RR vs PBKS Live Updates: జైపూర్: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా వారం రోజులపాటు నిలిచిపోయిన ఐపీఎల్ 2025 శనివారం తిరిగి ప్రారంభమైంది. కానీ వర్షం కారణంగా ఆర్సీబీ, కేకేఆర్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయింది. జైపూర్ వేదికగా జరగుతున్న ఐపీఎల్ 59వ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్ నిలిపింది.
వికెట్లు పడినా పవర్ ప్లేలో పంజాబ్ జోరు
పంజాబ్ బ్యాటర్లలో నేహల్ వధేరా (37 బంతుల్లో 70 పరుగులు, 5x4, 5x6) భారీ హాఫ్ సంచరీ, శశాంక్ సింగ్ 27 బంతుల్లో మెరుపు హాఫ్ సెంచరీ (30 బంతుల్లో 59 పరుగులు, 5x4, 3x6) రాణించడంతో పంజాబ్ బారీ స్కోరు చేసింది. పవర్ ప్లే లో 3 వికెట్లు కోల్పోయినా పంజాబ్ జట్టు రన్ రేట్ తగ్గకుండా చూసుకుంది. 6 ఓవర్లలో 68 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్య (9) త్వరగా ఔటయ్యాడు. మరో ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ (21)ను కూడా తుషార్ దేశ్ పాండే పెవిలియన్ చేర్చాడు. అరంగ్రేటం చేసిన విదేశీ ఆటగాడు మిచెల్ ఓవెన్ డకౌట్ అయ్యాడు. మపాక బౌలింగ్ లో కీపర్ సంజూ శాంసన్‌కు క్యాచిచ్చి నిరాశగా వెనుదిరిగాడు. ఆపై కెప్టెన్ శ్రేయర్ అయ్యర్ (30 పరుగులు, 5X4) స్ట్రైకింగ్ ఇవ్వగా నేహల్ వధేరా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
స్కోరువేగాన్ని పెంచే క్రమంలో మద్వాల్ బౌలింగ్ లో వధేరా ఔటయ్యాడు. చివర్లో శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్), అజ్మతుల్లా ఓమర్ జాయ్ మెరుపు ఇన్నింగ్స్ తో రాజస్తాన్ 200 మార్క్ దాటింది. శశాంక్ సింగ్ బౌండరీలతో స్కోరు బోర్డును నడిపించాడు. అజ్మతుల్లా ఓమర్జాయ్ 9 బంతుల్లో 3 బౌండరీలు, ఓ సిక్సర్ తో 21 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2 వికెట్లు పడగొట్టగా, మపాకా, రియాన్ పరాగ్, ఆకాష్ మద్వాల్ తలో వికెట్ తీశారు. పాయింట్స్ టేబుల్ లో పంజాబ్ 15 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో నెగ్గితే 17 పాయింట్లతో మెరుగైన రన్ రేట్ ఉంటే అగ్రస్థానానికి చేరే అవకాశం ఉంది. మరోవైపు ప్లే ఆఫ్ రేసు నుంచి రాజస్థాన్ ఎప్పుడో తప్పుకుంది. రాజస్తాన్ 12 మ్యాచ్ లలో 3 నెగ్గి 6 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.