SRH, IPL 2023:
సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా టీమ్ పెడుతున్న పోస్టులు ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాయి. తెలుగు సినిమాలు, హీరోలు, డైలాగులు, పాటలు, సన్నివేశాలను సందర్భానికి తగినట్టు వాడుకుంటోంది. మంగళవారం ముంబయి ఇండియన్స్‌తో మ్యాచుకు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను వాడేసింది.
ముంబయి ఇండియన్స్‌తో మ్యాచుకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ విపరీతంగా ప్రాక్టీస్ చేసింది. కసరత్తులు పూర్తి కాగానే కెప్టెన్ అయిడెన్ మార్‌క్రమ్ ఆరెంజ్ కలర్ టర్కీ టవల్ తీసుకొని మెడలో వేసుకున్నాడు. ఇదే సందర్భంలో పవన్ కల్యాణ్ ట్రేడ్ మార్క్ ఎర్ర తుండును ఆరెంజ్ ఆర్మీ సోషల్ మీడియా టీమ్ వాడేసింది. గబ్బర్‌సింగ్ నుంచి పవన్ కల్యాణ్ మెడలో వేసుకున్న ఎర్ర తువాల ట్రెండింగ్‌లో ఉంది. దాంతో వీరిద్దరి చిత్రాలను ఒకే దగ్గర పేర్చి పోస్టు చేసింది. దానికి 'ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్ అండ్ ఇన్ స్టైల్' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ఇక మ్యాచులో అయిడెన్ మార్‌క్రమ్ రెండు అద్భుతమైన క్యాచులు అందుకున్నాడు. పరుగెత్తుకుంటూ వస్తూ గాల్లోకి ఎగిరి బంతుల్ని ఒడిసిపట్టాడు. దాంతో ఆర్‌ఆర్‌ఆర్‌లో పులులు, అడవి మృగాలను వేసుకొని బ్రిటిష్ కోటలోకి ప్రవేశించే సీన్‌ను ఇందుకోసం వాడుకుంది. అతడు పడుతున్న రెండు క్యాచులను మెర్జ్ చేసింది. చెరోవైపు నుంచి ఎగిరి వస్తున్నట్టు సృష్టించింది. ఇక ట్రిపుల్ ఆర్‌లో మంటలు పట్టుకొని ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎగిరి వస్తున్న దృశ్యాన్ని మెర్జ్ చేసింది. ఇవన్నీ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
MI vs SRH: ఐపీఎల్ - 16లో రెండు ఓటముల తర్వాత రెండు విజయాలతో ట్రాక్‌లోకి వచ్చినట్టే కనిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ అపజయాల బాట పట్టింది. సొంత గ్రౌండ్ ఉప్పల్ లో ముంబై ఇండియన్స్‌పై మార్క్‌రమ్ సేనకు ఓటమి తప్పలేదు. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్య ఛేదనలో ఎస్ఆర్‌హెచ్.. నిర్ణీత 20 ఓవర్లలొ 178 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా ముంబై 14 పరుగుల తేడాతో గెలిచింది. భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ చేయలేకపోవడం, సరైన భాగస్వామ్యం లేకపోవడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో సన్ రైజర్స్‌కు ఇది మూడో ఓటమి కాగా ముంబైకి మూడో విజయం.