IPL 2024 DC vs KKR Match Preview : చెన్నైసూపర్‌కింగ్స్(CSK)పై అద్భుత విజయం సాధించిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్(DC) మరో కీలక పోరుకు సిద్ధమైంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR)తో అమీతుమీ తేల్చుకోనుంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన కేకేఆర్.... మూడో విజయంపై కన్నేసింది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్ ఇచ్చిన ఢిల్లీ కూడా మరో విజయం సాధించి సీఎస్‌కేపై తమ గెలుపు గాలివాటం కాదని నిరూపించాలని పట్టుదలతో ఉన్నారు.
పృథ్వీ షా, ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌లు ఈ మ్యాచ్ రాణించాలని ఢిల్లీ మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఏడాదిన్నర తర్వాత ఈ ఐపీఎల్‌లో బరిలోకి దిగిన రిషభ్ పంత్... తొలి అర్ధ సెంచరీతో చెలరేగి ఫామ్‌లోకి రావడం ఢిల్లీకి కలిసిరానుంది. దక్షిణాఫ్రికాకు చెందిన ట్రిస్టన్ స్టబ్స్, ఆస్ట్రేలియన్ మిచెల్ మార్ష్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఢిల్లీ జట్టును దేశీయంగా విధ్వంసర బ్యాటర్ లేకపోవడం ఆందోళనపరుస్తోంది. రాజస్థాన్ రాయల్స్‌పై స్టబ్స్ బ్యాట్‌తో రాణించాడు. ఇంకా మార్ష్ తన పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించలేడు. చెన్నైపై ఖలీల్ అహ్మద్ అద్భుతంగా రాణించాడు. ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మలు ఈ మ్యాచ్‌లో ఎలా రాణిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
కోల్‌కత్తాకు మరో విజయం ఖాయమా..?
ఓపెనర్ ఫిల్ సాల్ట్, ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్ లు మరోసారి రాణిస్తే కోల్‌కత్తా విజయం అంత కష్టం కాకపోవచ్చు. కోల్‌కత్తా సారిధి అయ్యర్ మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాలని చూస్తున్నాడు. ఢిల్లీ పేసర్లను కోల్‌కత్తా బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పర్వాలేదనించాడు. హర్షిత్ రానా కూడా రెండు మ్యాచుల్లో ఐదు వికెట్లు తీశాడు, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌లో అయినా రాణిస్తారేమో చూడాలి.
జట్లు :
ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా మరియు షాయ్ హోప్.
కోల్‌కతా నైట్ రైడర్స్: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), కెఎస్ భరత్, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, అనుకుల్ రాయ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి, వరుణ్ చక్రవర్తి అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్, ముజీబ్ ఉర్ రెహమాన్.