MI vs LSG Match Preview IPL 2025 | నేడు ముంబై వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఛేజింగ్ కు మొగ్గుచూపాడు. లక్నో జట్టులో ఒక్క మార్పు చేశారు. శార్దూల్ ఠాకూర్ బదులుగా యువ సంచలనం మయాంక యాదవ్ ను తుది జట్టులోకి తీసుకున్నారు. అటు ముంబై ఇండియన్స్ లో రెండు మార్పులు జరిగాయి. తుది జట్టులో విఘ్నేష్ పుత్తూరు బదులుగా కర్ణ్ శర్మ చోటు దక్కించుకున్నాడు. శాంట్నర్ స్థానంలో Corbin Boschను తీసుకున్నాడు. అతడికి ఐపీఎల్ అరంగేట్రం.
లక్నో ప్లేయింగ్ XI: మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, పూరన్, బదోని, రిషబ్ పంత్ (కెప్టెన్), సమద్, డి.ఎస్. రాఠీ, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, పి.యాదవ్, మయాంక్ యాదవ్
ముంబై ప్లేయింగ్ XI: రోహిత్ శర్మ, ఆర్. రికెల్టన్ (కీపర్), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, కోర్బిన్ బాష్, దీపక్ చాహర్, బౌల్ట్, కర్ణ్ శర్మ
ఎప్పుడైనా ఐపీఎల్ (IPL)లో లీగ్ స్టేజీలో ముంబై ఇండియన్స్ ఫస్టాఫ్ ఆడే ఆట ఓ ఎత్తు అయితే.. లీగ్ సెకండాఫ్ లో వారు ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. ముంబై ఈ దశలో ఆడే ఆట మరో ఎత్తు. అలా గత కొన్నేళ్లుగా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే వస్తోన్న ముంబై ఐపీఎల్ 2025లోనూ సెకండాఫ్ కి వచ్చేసరికి జోరు పెంచేసింది.
హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఇప్పటికే 5 విజయాలు సాధించి 10 పాయింట్లు సాధించింది. మొదట్లో అన్ని మ్యాచ్ లు ఓడుతూ సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ సరసన నిలిచిన ముంబై... ఈ మధ్య వరుస విజయాలు సాధించి తమ స్థానాన్ని మెరుగు పరుచుకుంది. లక్నోతో నేడు తలపడనుంది. పాయింట్స్ టేబుల్ లో 5, 6 స్థానాల్లో ముంబై, లక్నో జట్లు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగు పరుచుకోవటం కోసం నేటి మ్యాచ్ రెండు జట్లకు కీలకమే.
బలాబలాలు పరిశీలిస్తే.. ముంబై ఇండియన్స్‌కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Shamra) ఫామ్ లోకి రావటం కలిసొస్తుంది. గత రెండు మ్యాచుల్లో 70+ ప్లస్ స్కోర్లు చేసిన రోహిత్ శర్మ.. మరోసారి చెలరేగితే ముంబైకి విజయాలు నల్లేరుపై నడక లాంటివే. తన బీస్ట్ ఫామ్ ను రోహిత్ శర్మ కంటిన్యూ చేయాలని ముంబై ఇండియన్స్ కోరుకుంటోంది. మరో ఓపెనర్ రికెల్టన్ కొన్ని కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. సూర్య కుమార్ యాదవ్, నమన్ ధీర్, విల్ జాక్స్ లలో ఒకరు రోహిత్ కు జతయితే ముంబై భారీ స్కోరు ఖాయం. కెప్టెన్ హార్టిక్ పాండ్యా అటు బౌలింగ్ లో రాణిస్తున్నాడు. ఇటు బ్యాటింగ్ లో కూడా ఓ చేయేస్తే తిరుగు ఉండదు.
జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ కాంబోతో ముంబై బౌలింగ్ దూసుకుపోతోంది. శాంట్నర్, విఘ్నేశ్ పుత్తూరు సైతం కీలక సమయంలో వికెట్లు తీస్తున్నారు. అటు LSG ఆట చూస్తే కెప్టెన్ రిషబ్ పంత్ జట్టుకు భారంగా మారాడు. రూ. 27 కోట్లు పోసి లీగ్ చరిత్రలో కాస్ట్‌లీ ప్లేయర్ గా చరిత్ర సృష్టించిన పంత్ డబుల్ డిజిట్ చేయలేకపోతున్నాడు. అతడి నుంచి మెరుపు ఇన్నింగ్స్ ను టీమ్ కోరుకుంటోంది. టాప్ 3 బ్యాటర్లైన మార్ క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ లు బ్యాటింగ్ లో రాణించడంతో LSG ని విజయాలు వరించాయి. చివర్లో మిల్లర్ మెరుపులు తోడవుతాయి. బౌలింగ్ లో శార్దూల్ ఠాకూర్, ఆవేశ్ ఖాన్, ప్రిన్స్ కీలక సమయంలో వికెట్లు తీయగలరు. రవి బిష్ణోయ్, దిగ్వేష్ రాఠీ స్పిన్ తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. నేటి మ్యాచ్‌లో ఆరో విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్ లో ముందుకు వెళ్లేది ఎవరో తేలాలంటే ఈ మ్యాచ్ జరగాలి.