RR vs CSK Preview:
ఐపీఎల్ 2023లో గురువారం 37వ మ్యాజ్ జరుగుతోంది. టేబుల్ టాపర్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ (RR vs CSK) తలపడుతున్నాయి. సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఇందుకు వేదిక. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలైన రాయల్స్ మళ్లీ విన్నింగ్ మూమెంటమ్ అందుకోవాలని పట్టుదలతో ఉంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!!
బ్యాటింగే ధోనీసేన బలం!
మొదటి రెండు మ్యాచులు చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Superkings) ఏం ఆడుతుందో అనిపించింది! సీజన్ సగం ముగిసే సరికి తిరగులేని పొజిషన్లో నిలిచింది. ఇందుకు ఒకే ఒక్క రీజన్ సీఎస్కే బ్యాటింగ్ యూనిట్. బలహీనమైన తమ బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌పై ఒత్తిడి లేకుండా పెద్ద టోటల్స్ చేస్తున్నారు. సాధారణంగా నెమ్మదిగా పరుగుల వేట ఆరభించే ధోనీసేన.. ఈసారి మెరుపులు మెరిపిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే అదరగొడుతున్నారు. కాన్వే అయితే డిస్ట్రక్టివ్‌గా ఆడుతున్నాడు. అజింక్య రహానె వీర బాదుడు బాదడం ప్రెజర్ తగ్గిస్తోంది. మిడిలార్డర్లో శివమ్ దూబె, రవీంద్ర జడేజా బాగా ఆడుతున్నారు. అంబటి రాయుడు, ధోనీ గురించి తెలిసిందే. బౌలింగ్ పరంగా ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి. బెన్‌స్టోక్స్, దీపక్ చాహర్ అందుబాటులో లేరు. ప్రత్యర్థుల ముందు భారీ లక్ష్యాలు ఉండటం... ధోనీ వ్యూహాలతో ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్నారు. నెమ్మది పిచ్‌లుండే జైపుర్‌లో సీఎస్కే బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఆరో బౌలింగ్ ఆప్షన్ ఏదీ!
సీజన్ స్టార్టింగ్ నుంచి అదరగొడుతున్న రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) విన్నింగ్ మూమెంటమ్ కోల్పోయింది. అందుకే సీఎస్కేపై గెలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. జోష్ బట్లర్ కాస్త నెమ్మదించాడు. మళ్లీ ఫామ్ చూపించాలి. యశస్వీ జైశ్వాల్ మాత్రం దూకుడుగా ఆడుతున్నాడు. దేవదత్ పడిక్కల్ లయ అందుకున్నాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) గురించి తెలిసిందే. నిలబడితే ఎలాంటి టార్గెట్ అయినా ఛేదించగలడు. కొన్ని సార్లు తడబడుతున్నాడు. హెట్‌మైయర్ పోరాడుతున్నాడు. ధ్రువ్ జోరెల్ ఫర్వాలేదు. రవిచంద్రన్ అశ్విన్ సైతం మంచి ఇంటెంట్ చూపిస్తున్నాడు. అయితే భారీ హిట్స్ కొట్టగల జేసన్ హోల్డర్‌కు ఎక్కువ పని అప్పగించడం లేదు. స్పెషలిస్టు బౌలర్‌గానే చూస్తున్నారు. స్లో పిచ్ ఉంటుంది కాబట్టి ఆడమ్ జంపా జట్టులోకి రావొచ్చు. ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ పేస్ బౌలింగ్ అద్భుతం. యూజీ, యాష్ స్పిన్ గురించి తెలిసిందే. కానీ ఆరో బౌలర్ గురించి పట్టించుకోకపోవడం మున్ముందు ఇబ్బంది పెట్టొచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, అంబటి రాయుడు, డ్వేన్ ప్రిటోరియస్, మహిష్ తీక్షణ ప్రశాంత్ సోలంకి, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, సిమర్‌జిత్ సింగగే , మిచెల్ సాంట్నర్, మతిషా పతిరనా, సుభ్రాంగ్షు సేనాపతి, తుషార్ దేశ్‌పాండే, బెన్ స్టోక్స్, భగత్ వర్మ, అజయ్ జాదవ్ మోండల్, కైల్ జేమీసన్, మొహమ్మద్.
రాజస్థాన్ రాయల్స్ జట్టు: సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్, షిమ్రాన్ హెట్ మయర్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, రవి అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెద్ మెక్‌కాయ్, కుల్దీప్ సేన్, కుల్దీప్ యాదవ్, నవదీప్ సైనీ, కేసీ కరియప్ప, జో రూట్, అబ్దుల్ పా, ఆకాష్ వశిష్ట్, మురుగన్ అశ్విన్, కెఎమ్ ఆసిఫ్, ఆడమ్ జంపా, కునాల్ రాథోడ్, డోనోవన్ ఫెరీరా.