IPL 2024 LSG vs PBKS Match Prediction Preview : ఐపీఎల్‌(IPL)లో తొలి విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSK) పంజాబ్‌(PBKS)తో కీలక పోరుకు సిద్ధమైంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఐపీఎల్‌లో సత్తా చాటాలని కె.ఎల్‌.రాహుల్‌ సేన వ్యూహాలు రచిస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ నేతృత్వంలోని జట్టు 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. కృనాల్ పాండ్యా మినహా మిగిలిన లక్నో బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. 

 

బలహీనంగా లక్నో బౌలింగ్‌

మార్క్ వుడ్, డేవిడ్ విల్లీ లేకపోవడంతో లక్నో పేస్‌ విభాగం కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో మొహ్సిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, యష్ ఠాకూర్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మొహ్సిన్ ఖాన్ నాలుగు ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి ఒకే వికెట్ తీయగా... నవీన్‌ ఉల్‌ హక్‌ 41 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశారు. యష్‌ ఠాకూర్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ కుడా తీయకుండా 43 పరుగులు సమర్పించుకున్నాడు. కృనాల్ పాండ్యా ఒక్కడే 4 ఓవర్లు బౌలింగ్‌ చేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి పర్వాలేదనిపించాడు. ఈ బౌలింగ్‌ వైఫల్యమే లక్నోను ఆందోళన పరుస్తోంది.

రాబోయే టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం పోరాడుతున్న రవి బిష్ణోయ్ కూడా భారీగా పరుగులు సమర్పించుకోవడం లక్నో జట్టును ఆందోళన పరుస్తోంది. తొలి మ్యాచ్‌లో 58 పరుగులతో పర్వాలేదనిపించిన కెప్టెన్‌ రాహుల్‌.. క్వింటన్‌ డికాక్‌తో కలిసి భారీ ఇన్నింగ్స్‌ ఆడాలన్న లక్ష్యంతో ఉన్నాడు. పంజాబ్‌పై అత్యుత్తమ ఆటతీరు కొనసాగించాలని ఈ ఓపెనింగ్‌ జోడీ చూస్తోంది.  దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా కూడా రాణించాలని లక్నో కోరుకుంటోంది. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌పై లక్నో భారీ ఆశలు పెట్టుకుంది. గత ఏడాది ఐపీఎల్‌లో  408 పరుగులు చేసిన స్టోయినీస్‌.. ఈసారి అత్యధిక పరుగులు చేయాలని చూస్తున్నాడు. 

 

పంజాబ్‌ జోరు సాగేనా..?

ఇప్పటివరకూ రెండు మ్యాచులు ఆడి ఒక విజయం నమోదు చేసిన పంజాబ్‌.. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి విజయ యాత్ర కొనసాగించాలని పట్టుదలతో ఉంది.  శిఖర్ ధావన్ నేతృత్వంలోని జట్టు పవర్‌ప్లేలో మరింత ధాటిగా ఆడాలని చూస్తోంది. జానీ బెయిర్‌స్టో ఫామ్‌లోకి వస్తే పంజాబ్‌కు ఇది కష్టం కాకపోవచ్చు. ధావన్ తన స్ట్రైక్ రేట్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బెంగళూరు మ్యాచ్‌లో నెమ్మదిగా బ్యాటింగ్ చేసినట్లు స్వయంగా అంగీకరించిన ధావన్‌..  ఈమ్యాచ్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేయాలని చూస్తున్నాడు. ప్రభసిమ్రాన్ సింగ్ మంచి ఆరంభాలు వస్తున్నా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోతున్నాడు. శామ్ కరణ్‌ రెండు మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో తన సత్తా చాటినా బౌలర్‌గా విఫలం కావడం పంజాబ్‌ను ఆందోళన పరుస్తోంది. టీ 20 ప్రపంచకప్‌ జట్టులో ఉండాలనే వైస్ కెప్టెన్ జితేష్ అద్భుతంగా రాణించాల్సి ఉంది. పేస్ బౌలింగ్ విభాగంలో, కగిసో రబడ, శామ్‌ కరణ్‌, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ ఉన్నారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ ఆకట్టుకుంటున్నాడు. లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. 

 

జట్లు

లక్నో సూపర్ జెయింట్స్: కెఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్‌వీర్‌ సింగ్‌, ప్రేరక్ మన్కడ్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతమ్, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మొహమ్మద్. అర్షద్ ఖాన్. 

 

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబాడా, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ భట్రియా , విద్వాత్ కవేరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రిలీ రోసౌవ్.