CSK vs PBKS  IPL 2024 Punjab Kings target 168: పంజాబ్‌ కింగ్స్‌(PBKS)తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK) పర్వాలేదనిపించే స్కోరు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ డేరిల్‌ మిచెల్‌ ఆడుతున్నప్పుడు భారీ స్కోరు చేసేలా కనిపించిన చెన్నై తర్వాత చేతులెత్తేసింది. పంజాబ్‌ బౌలర్లు పుంజుకోవడంతో చెన్నై బ్యాటర్లు చేతులెత్తేశారు. రవీంద్ర జడేజా రాణించడంతో చెన్నై ఈ మాత్రమైనా స్కోరు చేసింది. చెన్నై బ్యాటర్లలో ఎనిమిది మంది కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటలేదు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్ చాహర్‌ మూడు, హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు తీసి రాణించారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీశాడు.


ఆరంభంలో రాణించినా...
 టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన చెన్నై 12 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది.
అజింక్య రహానె 9 పరుగులు చేసి ఔటయ్యాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ వేసిన రెండో ఓవర్‌లో రబాడకు దొరికిపోయాడు. చాలా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని రబాడ అద్భుతంగా ఒడిసిపట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు డారిల్ మిచెల్‌తో కలిసి రుతురాజ్ చెన్నై స్కోరు బోర్డును నడిపించాడు. రబాడ వేసిన మూడో ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి.


అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్ కొట్టిన మిచెల్‌... స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. పేస్‌ బౌలింగ్‌కు సహకరిస్తున్న హైబ్రిడ్ పిచ్‌పై పంజాబ్‌ బౌలర్లు రాణించారు. ఈ పిచ్‌పై బౌండరీలు ఎక్కువగా నమోదు కాలేదు.  పవర్‌ ప్లేలో చెన్నై స్కోరు 6 ఓవర్లకు 60/1. వీరిద్దరూ రెండో వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నిర్మించారు. ఆ తర్వాత చెన్నై కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఔట్ అయ్యాడు. 21 బంతుల్లో 32 పరుగులు చేసి రుతురాజ్‌ అవుట్ అయ్యాడు. రాహుల్‌ చాహర్ ఓవర్‌లో రుతురాజ్ ఔటయ్యాడు.  కాసేపటికే చెన్నై జట్టుకు భారీ షాక్‌ తగిలింది. శివమ్‌ దూబె (0) కూడా పెవిలియన్‌కు చేరాడు. తర్వాత కూడా చెన్నైకి వరుస షాక్‌లు తగిలాయి. నిలకడగా ఆడుతున్న డారిల్ మిచెల్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. హర్షల్ పటేల్ వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 9 ఓవర్లకు స్కోరు 76/4.


రవీంద్ర జడేజా (0), మొయిన్ అలీ (3) క్రీజులో ధోనీ మెరుపులు చుద్దామనుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది. ఎదుర్కొన్న మొదటి బంతికే ధోనీ పెవిలియన్ చేరాడు. హర్షల్ పటేల్ వేసిన 18.5 ఓవర్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 19 ఓవర్లకు స్కోరు 151/8.  అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో తొలి బంతికి ఫోర్, మూడో బంతికి జడేజా సిక్స్ బాదాడు. నాలుగో బంతికి భారీ షాట్ ఆడి సామ్ కరన్‌కు క్యాచ్‌ ఇచ్చి 43 పరుగులు చేసిన జడేజా అవుటయ్యాడు.  దీంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై సూపర్‌కింగ్స్‌ తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్ చాహర్‌ మూడు, హర్షల్‌ పటేల్‌ మూడు వికెట్లు తీసి రాణించారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ రెండు వికెట్లు తీశాడు.