IPL 2025 KKR VS RR | ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు సిక్స్‌ల వర్షం కురిపించారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ వరుసగా 6 బంతులను సిక్సర్లుగా మలిచాడు. రియాన్ పరాగ్ బ్యాటింగ్ చూసిన వారికి తొలి టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ సింగ్ సిక్సర్లను గుర్తుకుతెచ్చాడు. అయితే రియాన్ పరాగ్ వరుసగా 6 బంతులను సిక్స్‌లు బాదినప్పటికీ యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రియాన్ పరాగ్ వరుసగా 6 బంతులను సిక్స్ బాదినప్పటికీ, ఓవర్లో ఆరు సిక్స్‌లు బాదిన వారి జాబితాలో యువరాజ్ సింగ్ సరసన చేరలేకపోయాడు. ఎందుకంటే పరాగ్ ఒకే ఓవర్‌లో వరుసగా ఆ ఆరు సిక్స్‌లు కొట్టలేదు.
ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో కేకేఆర్ బౌలర్ మొయిన్ అలీ ఓవర్‌లో రెండవ బంతికి స్ట్రైక్‌కు వచ్చిన రియాన్ పరాగ్ వరుసగా 5 సిక్స్‌లు బాదాడు. ఆ ఓవర్ ముగిసింది. మరుసటి ఓవర్ మొదటి బంతిని షిమ్రాన్ హెట్మెయర్ ఆడాడు, ఆ బంతికి సింగిల్ తీసి పరాగ్ కు స్ట్రైకింగ్ ఇచ్చాడు.
అనంతరం 14వ ఓవర్ మొదటి బంతికి హట్మెయర్ సింగిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత రెండవ బంతికి రియాన్ పరాగ్ సిక్స్ బాదాడు. ఈ తీరుగా రియాన్ పరాగ్ ఆరు వరుస బంతులను సిక్సర్లుగా మలిచినా ఒకే ఓవర్‌లో కొట్టకపోవడంతో అరుదైన రికార్డు నమోదు కాలేదు. మరో బ్యాడ్ లక్ ఎంటంటే.. విరోచిత ఇన్నింగ్స్ ఆడిన పరాగ్ సెంచరీ పూర్తిచేయకుండానే వికెట్ కోెల్పోయాడు. రియాన్ పరాగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (45 బంతుల్లో 95, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. కనీసం జట్టు గెలిచినా అతడు హ్యాపీగా ఉండేవాడు. ఆల్రెడీ ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా తొలగిన రాజస్తాన్ రాయల్స్ కు ఇది ఊరట కలిగించేంది. చాలా మ్యాచ్‌లలో రాజస్థాన్ రాయల్స్ చివరి వరకు వచ్చి బోల్తా పడుతోంది. కోల్‌కత్తాకు ఆ మ్యాచ్ నెగ్గడం చాలా ముఖ్యం. చివరివరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో గట్టేక్కింది డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.
ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్స్‌లు బాదిన బ్యాట్స్‌మెన్
2012లో క్రిస్ గేల్ రాహుల్ శర్మ ఓవర్‌లో 5 సిక్స్‌లు బాదాడు
2020లో రాహుల్ తేవతీయా ఎస్ కోట్రెల్ ఓవర్‌లో 5 సిక్స్‌లు బాదాడు
2021లో రవీంద్ర జడేజా హర్షల్ పటేల్ ఓవర్‌లో ఐదు సిక్స్‌లు బాదాడు
2023లో రింకు సింగ్ యశ్ దయాల్ ఓవర్‌లో ఐదు సిక్స్‌లు బాదాడు