MI vs GT: గుజరాత్ పై టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ముంబై , ఏపీ ఆటగాడు సత్యనారాయణ రాజుకు మరో ఛాన్స్‌

IPL 2025: నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్-ముంబై మ్యాచ్. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.ముంబై తరఫున సత్యనారాయణ రాజు ఇవాళ మరో మ్యాచ్‌కు ఛాన్స్ ఇచ్చారు.

Continues below advertisement

GT vs MI Playing 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 18వ ఎడిషన్‌లో 9వ మ్యాచ్‌ నేడు గుజరాత్ టైటాన్స్,  ముంబై ఇండియన్స్ మధ్య నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చాడు, అతను నిషేధం కారణంగా గత మ్యాచ్ లో ఆడలేదు. శుభ్మన్ గిల్ జట్టులో  ప్లేయింగ్ 11లో ఒక మార్పు చేశారు. షెర్ఫేన్‌ రూథర్‌ఫర్డ్ గుజరాత్ ప్లేయింగ్ 11లో చేరాడు, అతను గత మ్యాచ్ లో సబ్ స్టిట్యూట్ ప్లేయర్ గా ఆడాడు.

Continues below advertisement

రాజు మరో ఛాన్స్  ఐపీఎల్‌కు వచ్చాడు 

ఆంధ్ర ప్లేయర్ సత్యనారాయణ రాజు ఐపీఎల్‌లో రెండో మ్యాచ్‌లో కూాడా ఛాన్స్ వచ్చింది.  2025 IPL వేలంలో ముంబై ఇండియన్స్ అతన్ని ప్రైస్ 30 లక్షలకు S రాజును కొనుగోలు చేశారు. 15 మ్యాచ్‌లు కూడా ఆడని అతన్ని తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు ఏం చెప్పారు
హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్ కెప్టెన్): "మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాం. దీనికి సింపుల్ కారణం. ఎలా సాగుతుందో తెలియదు. మంచు కురిసినా మేము లక్ష్యాన్ని ఛేదిస్తాం. గత సీజన్‌లో భిన్నంగా ఉంది. బ్లాక్ సోయిల్‌పై ఛేజింగ్ ఎల్లప్పుడూ ఇంటస్ట్రింగ్‌గానే ఉంటుంది."
"మా రెడీనెస్‌ అద్భుతంగా ఉంది. అబ్బాయిలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాస్త లోలో ఉన్న వాళ్లకు సమర్థించి పైకి తీసుకురావడమే లక్ష్యం. నేను జట్టులోకి తిరిగి వచ్చాను. దీనికి తగ్గట్టుగానే ఎంపికలు ఉంటాయి. ఇది మంచి క్రికెట్ ఆడటం గురించే అనేది నా భావన. మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఫలితాలు వస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఆటను ఆస్వాధించడం ముఖ్యం."

శుభ్‌మాన్ గిల్ (గుజరాత్ టైటాన్స్ కెప్టెన్):
"మేము ఇక్కడ చాలాసార్లు ముందుగా బ్యాటింగ్ చేసాము కాబట్టి మా విషయంలో ఫలితం మారదని అనుకుంటున్నాం. మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు మేము ముందుగా బ్యాటింగ్ చేయాలి."

"నిజాయితీగా చెప్పాలంటే, మేము ముందుగా పరిస్థితులను అంచనా వేసుకొని ఆపై బ్యాటింగ్ చేసి మంచి లక్ష్యాన్ని నిర్దేశించాలనుకుంటున్నాము. గత మ్యాచ్లో చాలా సానుకూలతలు ఉన్నాయి. మొదటి 3 ఓవర్లు, మిడిల్ ఫేజ్‌లో మాత్రమే మా ఆట చేజారింది. ."

"మా జట్టు బౌలింగ్ లైనప్‌లో 1 మార్పు చూడవచ్చు. (3వ నంబర్‌లో జోస్ బట్లర్‌పై) నిజాయితీగా చెప్పాలంటే, మేము ఎగువన LHB-RHB ఓపెనింగ్ కలయికను కోరుకుంటున్నాము. జోస్ ఇంగ్లాండ్ తరపున 3వ నంబర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి అతని విషయంలో మార్పు ఉండద."

ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 

రోహిత్ శర్మ, రయాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సెంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బోల్ట్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, సత్యనారాయణ రాజు.

ముంబై ఇండియన్స్ సబ్ స్టిట్యూట్ ప్లేయర్స్: విల్ జాక్స్, రాబిన్ మిన్జ్, రాజ్ అంగద్ బావా, కార్బిన్ బోష్, అశ్విని కుమార్.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11

శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫెన్ రదర్ఫోర్డ్, రాహుల్ తేవతీయా, షాహ్రుఖ్ ఖాన్, రాషిద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, కాగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ.

గుజరాత్ టైటాన్స్ సబ్ స్టిట్యూట్ ప్లేయర్స్: వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, ఇశాంత్ శర్మ, అనుజ్ రావత్, మహిపాల్ లొమ్రోర్.

గుజరాత్ టైటాన్స్ बनाम ముంబై ఇండియన్స్ హెడ్ టు హెడ్

గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మొత్తం 5 మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో గుజరాత్ పైచేయి సాధించింది. 3సార్లు గుజరాత్ టైటాన్స్ గెలిచింది, అయితే 2 సార్లు ముంబై ఇండియన్స్ గుజరాత్ ను ఓడించింది. ముంబై ఇండియన్స్ ఎప్పుడూ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో గుజరాత్ ను ఓడించలేదు. గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్‌లలో  అత్యధిక స్కోర్ 233 పరుగులు. ముంబై ఇండియన్స్ గుజరాత్ తో అత్యధిక స్కోర్ 218.

పాయింట్ల పట్టికలో రెండు జట్లు

గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్, ఇరు జట్లు కూడా మొదటి 2 పాయింట్లు సాధించే లక్ష్యంతో ఆడుతున్నాయి . రెండు జట్లు గత మ్యాచ్ లో ఓడిపోయాయి. ముంబై ఇండియన్స్ గత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గుజరాత్ టైటాన్స్ గత మ్యాచ్ లో నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలోనే పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో  8వ స్థానంలో,  గుజరాత్ 9వ స్థానంలో ఉంది.

Continues below advertisement
Sponsored Links by Taboola