IPL 2025 KKR VS RCB Match Abondoned: ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కు ర‌ద్దు ముప్పు..! ఆ కారాణాలతో జ‌రిగే అవ‌కాశాలు లేవు..!! ఆందోళ‌న‌లో కేకేఆర్, ఆర్సీబీ

IPL 2025 KKR VS RCB | గ‌త సీజన్ లో విజేత‌గా నిలిచిన కోల్ క‌తా డిఫెండింగ్ చాంపియ‌న్ గా బ‌రిలోకి దిగుతోంది. ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగే తొలి మ్యాచే ర‌ద్దు కానుడటంపై ఆ జ‌ట్టులో కాస్త ఆందోళ‌న నెల‌కొంది.

Continues below advertisement

IPL 2025 KKR VS RCB Live Updates: ఆదిలోనే హంస‌పాదు అన్న‌ట్లుగా ఐపీఎల్ 2025 తొలి మ్యాచే జ‌రిగే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈనెల 22న కోల్ క‌తా నైట్ రైడర్స్, రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్ల మ‌ధ్య ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ జ‌రిగబోదని తెలుస్తోంది. గురువారం నుంచి ఆదివారం వ‌ర‌కు భారీ వ‌ర్షాలు, పిడుగుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డ‌నున్న నేప‌థ్యంలో శ‌నివారం ఈ మ్యాచ్ జ‌రిగే అవ‌కాశాలు లేవ‌ని తెలుస్తోంది. మ్యాచ్ రోజు సాయంత్రం.. దాదాపు 90 శాతం భారీ వ‌ర్షం ప‌డే అవ‌కాశ‌మున్నట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆరెంజ్ ఆలెర్ట్ ఇష్యూ చేసిన వాతావ‌ర‌ణ శాఖ‌, దాన్ని యెల్లో అలెర్టు కు మార్చనుంది. ఇక ఇరుజ‌ట్ల మ‌ధ్య క‌నీసం ఫ‌లితం తేలేంత స‌మ‌యం కూడా మ్యాచ్ జ‌రిగే అవ‌కాశం లేద‌ని స‌మాచారం. గ‌త సీజన్ లో విజేత‌గా నిలిచిన కోల్ క‌తా నైట్ రైడర్స్ డిఫెండింగ్ చాంపియ‌న్ గా బ‌రిలోకి దిగుతోంది. సొంత‌గ‌డ్డ ఈడెన్ గార్డెన్స్ లో జ‌రిగే తొలి మ్యాచే ర‌ద్దు కానుడటంపై ఆ జ‌ట్టులో కాస్త ఆందోళ‌న నెల‌కొంది. 

Continues below advertisement

అంతా సిద్ధం..
అయితే ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కావ‌డంతో అంద‌రి దృష్టి ఈ మ్యాచ్ పైనే నెల‌కొంది. ఇప్ప‌టికే ప్రారంభోత్స‌వానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. సింగర్ శ్రేయా ఘోష‌ల్, న‌టి దిశా ప‌టానీ, పాట‌, ఆట‌ల‌తో అభిమానుల‌ను ఉర్రుతలూగించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు అనుకూలించ‌క‌పోవ‌డంతో ఈ ఏర్పాట్ల‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇక మెగాటోర్నీలో మూడో టైటిల్ సాధించిన కోల్ క‌తా .. సొంత‌గ‌డ్డ‌పై శ‌నివారం జ‌రిగే మ్యాచ్ లో శుభారంభం చేయాల‌ని భావించింది. అయితే వ‌రుణుడు మాత్రం మ్యాచ్ కు అడ్డింకిగా మారే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు మూడుసార్లు ర‌న్న‌ర‌ప్ ఆర్సీబీ కూడా ఈ మ్యాచ్ పై ఆశ‌లు పెట్టుకుంది. తొలి మ్యాచ్ లో గెలిచి స‌త్తా చాటాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అయితే తాజాగా ర‌ద్దు మాట వినిప‌స్తుండ‌టంతో ఆ జ‌ట్టులోనూ గుబులు నెల‌కొంది. 


ఇప్ప‌టికే ఒక మ్యాచ్ షిఫ్ట్..
ఇక ఐపీఎల్లో కోల్ క‌తాకు క‌లిసి రావ‌డం లేదు. తొలి మ్యాచ్ కు వ‌ర‌ణుడి గండం ఉండ‌టంతో వ‌చ్చేనెల 6న జ‌రిగే మ్యాచ్ కు వేరే స్టేట్ కు షిఫ్ట్ అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది.  ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టుతో కోల్ క‌తా ఈ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఏప్రిల్ 6న శ్రీరామ‌న‌వ‌మి ఉండ‌టంతో మ్యాచ్ నిర్వ‌హ‌ణ భ‌ద్ర‌తా ఏర్పాట్లు త‌మ వ‌ల్ల కావ‌ని బెంగాల్ పోలీసులు చేతులెత్తేశారు. దీనిపై స‌మీక్షించిన బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ (క్యాబ్) అధ్య‌క్షుడు స్నేహాశీష్ గంగూలీ.. మ్యాచ్ ను అసోంలోని గువాహ‌టికి త‌ర‌లించే అవ‌కాశ‌మున్న‌ట్లు పేర్కొన్నారు.

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేసే అవ‌కాశం లేద‌ని, అందుచేత మ్యాచ్ ను త‌ర‌లించ‌నున్న‌ట్లు తెలిపారు. న‌వ‌మి రోజున బెంగాల్లో దాదాపు 20వేల‌కు పైగా ఊరేగింపులు జ‌రుగుతాయ‌ని, ముంద‌స్తుగా బీజేపీ నాయ‌కుదు సువేందు అధికారి హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఆ రోజు మ్యాచ్ భ‌ద్ర‌త‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. గ‌తేడాది కూడా ఇలాంటి స‌మ‌స్యే ఎదురైతే మ్యాచ్ రీ షెడ్యూల్ చేశారు. కానీ ఈసారి మ్యాచ్ ను షిఫ్ట్ చేయ‌డానికే మొగ్గు చూపుతున్నారు. 

Continues below advertisement