Nitish Kumar Reddy Father RCb Jersey Viral Video: తెలుగుతేజం నితిష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో మెప్పించాడు. గత ఐపీఎల్ లో కొంచెం టచ్ లో కనిపించిన నితీష్ రెడ్డి IPL 2025లో ఏమాత్రం ఆకట్టుకోవడం లేదు. నితిష్ కుమార్ రెడ్డి ఈ సీజన్‌లో బ్యాటింగ్ లో 9 ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులు మాత్రమే చేశాడు. నితిష్ SRH స్టార్ ఆల్‌రౌండర్ ఆటగాళ్లలో ఒకడు, నితీష్ రాణించకపోవడం, బౌలర్లు సరైన టైంలో వికెట్లు తీయకపోవడంతో పాటు ఓపెనర్ల నిలకడ లేమితో జట్టు వరుస ఓటములు ఎదురవుతున్నాయి.
ఆస్ట్రేలియా సిరీస్లో నితిష్ కుమార్ రెడ్డి టెస్ట్ సెంచరీ చేసిన సమయంలో అతడి తండ్రి ముత్యాల రెడ్డి వైరల్ అయ్యారు. కుమారుడి విజయంతో ఆనందభాష్పాలు రాల్చారు. తాజాగా నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి చేసిన పని సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. నితిష్ సన్‌రైజర్స్ ప్లేయర్ కాగా, క్రికెటర్ తండ్రి ముత్యాల రెడ్డి (Nitish Kumar Reddy Father) RCB జెర్సీలో ధరించి వర్కవుట్ చేస్తున్నట్లు కనిపించాడు.
ముత్యాల రెడ్డి RCB జెర్సీ ధరించి వర్కవుట్ చేస్తున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో, ఫొటోలు బయటకు వచ్చిన వెంటనే నెటిజన్ల నుంచి భిన్నమైన రియాక్షన్ వచ్చింది. నితిష్ 2023 నుండి సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. గత మెగా ఆక్షన్ ముందు SRH నితీష్ ను 6 కోట్లకు రిటైన్ చేసింది. నితిష్‌కు ఐపీఎల్ లో పేరు, గుర్తింపు సన్‌రైజర్స్ నుంచి లభిస్తే.. మరోవైపు తండ్రి వర్కవుట్ సెషన్ చూస్తుంటే ముత్యాల రెడ్డి RCB అభిమాని అని అనిపిస్తుంది.
కుమారుడికి అవకాశం ఇచ్చిన సన్‌రైజర్స్ జెర్సీకి బదులుగా నితీష్ రెడ్డి తండ్రి ఆర్సీబీ జెర్సీ ధరించడం ఏంటని కొందరు నెటిజన్లు షాకవుతున్నారు. మరోవైపు నితిష్ నెక్ట్స్ ప్లాన్ ఆర్సీబీనేనా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. నితీష్ కు రూ.6 కోట్లు ఇవ్వడం వృథా అవుతోంది. అందుకు ఇలాంటి వీడియోలే సాక్ష్యమని పోస్టుపై స్పందిస్తున్నారు.
నితిష్ ఐపీఎల్ ప్రదర్శన అంత బాగోలేదు
SRH తరపున ఆడుతూ నితిష్ కుమార్ రెడ్డి 2023లో తన IPL డెబ్యూ చేశాడు. ఒకవైపు నితిష్ జట్టుకు మ్యాచ్ విన్నర్ గా మారలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే నమ్మదగిన ప్లేయర్ గా మారలేదు. గత సీజన్‌లో మాత్రం 303 పరుగులు చేశాడు. ఈ సీజన్లో 9 ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులు మాత్రమే చేయగా.. ఒక్క అర్ధశతకం కూడా లేదు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే IPL 2025 పాయింట్ల టేబుల్ కింద స్థానాల్లో ఉంది. గుజరాత్ తో నెగ్గి ప్లే ఆఫ్ రేసు ఆశలు నిలుపుకోవడానికి బదులు SRH ఓటమిపాలైంది. మే 2న గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్ SRHకు కీలకం. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే ఐపీఎల్ తాజా సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. గుజరాత్‌తో ఓడిన హైదరాబాద్ జట్టు కూడా దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి వెళ్లిపోయినట్లే. ఈ సీజన్లో సన్ రైజర్స్ 9 మ్యాచ్‌లలో కేవలం 3 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో ఉంది.