IPL 2026 Auction | నేడు (డిసెంబర్ 16న) అబుదాబిలో IPL 2026 మినీ వేలం జరగనుంది. మొత్తం 350 మందికి పైగా ఆటగాళ్ళు ఈ వేలంలో పాల్గొంటారు. పది ఫ్రాంచైజీలు కొందరి కోసం గట్టిగానే బిడ్లు వేయనున్నాయి. ఈ మినీ వేలంలో కామెరూన్ గ్రీన్, వెంకటేష్ అయ్యర్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి ప్రముఖ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు ఫోకస్ చేస్తున్నాయి. వారికి భారీ మొత్తం లభిస్తుందని అంతా భావిస్తున్నారు. మొత్తం 77 మందిని ఫ్రాంచైజీలు ఈ వేలంలో తీసుకోనున్నాయి. అభిమానులు ఐపీఎల్ 2026 మినీ వేలంను టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, JioHotstar యాప్, వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు.

Continues below advertisement

కేకేఆర్ వద్ద ఎక్కువ నగదు..

3 సార్లు ఛాంపియన్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద ఎక్కువ నగదు ఉంది. కేకేఆర్ ఏకంగా 64.3 కోట్ల రూపాయలతో అతిపెద్ద పర్స్‌తో మినీ వేలం బరిలోకి దిగుతుంది. ఎక్కువ మందిని కొనుగోలు చేసే అవకాశం కూడా కేకేఆర్ ఫ్రాంచైజీకి ఉంది. ఈ ఈవెంట్ ప్రారంభానికి ముందు, ఐపీఎల్ 2026 మినీ వేలం గురించి ఇక్కడ ముఖ్య విషయాలు అందిస్తున్నాం.

Continues below advertisement

IPL 2026 మినీ వేలం ఎప్పుడు జరుగుతుంది?

IPL 2026 మినీ వేలం నేడు (డిసెంబర్ 16న) జరుగుతుంది.

IPL 2026 మినీ వేలం ఏ సమయానికి ప్రారంభమవుతుంది?

IPL 2026 మినీ వేలం మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు (భారతదేశ కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది.

IPL 2026 మినీ వేలం ఎక్కడ జరుగుతుంది?

IPL మినీ వేలం అబుదాబిలోని ఎటిహాడ్ స్టేడియంలో జరుగుతుంది.

అందుబాటులో ఉన్న స్లాట్‌ల సంఖ్య: 10 జట్లు మొత్తం 237.55 కోట్ల రూపాయలతో ఆ 77 స్లాట్‌లను పూరించాలి.

చెన్నై సూపర్ కింగ్స్ CSK: 9 (4 విదేశీయులు)

ఢిల్లీ క్యాపిటల్స్: 8 (5 విదేశీయులు)

గుజరాత్ టైటాన్స్: 5 (4 విదేశీయులు)

కోల్‌కతా నైట్ రైడర్స్: 13 (6 విదేశీయులు)

లక్నో సూపర్ జెయింట్స్: 6 (4 విదేశీయులు)

ముంబై ఇండియన్స్: 5 (1 విదేశీయుడు)

పంజాబ్ కింగ్స్: 4 (2 విదేశీయులు)

రాజస్థాన్ రాయల్స్: 9 (1 విదేశీయుడు)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 8 (2 విదేశీయులు)

సన్‌రైజర్స్ హైదరాబాద్: 10 (2 విదేశీయులు)

ఇటీవల రిటైన్ తరువాత ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత ఉంది..

కోల్‌కతా నైట్ రైడర్స్ KKR - 64.30 రూపాయలు

చెన్నై సూపర్ కింగ్స్ CSK - 43.40 రూపాయలు

సన్‌రైజర్స్ హైదరాబాద్ SRH - 25.50 రూపాయలు

లక్నో సూపర్ జెయింట్స్ LSG - 22.95 రూపాయలు

ఢిల్లీ క్యాపిటల్స్ DC - 21.80 రూపాయలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB - రూ. 16.40

రాజస్థాన్ రాయల్స్ RR - 16.05 రూపాయలు

గుజరాత్ టైటాన్స్ GT - 12.90 రూపాయలు

పంజాబ్ కింగ్స్ PBKS - 11.50 రూపాయలు

ముంబై ఇండియన్స్ MI - 2.75 రూపాయలు

కామెరూన్ గ్రీన్, వెంకటేశ్ అయ్యర్లపై అందరి దృష్టిస్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన మాక్ ఆక్షన్‌లో కామెరూన్ గ్రీన్ ఏకంగా 30.50 కోట్లకు అమ్ముడుపోయాడు. నేటి వేలంలో కూడా ఇదే జరిగితే, గ్రీన్ IPL చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలుస్తాడు. కానీ అలా జరిగే అవకాశాలు తక్కువే. చాలా జట్ల వద్ద తక్కువ నగదు ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద 43.40 కోట్లు మిగిలి ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ వద్ద 64.30 కోట్ల రూపాయలు ఉన్నాయి. కామెరూన్ గ్రీన్ ఆల్ రౌండర్ కనుక అతడ్ని కొనడం కేకేఆర్, సీఎస్కేలకు మాత్రమే సాధ్యం. కానీ ఎంత నగదుకు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వేలంలో వెంకటేశ్ అయ్యర్ సైతం అత్యధిక ధర పలికే ఆటగాళ్లలో ఒకడిగా నిలవనున్నాడు. గత కొంతకాలం నుంచి మంచి ఇన్నింగ్సులు రాకున్నా వేలంలో మిగతా వారితో పోల్చితే వెంకటేశ్ అయ్యర్ సైతం భారీ మొత్తం అందుకునే ఛాన్స్ ఉంది.