Gautam Gambhir Hug Moment in Time Out Moment of the Day: మొత్తానికి ఓ గొడవ ముగిసింది. గత సీజన్ లో బద్ద శత్రువులుగా మారిన ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) ఒకటైపోయారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ మెంటార్ గౌతమ్ గంభీర్ చాలా మమ్ములుగా వచ్చి కోహ్లీ దగ్గరికి వచ్చి అభినందించాడు. ఒకరినొకరు నవ్వుతూ హగ్ చేసుకున్నారు. ఈ మ్యాచ్ స్ట్రాటజిక్ టైమ్‌లో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీకి గౌతమ్ గంభీర్ అభినందనలు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
అసలు అప్పుడు ఏం జరిగిదంటే..
ఐపీఎల్ 16 సీజన్‌లో మ్యాచ్ ముగియగానే కైల్ మేయర్స్.. కోహ్లీ మాట్లాడుకుంటున్నారు. కోహ్లీతో మేయర్స్.. ‘నువ్వెందుకు పదే పదే మమ్మల్నిదుర్భాషలాడతావ్ అని ప్రశ్నించాడు. అప్పుడు కోహ్లీ.. మరి మీరెందుకు నా వైపు అంత కోపంగా చూస్తున్నారు..?అని ఎదురుప్రశ్న వేశాడు. ఇది జరుగుతుండగానే అక్కడకు గంభీర్ వచ్చి మేయర్స్ ను పక్కకు తీసుకుపోతూ విరాట్‌తో ‘నువ్వు అతడికి ఏం చెప్తున్నావ్?’ అని అడిగాడు. దానికి విరాట్ ‘అసలు మేం మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలోకి ఎందుకొచ్చావ్..?’ అని గుస్సా అయ్యాడు. దాంతో గౌతమ్.. ‘నువ్వు నా ప్లేయర్స్‌ను నిందిస్తున్నావ్. నా ప్లేయర్స్ అంటే నా ఫ్యామిలీ. నువ్వు వాళ్లను తిడితే నా ఫ్యామిలీని తిట్టినట్టే..’అని చెప్పాడు. గంభీర్ మాటలకు కోహ్లీ కల్పించుకుని.. ‘అయితే నువ్వు నీ ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకో..’ అని అన్నాడు. ఇది గంభీర్‌కు మరింత కోపం తెప్పించింది.. ‘హా.. నీ నుంచే నేర్చుకోవాలి నేను..’ అని గంభీర్ ఎదురుతిరిగాడు.. ఇద్దరిమధ్య వాగ్వాదం పెరుగుతుండటంతో అక్కడే ఉన్న ఇరు జట్ల ఆటగాళ్లు వచ్చి వారిద్దరినీ విడదీశారు. ఐపీఎల్ 2023 సీజన్‌లోనే ఈ ఘటన అత్యంత వివాదాస్పదంగా నిలిచిపోయింది. అప్పటి నుంచి గంభీర్, విరాట్ కోహ్లీ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. తరువాత కూడా సోషల్ మీడియాలలో ఒకరి మీద ఒకరు వారి పేరు పెట్టకుండా కౌంటర్లు ఇచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఈ గొడవను మరింత సాగదీశారు. తాజా మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా ఈ ఇద్దరూ మాట్లాడుకోలేదు. దాంతో మ్యాచ్ సందర్భంగా మళ్లీ గొడవ జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ గంభీర్.. ఓ అడుగు వెనుకేసి కోహ్లీతో స్నేహానికి తెరలేపాడు. కోహ్లీ కూడా హుందాగా ప్రవర్తించి స్నేహ హస్తాన్ని అందించాడు.
మెరిసిన విరాట్ కోహ్లీ:
బెంగళూరు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)మెరిశాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో బెంగళూరు(RCB)కు పోరాడే స్కోరును అందించాడు. కోహ్లీకి తోడు కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్ మెరవడంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 83 పరుగులు చేశాడు. గ్రీన్ 21 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సులతో 33 పరుగులు చేయగా... దినేశ్ కార్తీక్ 8 బంతుల్లోనే 3 సిక్సర్లతో 20 పరుగులు చేశాడు.