Sunrisers Hyderabad Vs Punjab Kings: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉండనుంది. బంతి బ్యాట్ మీదకు సులభంగా వస్తుంది.


మ్యాచ్ ప్రారంభంలో మీడియం పేసర్లకు ఈ పిచ్ సహకరించనుంది. అయితే సమయం గడిచేకొద్దీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్ మీదకు బంతి కొంచెం నెమ్మదిగా వస్తుంది. పిచ్ ఉపరితలం పొడిగా ఉంటుంది. దీని కారణంగా బౌన్స్‌కు, స్పిన్‌కు సహకరించనుంది.


ఇక్కడ టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఐపీఎల్‌లో అన్ని జట్లూ ఛేజింగ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. రేపటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ఏది ఎంచుకుంటుంది అనేది కూడా ఆసక్తి కరమే.


ఇప్పటి వరకు ఉప్పల్ స్టేడియంలో మొత్తంగా 64 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించిన జట్టు 35 సార్లు గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు 28 సార్లు విజయం వరించింది. ఈ మైదానంలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 158 పరుగులుగా ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మైదానంలో అత్యధికంగా 231 పరుగులు చేసింది. అత్యల్ప స్కోరు ఢిల్లీ క్యాపిటల్స్ పేరు మీద ఉంది. ఆ జట్టు 80 పరుగులకే ఆలౌట్ అయింది.


సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ సీజన్‌లో ఆశించిన ఆరంభం లభించలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తాము ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది.


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు (అంచనా)
మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, T నటరాజన్, ఉమ్రాన్ మాలిక్


పంజాబ్ కింగ్స్ తుది జట్టు (అంచనా)
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, మాథ్యూ షార్ట్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, శామ్ కరన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్


సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ డ్రీమ్11 ప్రిడిక్షన్
వికెట్ కీపర్లు: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్
బ్యాటర్లు: శిఖర్ ధావన్, హ్యారీ బ్రూక్
ఆల్ రౌండర్లు: ఎయిడెన్ మార్క్రమ్, శామ్ కరన్
బౌలర్లు: ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్