IPL 2024 LSG vs KKR  Lucknow Super Giants opt to bowl: లక్నోలోని ఎకానా వాజ్‌పేయి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరగనున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  వరుస విజయాలతో దూకుడు మీదున్న కోల్‌కత్తాను లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఎంతవరకూ అడ్డుకోగలదు అన్నదే ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇదే సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో లక్నోపై కోల్‌కత్తా సునాయసంగా ఘన విజయం సాధించింది. . ఇప్పుడు కోల్‌కత్తాపై గెలవాలంటే లక్నో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంది.


గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై 24 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోల్‌కత్తా... ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్‌లో అడుగు పెట్టాలని గట్టి పట్టుదలతో ఉంది.  లక్నో జట్టులో కెప్టెన్ రాహుల్, ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్‌పై చాలా భారం ఉంది. గత మ్యాచ్‌లో ఆడని దక్షిణాఫ్రికా బ్యాటర్‌ క్వింటన్ డి కాక్‌ ఇప్పుడు కూడా అందుబాటులోకి రాలేదు. నికోలస్ పూరన్ కూడా నిలకడగా ఆడుతున్నా భారీ స్కోర్లు చేయలేక పోతున్నాడు.


లక్నోలోని ఏకానా వాజ్‌పేయి స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇక్కడ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు 213/4. చెన్నైపై లక్నో ఈ స్కోరు చేసింది. అయితే ఈ   పిచ్‌ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. మ్యాచ్‌ గడుస్తున్నా కొద్దీ బౌలర్లకు కూడా సహకరిస్తుంది. 


గత రికార్డ్స్‌ చూస్తే 
కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచుల్లో తలపడ్డాయి. ఈ నాలుగు మ్యాచుల్లో లక్నో మూడు మ్యాచుల్లో విజయం సాధించగా... లక్నో ఈ సీజన్‌లోనే తొలి విజయం సాధించింది. 


లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్‌), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరాక్ మన్కడ్, అర్షద్ ఖాన్, కృష్ణప్ప గౌతం, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, నవీన్-ఉల్-హక్, దేవదత్ పడిక్కల్, యుధ్వీర్ సింగ్ చరక్, మయాంక్ యాదవ్, అర్షిన్ కులకర్ణి.

 

కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), KS భరత్ , రహ్మానుల్లా గుర్బాజ్ , రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ సింగ్, వరుణ్‌దీప్, రమణదీప్, చక్రవర్తి, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, అల్లా గజన్‌ఫర్, ఫిల్ సాల్ట్.