CSK vs RR Head to Head Records: ఐపీఎల్‌(IPL) 2024 సీజన్‌ 61వ మ్యాచ్‌లో చెన్నై చెపాక్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌(RR)తో... రుతురాజ్‌ గైక్వాడ్‌(CSK) సేన కీలక పోరుకు సిద్ధమైంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఓడిన నేపథ్యంలో చెన్నైకు ఈ మ్యాచ్‌ కీలకంగా మారింది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో చెన్నై సూపర్‌కింగ్స్ అసలైన సమరానికి సిద్ధమైంది. ఐదుసార్లు ఛాంపియన్‌లుగా నిలిచిన చైన్నై గత ఆరు మ్యాచుల్లో కేవలం రెండింటిని మాత్రమే గెలిచి ప్లే ఆఫ్‌ ఆశలను సంక్లిష్టం చేసుకున్నారు. మొత్తం 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న చెన్నై ప్లే ఆఫ్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోను గెలవాలి. ఈ రెండు మ్యాచుల్లో ఒక మ్యాచులో ఓడినా ఇతర జట్ల ఫలితాలపై చెన్నై ఆధారపడాల్సి ఉంటుంది. రాజస్థాన్ మొదటి తొమ్మిది మ్యాచుల్లో ఎనిమిది మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ తర్వాత హైదరాబాద్‌,  ఢిల్లీపై ఓటములతో రెండో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌కు చేరాలని రాజస్థాన్‌ పట్టుదలగా ఉంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్‌ ప్రస్తుతం 11 మ్యాచ్‌లలో 8 విజయాలతో 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ కు రాజస్థాన్‌ కేవలం ఒకే అడుగు దూరంలో ఉంది. 


హెడ్  టు హెడ్ రికార్డ్స్‌
  ఐపీఎల్‌లో ఇప్పటివరకూ రాజస్థాన్‌ రాయల్స్‌-చెన్నై సూపర్‌కింగ్స్ 28 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో 15 మ్యాచుల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయం సాధించింది. 13 మ్యాచుల్లో రాజస్థాన్‌ గెలిచింది. అన్ని మ్యాచుల్లోనూ ఫలితం వచ్చింది. 


పిచ్ రిపోర్ట్
చెన్నైలోని చెపాక్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్‌లో కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లు గెలుపొందాయి. చెపాక్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 183 కాగా, ఈ సీజన్‌లో చెపాక్‌ పిచ్‌పై అత్యధిక లక్ష్య ఛేదన 213. టాస్ గెలిచిన కెప్టెన్ ఇటీవల వేదికపై ఉన్న రికార్డును దృష్టిలో ఉంచుకుని మొదట బౌలింగ్ చేసే అవకాశం ఉంది.


జట్లు
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), MS ధోని అరవెల్లి అవనీష్, అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, మిచెల్ సాంట్నర్ , దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ, సమీర్ రిజ్వీ.



రాజస్థాన్‌: సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్ రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్, తనుష్ కోటియన్, కేశవ్ మహారాజ్.