IPL 2025: ఢిల్లీపై లక్నో ఓటమికి రిషబ్ కారణమా? అసిస్టెంట్ కోచ్ కామెంట్స్ ఏంటీ?
Rishabh Pant LSG vs DC: లక్నో ఓటమి ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. దీనికి రిషబ్ పంత్ కారణనే విమర్శ ఉండనే ఉంది. మరోవైపు బ్యాట్స్‌మెన్ సరిగా ఆడలేదని కోచ్ చెప్పడం ఆసక్తిగా మారింది.
Rishabh Pant LSG vs DC IPL 2025: సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కేవలం ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 9 వికెట్లు నష్టపోయింది ఛేదించింది. ఆఖరి బంతి వరకు మ్యాచ్ విజయం ఎవర్ని వరిస్తుందో అన్న ఉత్కంఠ అయితే నెలకొంది.
అయితే ఇప్పుడు మ్యాచ్ ఓడిపోవడానికి రిషబ్‌పంత్ కారణమని లక్నో అభిమానులు నిందిస్తున్నారు. చివరి ఓవర్‌లో అతను చేసిన చిన్న తప్పిదం కారణంగా ఢిల్లీ గెలిచిందని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. చివరి ఓవర్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన తప్పుకారణంగా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని తిట్టిపోస్తున్నారు.
ఢిల్లీ 19 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. జట్టు గెలవడానికి ఆరు పరుగులు అవసరం. లక్నో గెలవాలంటే ఒక వికెట్ తీస్తే సరిపోతుంది. ఢిల్లీ తరఫున అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నారు. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ లాస్ట్ ఓవర్‌ను షహబాజ్ అహ్మద్‌కు ఇచ్చాడు. ఢిల్లీ నుంచి మోహిత్ స్ట్రైక్‌లో ఉన్నాడు. అహ్మద్ వేసిన బంతిని కాస్త ముందుకు వెళ్లి కొట్టే ప్రయత్నం చేశాడు మోహిత. ఆ బంతిని మిస్ అయ్యాడు. ఇంతలో స్టంపింగ్ చేసే అవకాశం వచ్చింది. కానీ రిషబ్‌పంత్ కూడా బంతిని మిస్ అవ్వడంతో స్టంపింగ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత LBW కోసం అప్పీల్ చేసి రివ్యూకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది.
సిక్స్ కొట్టి ఢిల్లీని గెలిపించిన అశుతోష్
షహబాజ్ వేసిన మొదటి బంతిని ముందుకు వచ్చి కొట్టేందుకు ప్రయత్నించిన మోహిత్ శర్మ రెండో బంతి కాలికి తగిలి వెళ్లింది. సింగిల్ తీసి అశుతోష్ శర్మకు స్ట్రైక్ ఇచ్చాడు. ఆ ఓవర్‌లోని మూడో బంతికి అశుతోష్ సిక్స్ కొట్టి ఢిల్లీ జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో అశుతోష్ 31 బంతులు ఆడి 66 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూసెనర్ కీలక వ్యాఖ్యలు చేసాడు. ఈ ఓటమికి బ్యాట్స్‌మెన్ కారణమని అన్నాడు. క్లూసెనర్ ప్రకారం, బ్యాట్స్‌మెన్ తగినంత పరుగులు చేయలేదు. 20 నుంచి 30 పరుగులు తక్కువ చేశారు. బోర్డుపై తగినంత పరుగులు ఉన్నాయని LSG కెప్టెన్ రిషబ్ పంత్ చెప్పిన తర్వాతే ఈ కామెంట్స్ చేయడం ఆసక్తిని రేపుతోంది. "టాప్-ఆర్డర్ బ్యాటర్లు నిజంగా బాగా ఆడారు. ఈ వికెట్‌పై ఇది చాలా మంచి స్కోరు అని నేను భావిస్తున్నాను" అని మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పంత్ అన్నాడు.
దక్షిణాఫ్రికా మాజీ పేసర్ క్లూసెనర్ LSG బ్యాటర్లు సరిగా ఆడలేదని చెబుతూ పంత్ వ్యాఖ్యలకు విరుద్ధంగా మాట్లాడారు. "మ్యాచ్ విషయంలో చెప్పాల్సి వస్తే బ్యాట్స్‌మెన్‌వైపు నా వేలు చూపిస్తాయి. మేము బహుశా 20 లేదా 30 పరుగులు బ్యాట్ నుంచి రావాల్సి ఉంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. అందుకే బంతితో ఒత్తిడికి గురయ్యాం" అని క్లూసెనర్‌ను అన్నట్టు జాతీయ మీడియా చెబుతోంది.
"వారు [DC] బ్యాటింగ్ అద్భుతంగా చేశారు. మంచి ముగింపు ఇచ్చారు. కానీ మేము ఆ స్థితిలో ఉండటానికి కారణం మేము తగినన్ని పరుగులు చేయకపోవడమే. బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేశారు. కొంచెం స్పిన్ అవుతోంది. కాబట్టి ఇది చాలా మంచి వికెట్ అని నేను అనుకున్నాను."
"బ్యాటింగ్ కంటే బౌలింగ్ బహుశా కొంచెం కఠినంగా ఉంటుందని నేను అనుకున్నాను, కానీ మాకు ఉన్న బ్యాటింగ్ పవర్‌తో మేము అక్కడ మరిన్ని పరుగులు చేయలేకపోయాం. మేము మళ్లీ పుంజుకుంటామని అనుకుంటున్నాను. యువకులు సానుకూలంగా ఉన్నారు. వారి సామర్థ్యంపై నమ్మకం ఉంచాలి" అని అన్నారు.
ఈ మ్యాచ్‌తో డిసి అన్‌క్యాప్డ్ ప్లేయర్ అశుతోష్‌లో కొత్త హీరో బయటకు వచ్చాడు. LSGపై మ్యాచ్‌లో అద్భుతమైన ముంగింపు ఇచ్చి క్లాస్ ఛేజ్ మాస్టర్‌లా మారాడు. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ అంటే ఏమిటో నిజంగా నిర్వచించాడు. భారాన్ని తీసుకుని డిసికి విజయాన్ని అందించాడు. ముఖేష్ కుమార్ స్థానంలో ఇంపాక్ట్ సబ్‌గా జట్టులోకి వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను కట్టిపడేసే బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. సిక్స్‌తో విజయం అందుకొని ఈ సీజన్ స్టార్‌లా మారాడు.
ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ KKR, RCB మధ్య జరిగింది. RCB 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తర్వాత రాజస్థాన్‌ను 44 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓడించింది. మూడో మ్యాచ్‌లో ముంబైను చెన్నై ఓడించింది