RCB vs RR 1st Innings Highlights: రాజస్థాన్ రాయల్ తో జరుగుతున్న నాకౌట్ మ్యాచ్ లో బెంగళూరు నామమాత్రపు  స్కోర్ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం బౌలింగ్ కు అనుకూలిస్తున్న వేళ బెంగళూరు బ్యాటర్ లని రాజస్థాన్ బౌలర్ లు కట్టడి చేసారు.  బౌలర్లు  అవేశ్‌ ఖాన్, ట్రెంట్ బౌల్ట్ , రవిచంద్రన్ అశ్విన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. విరాట్ కోహ్లీ, రజిత్ పాటిదార్ , లామ్రోర్ పరవాలేదనిపించారు, దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుండటంతో బెంగళూరు బౌలర్లు ఈ లక్ష్యాన్ని కాపాడుకోగలరో లేదో చూడాలి. 


రాణించిన రాజస్థాన్ బౌలర్లు.. 


ఐపీఎల్ 17వ సీజన్‌  ప్లేఆఫ్స్‌లో భాగంగా  అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌ లో పిచ్ అనుకూలంగా ఉండటంతో టాస్ గెలుచుకున్న రాజస్థాన్‌ బౌలింగ్ కి దిగింది. బెంగుళూరు నుంచి ఓపెనర్లుగా వచ్చిన డుప్లెసిస్, విరాట్ కోహ్లీ లు ఆరంభం నుంచి నిలకడగా ఆడగా  37 పరుగుల వద్ద  బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. 14 బంతుల్లో 17 పరుగులు చేసిన కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్ ట్రెంట్ బౌల్ట్ వేసిన బాల్ ను బౌండరీగా మలిచే ప్రయత్నంలో  రొవ్‌మన్‌ పావెల్ కు   క్యాచ్‌  ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ  ఐపీఎల్‌లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ సీజన్ ల్ప అద్భుత ఫీట్ సాధించిన మొదటి  ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రికార్డ్ కు చేరువలో కోహ్లీ తరువాతి  స్థానాల్లో 6769 పరుగులతో శిఖర్ ధావన్,  6628 పరుగులతో రోహిత్ శర్మ ఉన్నారు. దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి బెంగళూరు జట్టు  50 పరుగులు చేసింది. ఏడవ ఓవర్లో బౌలింగ్ కి వచ్చిన యుజ్వేంద్ర కీలక వికెట్ పడగొట్టాడు. 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీని పెవిలియన్ బాట పట్టేలా చేశాడు. బాటర్లు ఆచి తుచి ఆడుతుండటంతో పది ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయిన బెంగళూరు జట్టు 76 పరుగులు చేసింది. అయితే అశ్విన్ వేసిన వేసిన 11 వ ఓవర్లో రజిత్ పటిదార్ ఔటయ్య ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. పటిదార్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను ధృవ్ జూరేల్ మిస్ చేసుకోవడంతో  పటిదార్ కు లైఫ్ వచ్చింది.. నిలకడగా ఆడుతున్న బెంగళూరు జట్టు 97 పరుగుల వద్ద మూడో వికెట్ను కోల్పోయింది.  గెన్ మ్యాక్స్‌వెల్ గోల్డెన్ డక్‌ అవుట్ అవ్వగా 34 పరుగులకే రజత్ పటిదార్ పెవిలియన్ చేరాడు. మొత్తానికి రాజస్థాన్ తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. మొత్తానికి రాజస్థాన్ బౌలర్లలో అవేశ్‌ ఖాన్ 3, అశ్విన్ 2, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్ ఒక్కో వికెట్ పడగొట్టారు