IPL 2024 DC vs KKR Head to Head records : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)17వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో... కోల్‌కత్తా నైట్ రైడర్స్(KKR) తలపడనుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌పై అద్భుత పోరాటంతో గెలిచిన ఢీల్లీ క్యాపిటల్స్ పూర్తి ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు హోమ్‌గ్రౌండ్‌గా ఉన్న వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ మైదానంలో రిషభ్ పంత్ సేన బరిలో దిగనుంది. రిషబ్ పంత్‌పై ఢిల్లీ భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒక మ్యాచ్‌లో విజయం సాధించగా, KKR ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో ఉంది. IPLలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటతీరు స్థిరంగా లేదు. మరోవైపు ఢిల్లీ ఇప్పటివరకూ ఐపీఎల్ టైటిల్‌ను గెలవలేదు. కోల్‌కత్తా మాత్రం 2012, 2014లో టైటిల్‌ను ఒడిసిపట్టింది.
రికార్డులు ఇలా...
కోల్‌కత్తా-ఢిల్లీ ఇప్పటివరకూ 31 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ 15 మ్యాచుల్లో విజయం సాధించింది. కోల్‌కత్తా 16 మ్యాచుల్లో జయకేతనం ఎగరేసింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ వేదికగా అత్యధికంగా పది మ్యాచులు జరగగా... అందులో అయిదు ఢిల్లీ.. అయిదు కోల్‌కత్తా గెలిచాయి. ఈడెన్ గార్డెన్స్‌లో రెండు జట్ల మధ్య 9 మ్యాచ్‌లు జరగగా, KKR 7 విజయాలతో ఆధిపత్యం చెలాయించగా, DC 2 గెలిచింది. వైజాగ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ మ్యాచ్ జరగలేదు. ఈ ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రస్సెల్ విధ్వంసం జరుగుతుందేమో చూడాలి.
పిచ్ రిపోర్ట్
విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ స్టేడియంలో సాధారణంగా భారీ స్కోర్లు నమోదు అవుతాయి. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ మైదానంలో రెండోసారి బ్యాటింగ్ చేసే జట్లు ఎక్కువసార్లు గెలిచింది. ఫాస్ట్ బౌలర్లకు కూడా పిచ్ అనుకూలంగా ఉంటుంది. స్పిన్నర్లు రాణించడం కొంచెం కష్టమే.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకు సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకూల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కెఎస్ భరత్, చేతన్ సకారియా, చేతన్ సకారీ , అంగ్క్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీరా, సాకిబ్ హుస్సేన్.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు: రిషబ్ పంత్ (కెప్టెన్), ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ ఓస్త్వాల్, పృథ్వీ షా, ఎన్రిక్ నార్సియా, అభిషేక్ పోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, ఇషాంత్ శర్మ ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిక్ సలాం దార్, ఝయ్ రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ చికారా.