IPL 2024 SRH Vs CSK  hyderabad target 166: ఉప్పల్‌ వేదికగా  చెన్నైతో హైదరాబాద్‌  తలపడుతోంది.  నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి చెన్నై  165 పరుగులు చేసింది.  టాస్‌ నెగ్గిన హైదరాబాద్‌ కెప్టెన్ పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బరిలో దిగిన  చెన్నైకు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌  పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌(12)ను ఔట్ చేశాడు. ర‌చిన్ భారీ షాట్ ఆడ‌బోయి మ‌ర్క్‌రమ్ చేతికి చిక్కాడు. దాంతో, 25 ప‌రుగుల వ‌ద్ద సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ఆ కాసేప‌టికే రుతురాజ్ గైక్వాడ్(26)ను ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్ వెన‌క్కి పంపాడు. 54 ప‌రుగుల‌కే రెండు వికెట్లు ప‌డిన సీఎస్కేను రహానే, దూబేలు ఆదుకున్నారు. దీంతో చెన్నై స్కోరు 12 ఓవర్లకు 105కు చేరింది.  దూకుడుగా ఆడుతున్న శివమ్‌ దూబె  ను పాట్ కమిన్స్ 45 పరుగుల స్కోర్ వద్ద ఔట్ చేశాడు. ఆఫ్‌సైడ్ వేసిన స్లో బంతిని 13.4వ ఓవర్  వద్ద  భువీకి క్యాచ్‌ ఇచ్చి దూబె పెవిలియన్‌కు చేరాడు. దీంతో 119 పరుగుల వద్ద చెన్నై మూడో వికెట్‌ను కోల్పోయింది. తరువాత జయ్‌దేవ్‌ బౌలింగ్‌లో మయాంక్‌కు క్యాచ్‌ ఇచ్చి 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రహానె  ఔటయ్యాడు. తరువాత హైదరాబాద్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. స్లో డెలివరీలను సంధిస్తూ పరుగులను బాగా  నియంత్రించారు. 16వ ఓవర్‌లో నటరాజన్‌ ఐదు పరుగులకు మాత్రమే అవకాశం ఇచ్చాడు. చెన్నై ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌ను భువీ వేశాడు. ఒకానొక సమయంలో వికెట్ పడిపోతే ధోనీ వస్తాడు కదా అన్న ఆలోచనల్ప పడిపోయారు అభిమానులు.  


అనుకున్నట్టు గానే డారిల్ మిచెల్ 13 పరుగులకే  ఔటయ్యాడు. నటరాజన్‌ బౌలింగ్‌లో సమద్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఉప్పల్‌ మైదానం ధోనీ నామస్మరణతో హోరెత్తింది.క్రీజ్ లో ఉన్న రవీంద్ర జడేజా  చివరి ఓవర్‌ ఆఖరి బంతిని ఫోర్‌గా మలిచాడు. అలాగే క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ  ఒకేఒక్క పరుగు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 


నిజానికి సన్ రైజర్స్కు ఉప్పల్ హోంగ్రౌండ్. అయితే.. అక్కడ ఆ పరిస్థితులు అసలు కనపడ  లేదు. ఉప్పల్ స్టేడియం  పసుపుమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా పసుపు జెర్సీలే కనపడుతున్నాయి. దానికి కారణమేంటంటే.. సీఎస్కే జట్టులో ధోనీ . ధోనీ అంటే.. క్రికెట్ అభిమానులకు ఎంత ప్రేమో చప్పనవసారం లేదు.అందుకోసమే వారు  తమ టీమ్ ను కాదని.. మరో టీమ్ ను సపోర్ట్చేస్తున్నారు. 


గత రికార్డులు ..


 చెన్నై సూపర్ కింగ్స్- హైదరాబాద్‌ మధ్య ఇప్పటివరకూ 20 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్‌ 15 మ్యాచ్‌లు గెలవగా... సన్‌రైజర్స్ హైదరాబాద్  5 మ్యాచ్‌లు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ - హైదరాబాద్ మధ్య ఏ మ్యాచ్ కూడా ఫలితం లేకుండా ముగియలేదు. గత మ్యాచ్‌ 2023 సీజన్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో  హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయాన్ని సాధించింది. హైదరబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌  52 మ్యాచులు ఆడగా SRH 31 మ్యాచ్‌లు గెలిచింది, 20 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.