RCB Captain IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025కి రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా నియమించింది. విరాట్ కోహ్లీని మరోసారి జట్టు కెప్టెన్‌గా చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. జట్టు కెప్టెన్సీని పాటిదార్‌కు అప్పగించాలని నిర్ణయించుకుంది యాజమాన్యం. 2021లో పాటిదార్ RCBలో చేరాడు. అప్పటి నుంచి జట్టులో కీలక భాగస్వామిగా మారాడు.  

గత సీజన్‌లో అంటే IPL 2024లో దక్షిణాఫ్రికాకు చెందిన డు ప్లెసిస్ జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ మెగా వేలంలో మళ్ళీ కొనుగోలు చేయలేకపోయింది. 2025 ఐపీఎల్‌లో డు ప్లెసిస్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడనున్నాడు. అతన్ని ఢిల్లీ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. 

IPL 2025 మెగా వేలానికి ముందు, RCB ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే నిలబెట్టుకుంది. అందులో రజత్ పాటిదార్ కూడా ఒకరు. పాటిదార్‌ను రూ.11 కోట్లకు అట్టిపెట్టుకుంది. పాటిదార్‌తోపాటు, విరాట్ కోహ్లీ, యష్ దయాల్‌ను నిలుపుకుంది. కోహ్లీని రూ.21 కోట్లకు, యష్ దయాళ్‌ను రూ.5 కోట్లకు అట్టిపెట్టుకుంది. 

కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్‌ IPL 2025లో తొలి IPL టైటిల్ అదిస్తాడని అభిమానులు ఆశిస్తారు. పటీదార్ ఇప్పటివరకు RCB తరపున బ్యాట్స్‌మన్‌గా అద్భుతంగా రాణించాడు, ఇప్పుడు కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడో చూడటం ఆసక్తికరంగా మారింది. రజత్ పాటిదార్ ఐపీఎల్ కెరీర్ 

రజత్ పాటిదార్ 2021లో RCB తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. పటీదార్ ఇప్పటివరకు 27 మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 24 ఇన్నింగ్స్‌ల్లో 34.73 సగటుతో 158.84 స్ట్రైక్ రేట్‌తో 799 పరుగులు చేశాడు. అందులో 1 సెంచరీ, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.  

IPL 2025 కి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించడం వెనుక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. గురువారం ఉదయం రజత్ పాటిదార్‌ను కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ఆర్‌సిబి ప్రకటించింది. "ఆర్‌సిబిలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది" అని ఆ జట్టు పోస్ట్‌ చేసింది. పాటిదార్‌ను కెప్టెన్‌గా నియమించిన తర్వాత విరాట్ కోహ్లీ స్పందించాడు. తన కృషి ఆధారంగానే ఈ స్థానం సాధించాడాని కోహ్లీ అభినందిచాడు.