ఆదివారం డబుల్ హెడర్ లో భాగంగా మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతుంది. IPLలోని చిరకాల ప్రత్యర్థులు, 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ముంబై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే CSK, ముంబై జట్లు ప్రతి మ్యాచ్ నెగ్గుతూనే పోవాలి. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోవడానికి ధోనీ సేన కచ్చితంగా నెగ్గాల్సి ఉంది.
ముంబై ప్లేయింగ్ XI: Pandya (c), R. Rickelton (wk), W. Jacks, S. Yadav , T. Varma, N. Dhir, M. Santner, D. Chahar, T. Boult, A. Kumar, J. Bumrah
చెన్నై ప్లేయింగ్ XI: Rasheed, R. Ravindra, S. Dube, A. Mhatre, V. Shankar, R. Jadeja, J. Overton, M. S. Dhoni (c & wk), K. Ahmed, N. Ahmad, M. Pathirana
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) చివరి స్థానంలో (10వ స్థానం) ఉంది, 7 మ్యాచ్‌లు ఆడి CSK 2 విజయాలు సాధించగా, 5 ఓటములు ఉన్నాయి. ఇప్పటివరకు 4 పాయింట్లు మాత్రమే సాధించారు. మరోవైపు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) 7వ స్థానంలో కొంత మెరుగ్గా కనిపిస్తున్నా.. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్ ముఖ్యమే. ముంబై 7 మ్యాచ్‌లలో 3 విజయాలు, 4 ఓటములతో 6 పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్ 2 జట్లకు ఈ మ్యాచ్ కీలకమే. చెన్నైకి ఇది డూ ఆర్ డై అని చెప్పవచ్చు.
ఐపీఎల్ చరిత్రలో ఈ జట్లు ముఖాముఖీ పోరులో 38 సార్లు తలపడగా.. MI 20 విజయాలతో స్వల్ప ఆధిక్యంలో ఉంది, CSK 18 మ్యాచ్‌లు నెగ్గింది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ లో ఓటమికి CSKపై ప్రతీకారం కోసం ముంబై చూస్తోంది. మరోవైపు ప్లేఆఫ్ బెర్త్ రేసులో సజీవంగా ఉండాలంటే చెన్నై, ముంబై ప్రతి మ్యాచ్ నెగ్గుతూ పోవాలి. ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఎల్ క్లాసికో పోరు కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు