్ అప్?
అనుజ్ రావత్‌ను ట్రై చేయవచ్చు
RCBలో IPL వేలం 2023 కోసం ఏడు స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. దీని కారణంగా ఫ్రాంచైజీ వేలంలో ఐదుగురు భారతీయ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చు. ఆర్‌సీబీ పర్స్‌లో రూ.8.75 కోట్లు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, వేలం సమయంలో కొంతమంది నాణ్యమైన స్పిన్నర్లకు జట్టు మొగ్గు చూపవచ్చు. దీంతోపాటు ఫ్రాంచైజీ వికెట్ కీపర్‌ని చేర్చుకునే ఆలోచనలో కూడా ఉండవచ్చు.
ఆర్సీబీ వికెట్ కీపింగ్ కోసం దినేష్ కార్తీక్‌పై ఆధారపడి ఉంది. గత సీజన్‌లో వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా కార్తీక్ రెచ్చిపోయాడు. వయోభారం కారణంగా కార్తీక్ కొన్ని మ్యాచ్‌ల్లో విశ్రాంతి తీసుకుంటే, అనూజ్ రావత్ జట్టులో అతనికి బ్యాకప్‌గా ఉన్నాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన అనూజ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్.
అదరగొట్టిన కార్తీక్
ఐపీఎల్ చివరి సీజన్‌లో దినేశ్ కార్తీక్ ఆర్‌సీబీకి వరంలా నిలిచాడు. అద్భుతమైన వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాట్‌తో కూడా పటిష్ట ప్రదర్శన చేశాడు. IPL 2022లో కార్తీక్ RCBని చాలా మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఫినిషర్‌గా రాణిస్తూ 16 మ్యాచ్‌ల్లో 330 పరుగులు చేశాడు.