ఆదివారం లాస్ట్ బాల్ కి సన్ రైజర్స్ విజయం సాధించింది. అది కూడా రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ చేసిన తప్పిదం వల్లే. నోబాల్ వేయటంతో క్యాచ్ ఇచ్చినా బతికిపోయిన సమద్..ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి హైదరాబాద్ సన్ రైజర్స్ కు విక్టరీ ఇవ్వటంతోపాటు ప్లే ఆఫ్ రేసులోనూ నిలిపాడు. అయితే తర్వాత జరిగిన పరిణామాలు వివాదాలకు దారి తీశాయి.
రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా చేసిన అతి విమర్శల పాలవుతోంది ఇప్పుడు. అదేటంటే తమ కెప్టెన్ సంజూ శాంసన్ ను బ్యాక్ చేసే క్రమంలో SSS గ్రేటర్ దేన్ RRR అని ఓ పోస్ట్ పెట్టంది. SSS అంటే స్కిప్పర్ సంజూ శాంసన్. RRR అంటే మూవీ అని క్లాప్ బోర్డ్ ఎమోజీ కూడా పెట్టింది. సరే సంజూశాంసన్ ఆట గురించి, కెప్టెన్సీ గురించో ఎవరికీ ఏం సందేహాలు లేవు కానీ...క్రికెట్ లో RRR ను ఎందుకు తీసుకొచ్చారనేదే కాంట్రవర్సీకి కారణమైంది.
తెలుగు వాళ్లను కోట్ చేయటానికో..లేదా తెలుగు ప్రాంతానికి చెందిన జట్టు కాబట్టి సన్ రైజర్స్ బదులుగా ఆ ప్రాంతం నుంచి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అయిన RRR నో మ్యాటర్ లోకి తీసుకువచ్చింది రాజస్థాన్ రాయల్స్. ఇక అంతే ట్విట్టర్ బరస్ట్ అయ్యింది. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులు రంగంలోకి దిగిపోయారు.
రాజస్థాన్ రాయల్స్ పేజ్ ను మాస్ రిపోర్ట్ లు కొట్టడంతో పాటు...వందల సంఖ్యలో ట్వీటెడ్ కోట్స్ వేశారు. RRR వరల్డ్ వైడ్ హిట్ అయ్యి దేశానికి ఆస్కార్ తీసుకువస్తే...దాన్ని క్రికెట్ లోకి లాక్కొచ్చి ఏదో ఓ వర్గాన్ని కార్నర్ చేసినట్లు ట్వీట్ పెట్టడం ఏంటంటూ తగులుకున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి టాలీవుడ్ నుంచి కూడా సపోర్ట్ వచ్చింది.
యంగ్ టైగర్, మెగాపవర్ స్టార్ అభిమానులకు తోడు మహేష్, అల్లు అర్జున్ అభిమానులు కలిసి వచ్చి ట్వీట్లు వేయటంతో రాజస్థాన్ రాయల్స్ కి తాము చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. ఈలోగా RRR పేజ్, ప్రొడక్షన్ హౌస్ అయిన డీవీవీ ఎంటర్ టైన్మంట్స్ కూడా రాజస్థాన్ ట్వీట్ పై రెస్పాండ్ అయ్యాయి. వెంకీలో రవితేజను బ్రహ్మానందం లాగిపెట్టి కొట్టే జిఫ్ ను RRR పోస్ట్ చేయగా...ఇడియట్ సినిమాలో శ్రీనివాసరెడ్డి ని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ లాగి ఒక్కటి ఇచ్చే జిఫ్ ను DVV ఎంటర్ టైన్మెంట్ పోస్ట్ చేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ RRR ను కదిపి మళ్లీ నో బాల్ వేశావంటూ ట్వీట్ పెట్టి సైడ్ అయిపోయింది. ప్రొడక్షన్ హౌసెస్ RR ట్వీట్ ను ఫన్నీగానే తీసుకున్నా...ఫ్యాన్స్ రెచ్చిపోవటంతో ట్వీట్ పై క్షమాపణలు చెప్పింది రాజస్థాన్ రాయల్స్. RRR ఎలా అయితే వరల్డ్ వైడ్ హిట్ అయ్యిందో మా క్షమాపణలు కూడా వరల్డ్ వైడ్ రీచ్ అయ్యేలా చెబుతున్నామంటూ మరో ట్వీట్ పెట్టింది. దాన్ని కోట్ చేస్తూ RRR అదే మ్యాజిక్కంటూ బ్రహ్మీ జిఫ్ పోస్ట్ చేయటంతో వివాదానికి తెరపడినట్లైంది. కానీ రాజస్థాన్ కు మాత్రం టాలీవుడ్ ఫ్యాన్స్ ని సోషల్ మీడియాలో కదిపితే ఎలా ఉంటుందో అర్థమై ఉంటుంది.