ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) 19వ ఎడిషన్ కోసం మినీ వేలం మంగళవారం (డిసెంబర్16వ తేదీ)న అబుదాబిలో జరగనుంది. షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాను BCCI ఇప్పటికే విడుదల చేసింది. మొత్తం 10 జట్లలో కలిపి 77 స్లాట్‌లు ఖాళీగా ఉన్నాయి. అంటే గరిష్టంగా 77 మందిని మాత్రమే వేలంలో తీసుకునే ఛాన్స్ ఉంది. ఆయా జట్లకు కావాల్సిన ఖాళీలను భర్తీ చేయడానికి మినీ వేలం జరుగుతుంది. షార్ట్‌లిస్ట్ చేసిన ఆటగాళ్లలో అత్యంత పిన్న వయస్కుడు, అత్యంత పెద్ద వయసు కలిగిన ఆటగాడు ఎవరు, వారి వయస్సు, బేస్ ప్రైస్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Continues below advertisement

IPL చరిత్రలో అత్యంత చిన్న వయసు కలిగిన ఆటగాడు వైభవ్ సూర్యవంశి కాగా, రాజస్థాన్ రాయల్స్ అతన్ని రిటైన్ చేసుకుంది. రాజస్థాన్ గత ఏడాది వేలంలో అతన్ని రూ. 1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే అతని బేస్ ప్రైస్ రూ. 30 లక్షలుగా ఉంది. ఒకవేళ అతను ఈసారి కూడా వేలంలో ఉంటే, అతని ధర సులభంగా కోట్లలో ఉండేది. ఈసారి జరగనున్న వేలంలో అత్యంత చిన్న వయసు, అత్యంత పెద్ద వయసున్న ఆటగాడు ఎవరా అని క్రికెట్ ప్రేమికులు ఆసక్తి చూపుతారు. 

IPL 2026 వేలంలో అతిచిన్న వయసు ప్లేయర్ 

IPL 2026 వేలంలో అత్యల్ప వయసు కలిగిన ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన వహిదుల్లా జాద్రాన్. నవంబర్ 15, 2007న జన్మించిన వహిదుల్లాకు వేలం సమయానికి 18 సంవత్సరాల 31 రోజులు ఉంటాయి. ఆ యువకుడు అన్‌క్యాప్డ్ బౌలర్, అతని బేస్ ప్రైస్ రూ. 30 లక్షలు ఉంది.

Continues below advertisement

2007లో జన్మించిన 6 మంది ఆటగాళ్లు ఉన్నారు. 2008 లేదా ఆ తర్వాత జన్మించిన ఏ ఆటగాడు కూడా వేలంలో లేరు. జాద్రాన్ రికార్డులు పరిశీలిస్తే.. అతను 19 T20 మ్యాచ్‌లలో 28 వికెట్లు తీశాడు. జాద్రాన్ ఎకానమీ 6.72గా ఉంది. విదేశీ ప్లేయర్లకు ఎక్కువ ధర అవుతుంది కనుక, పర్సులో తక్కువ ఉన్న ఫ్రాంచైజీలు డొమోస్టిక్ ప్లేయర్లపై ఫోకస్ చేస్తున్నాయి.

IPL 2026 వేలంలో అత్యంత పెద్ద వయస్కుడు 

IPL 2026 వేలంలో అత్యంత పెద్ద వయసు కలిగిన ఆటగాడు జలజ్ సక్సేనా. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడే ఆల్ రౌండర్ వేలానికి ఒక రోజు ముందు సక్సేనా 39వ పుట్టినరోజు జరుపుకుంటాడు. సక్సేనా డిసెంబర్ 15, 1986న ఇండోర్‌లో జన్మించాడు. 1986 లేదా ఆ తర్వాత జన్మించిన ఏ ఆటగాడు కూడా వేలంలో లేడని తెలిసిందే. జలజ్ సక్సేనా ఓ అన్‌క్యాప్డ్ ఆటగాడు. వేలంలో ఈ డొమోస్టిక్ ప్లేయర్ అతని బేస్ ప్రైస్ రూ. 40 లక్షలుగా ఉంది.

IPL 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున జలజ్ సక్సేనా అరంగేట్రం చేశాడు. అదే అతని చివరి మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్‌లో జలజ్ 3 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దాంతో అతడికి మరో అవకాశం రాలేదు. తాజాగా ఐపీఎల్ మినీ వేలం 2026కు రిజిస్టర్ చేసుకున్నాడు. 

Also Read: Lionel Messi India Tour: మెస్సీ హైదరాబాద్‌లో ఆడకపోవడానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు! అతని కాళ్ల విలువ ఎంతో తెలుసా?