Vaibhav Suryavanshi Cast: వైభవ్ సూర్యవంశీ పరిచయం పేరు. లెజండరీ క్రికెటర్లకు కొన్ని వందల మ్యాచ్‌లు ఆడితే వచ్చే పేరు కేవలం రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంపాదించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్న ఈ చిచ్చరపిడుగు ఐపీఎల్ చరిత్రలో చిన్న వయసు క్రికెటర్ ఒక రికార్డు ఉంటే, గుజరాత్‌పై విధ్వంసకరమైన ఆటతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేశాడు. 35 బంతుల్లో సెంచరీ సాధించి సీనియర్లకు జూనియర్లకు ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చాడు. అందుకే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్, సోషల్ మీడియా అన్ని చోట్ల వైభవ్‌ పేరు మారుమోగిపోతోంది. ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది గూగుల్ చేస్తున్న ప్రశ్న ఒకటి ఉంది. అదే కులం. వైభవ్‌ సూర్యవంశీ ఏ కులానికి చెందినవాడో తెలుసుకోవాలని చాలా మంది చూస్తున్నారు.  

వైభవ్ కులం ఏంటీ?వైభవ్‌ సూర్యవంశీ కులానికి చెందిన వ్యక్తి. తమది సూర్యభగవానుడు వంశంగా రాజపుత్‌లు భావిస్తారు. అందుకే వైభవ్‌కు చివరన సూర్యవంశీ అని యాడ్ చేశారు. 

మిర్రర్ సెల్ఫీలు అంటే ఇష్టం!

వైభవ్ సూర్యవంశి సోషల్ మీడియా ప్రొఫైల్‌ను చూస్తే స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీపై ప్రత్యేకమైన అభిరుచి ఉందని స్పష్టమవుతుంది. ముఖ్యంగా మిర్రర్ సెల్ఫీలు, తరచుగా పంచుకుంటూ ఉంటాడు. చాలా ఫోటోల్లో iPhone 16 Pro Max కనిపిస్తుంది, దీనికి పెద్ద అభిమాని అని తెలుస్తోంది. iPhone 16 Pro Max కెమెరా ఫీచర్లు,   డిజైన్ నచ్చిందేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైభవ్‌ స్టైలిష్ లుక్  అభిమానులను ఆకట్టుకుంటోంది.  

ఇన్‌స్టాగ్రామ్‌లో పెరుగుతున్న ఫాలోవర్లు

అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కొన్ని మిర్రర్ సెల్ఫీలను పంచుకున్నాడు వైభవ్.  ఇన్నింగ్స్ తర్వాత ఫాలోవర్ల సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపించింది. @vaibhav_sooryavanshi09 అనే  అధికారిక హ్యాండిల్‌లో ప్రస్తుతం 1 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. 

ఫేస్‌బుక్‌లో కూడా యాక్టివ్‌గా వైభవ్

ఫేస్‌బుక్‌లో కూడా వైభవ్ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. వ్యక్తిగత పేజీ ‘Vaibhav Suryavanshi’ లో కూడా వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.  మొత్తంమీద, వైభవ్ సూర్యవంశి ఇప్పుడు కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, ఒక సోషల్ మీడియా ఐకాన్ కూడా అయ్యారు. 

 వైభవ్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి

వైభవ్ సూర్యవంశీ 2011 మార్చి 24న బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని మోతీపూర్‌లో జన్మించాడు. నాలుగేళ్ల నుంచే బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. 9 ఏళ్లకు పాట్నాలో క్రికెట్ అకాడమీలో చేరాడు. వైభవ్‌ విజయంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని చెబబుతాడు. "నా తల్లిదండ్రుల వల్లే నేను ఇలా ఉన్నాను. నా శిక్షణ కోసం మా అమ్మ రాత్రి 11 గంటలకు నిద్రపోయేది. తెల్లవారుజామున 2 గంటలకు లేచేది. ఆమె నిద్ర టైం కేవలం 3 గంటలే. నాకు ఆహారం పెట్టడం, నా బాగోగులు చూసుకోవడం ఆమపని.  నా ఆట కోసం  నాన్న తన ఉద్యోగాన్ని వదిలేశాడు. మా అన్నయ్య కుటుంబ బాధ్యతను చూసుకుంటున్నాడు. ఇల్లు గడవడం చాలా కష్టమయ్యేది. కానీ ఎక్కడా ఆ లోటు లేకుండా చూసుకున్నారు."

వైభవ్ సూర్యవంశి కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టి దున్నేస్తున్నాడు. ఐపీఎల్‌ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున డెబ్యూ చేసి, అతి చిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ఆయన విధ్వంసకరమైన  బ్యాటింగ్ శైలితో గుజరాత్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి కొత్త చరిత్ర సృష్టించాడు.