లాస్ట్ బాల్ కి సిక్స్ కొట్టి హైదరాబాద్ సన్ రైజర్స్ నుంచి గెలిపించాడు సమద్. చివరి బంతికి క్యాచ్ ఇచ్చినా సందీప్ శర్మ నో బాల్ వేయటంతో బతికిపోయిన సమద్... ఫ్రీ హిట‌్‌ను సిక్సర్ గా మలిచి సన్ రైజర్స్ ను ప్లే ఆఫ్ లో నిలిపాడు. లాస్ట్ ఓవర్ లో ప్రెజర్ తట్టుకుని సమద్ ఆడిన విధానం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. 7 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లు కొట్టి 17 పరుగులు చేశాడు ఈ 22 ఏళ్ల యంగ్ స్టర్.


అయితే ఈ లాస్ట్ ఓవర్ ప్రెజర్ ఏ రేంజ్ లో ఉంటుందో..గెలవటం ఎంత కష్టమో రీసెంట్ గా రాజస్థానే చెన్నైకి రుచి చూపించింది. రాజస్థాన్ సవాయ్ మాన్ సింగ్ స్టేడి.యంలో జరిగిన ఆ మ్యాచ్ సీఎస్కే కెప్టెన్ ధోనికి 200వ మ్యాచ్. జైపూర్ మొత్తం ఎల్లో ఫీవర్ కమ్మేసిన ఆ మ్యాచ్ లో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 176 పరుగుల లక్ష్యాన్ని పెట్టింది చెన్నె ముందు. కానీ చెన్నై 113 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి...పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. చెన్నై గెలవాలంటే 4 ఓవర్లలో 53 పరుగులు చేయాలన్నప్పుడు జడేజా తో కలిసిన కెప్టెన్ ధోని తన లోని వింటేజ్ ప్లేయర్ ను ఫ్యాన్స్ కి చూపించాడు. చివరి ఓవర్ లో 21 పరుగులు చేయాల్సి ఉండగా సందీప్ శర్మ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సులు బాదాడు. చివరి బంతికి 5 పరుగులు చేయాలి.


కానీ సందీప్ శర్మ అంత టచ్ లో కనిపించిన ధోనికి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. యార్కర్ లెంత్ బాల్స్ విసరటంతో ధోని ఆఖరి బంతిని బౌండరీకి తరలించలేకపోయాడు. ధోని మాస్ బ్యాటింగ్ కి మంచి అప్లాజ్ వచ్చినా సందీప్ శర్మ డెత్ ఓవర్ బౌలింగ్ గొప్పతనానికి ఆ మ్యాచ్ నిదర్శనం. ఆ రోజు రాజస్థాన్ కి మూడు పరుగుల తేడాతో విజయాన్ని అందించిన సందీప్ శర్మ నే నిన్న సమద్ ఆడుకున్నాడు. ధోని చేయలేని పని చేసి చూపించాడు.


చాలా మ్యాచ్ ల్లో ఫినిషింగ్ చేయలేక విఫలమైన తనను కొనసాగిస్తూ టీమ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి చూపించిన అబ్దుల్ సమద్...కలిసి వచ్చిన అదృష్టాన్ని వినియోగించుకుని లాస్ట్ బాల్ కి సిక్స్ కొట్టి ధోని ఆడలేకపోయిన అదే సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో సన్ రైజర్స్ ను గెలిపించటంతో పాటు ప్లే ఆఫ్ రేస్ లోనూ నిలబెట్టాడు. 


పీఎల్ చరిత్రలోనే మోస్ట్ డ్రమెటిక్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ దక్కించుకుంది. సన్‌రైజర్స్ విజయానికి చివరి బంతికి ఐదు పరుగులు కావాలి. సందీప్ శర్మ వేసిన బంతిని అబ్దుల్ సమద్ బలంగా కొట్టాడు. అది నేరుగా లాంగాఫ్‌లో ఉన్న జోస్ బట్లర్ చేతిలో పడింది. దీంతో రాజస్తాన్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. కానీ అంతలోనే షాక్. సందీప్ వేసింది నోబాల్ అని అంపైర్లు ప్రకటించారు. దీంతో లక్ష్యం ఒక్క బంతికి నాలుగు పరుగులుగా మారింది. ఈ దశలో సందీప్ వేసిన బంతిని అబ్దుల్ సమద్ నేరుగా సిక్సర్‌గా తరలించాడు. ఈ విజయంతో సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టిలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.