IPL 2025 Prize Money: ఐపీఎల్2025 కీలక దశకు చేరుకుంది. ప్లైఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే నాలుగు టీంలు ప్లైఆఫ్‌కు చేరుకున్నాయి. గుజరాత్ టైటాన్, రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తమ బెర్త్‌లు ఖరారు చేసుకున్నాయి.
ఈ ఐపీఎల్ ఫైనల్ పోటీ జూన్ 3న జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఆఖరి పోరులో గెలిచే టీం భారీగానే ప్రైజ్‌మనీ తీసుకెళ్లబోతోంది. గతంలో ఇచ్చిన ప్రైజ్‌మనీ ఆధారంగా లెక్కలు వేసుకుంటే మాత్రం 20 కోట్లకుపైగానే విజేతకు దక్కే అవకాశం ఉంది. అదే టైంలో రన్నర్‌కు దాదాపు పదమూడు కోట్ల రూపాయలు రానున్నాయి. ఇది 2022 నుంచి ఇస్తున్నది. ఇప్పటి వరకు దీన్ని మారుస్తున్నట్టు ఐపీఎల్ నిర్వాహకులు ఎక్కడా ప్రకటించలేదు.
గత ఏడాది కూడా విన్నర్, రన్నర్‌కు ఇదే ప్రైజ్‌మనీ ఇచ్చారు. IPL 2024 విజేత కేకేఆర్‌కు 20 కోట్ల రూపాయలు దక్కింది. రన్నర్‌గా ఉన్న హైదరాబాద్ టీంకు 13 కోట్లు వచ్చింది.
IPL ప్రైజ్‌మనీ ఎప్పుడు ఎంత ఇచ్చారంటే! 2008–2009: ఐపీఎల్ విజేతకు రూ. 4.8 కోట్లు | రన్నరప్‌కు రూ. 2.4 కోట్లు
2010–2013: ఐపీఎల్ విజేతకు రూ. 10 కోట్లు | రన్నరప్ - రూ. 5 కోట్లు
2014–2015: ఐపీఎల్ విజేతకు రూ. 15 కోట్లు | రన్నరప్ - రూ. 10 కోట్లు
2016: ఐపీఎల్ విజేత రూ. 16 కోట్లు | రన్నరప్ రూ. 10 కోట్లు
2017: ఐపీఎల్ విజేతకు రూ. 15 కోట్లు | రన్నరప్ రూ. 10 కోట్లు
2018–2019: ఐపీఎల్ విజేతకు రూ. 20 కోట్లు | రన్నరప్ - రూ. 12.5 కోట్లు
2020 (కరోనా సంవత్సరం): ఐపీఎల్ విజేతకు రూ. 10 కోట్లు | రన్నరప్ రూ. 12.2 కోట్లు
IPL 2025 ప్లేఆఫ్స్ షెడ్యూల్
క్వాలిఫయర్ 1 (లీగ్ దశలో మొదటి రెండు జట్ల మధ్య మ్యాచ్): గురువారం, మే 29, 2025 - చండీగఢ్
ఎలిమినేటర్ (3వ vs 4వ స్థానంలో ఉన్న జట్లు) - శుక్రవారం, మే 30, 2025 - చండీగఢ్
క్వాలిఫయర్ 2 (క్వాలిఫయర్ 1లో ఓడిపోయిన జట్టు vs ఎలిమినేటర్ విజేత)- ఆదివారం, జూన్ 1, 2025 - అహ్మదాబాద్
ఫైనల్ (క్వాలిఫయర్ 1 విజేత vs క్వాలిఫయర్ 2 విజేత) - మంగళవారం, జూన్ 3, 2025 - అహ్మదాబాద్
ప్లేఆఫ్ ఫార్మాట్ ప్రకారం మొదటి రెండు జట్లు క్వాలిఫయర్ 1లో ఒకదానితో ఒకటి తలపడతాయి. అయితే మూడో నాల్గో స్థానంలో ఉన్న జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి.
లీగ్ దశ చివరిలో పాయింట్ల పట్టికలో మొదటి రెండు జట్లు క్వాలిఫయర్ 1లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌లో స్థానం సంపాదించుకుంటుంది.
3వ, 4వ స్థానంలో నిలిచిన జట్లు ఎలిమినేటర్‌లో తలపడతాయి. ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది.
క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టుకు రెండో అవకాశం లభిస్తుంది. ఎలిమినేటర్ విజేతతో క్వాలిఫైయర్ 2లో తలపడుతుంది.
క్వాలిఫైయర్ 2 విజేత ఫైనల్‌కు చేరుకుంటుంది. క్వాలిఫైయర్ 1 విజేతతో ఢీ కొడతుంది.