IPL 2023 Best Catches: ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు సగానికి పైగా మ్యాచ్‌లు జరిగిపోయాయి. జరుగుతున్న ప్రతి మ్యాచ్‌తో టోర్నీలో ఉత్కంఠ పెరుగుతోంది. టోర్నీలో ఇప్పటివరకు చాలా మంది బ్యాట్స్‌మెన్, బౌలర్లు అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. టోర్నీలో ఇప్పటివరకు ఫీల్డర్లు పట్టుకున్న టాప్ 5 అత్యుత్తమ క్యాచ్‌ల గురించి తెలుసుకుందాం.


1 రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్)
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్, బెస్ట్ ఫీల్డర్ రవీంద్ర జడేజా క్యాచ్‌తో ఈ లిస్ట్ ప్రారంభమవుతుంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్‌ను అద్భుతమైన రిటర్న్ క్యాచ్ ద్వారా రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపించాడు.




2 సంజు శామ్సన్ (రాజస్థాన్ రాయల్స్)
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ చాలా బలంగా గాలిలో డైవింగ్ చేస్తూ పృథ్వీ షా క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్యాచ్‌ను కీపింగ్‌లో తీసుకోవడానికి సంజు శామ్సన్ దాదాపు మొదటి స్లిప్ వరకు డైవ్ చేశాడు. తొలి ఓవర్ మూడో బంతికే సంజు శామ్సన్ ఈ క్యాచ్‌ అందుకోవడం విశేషం.




3 అమన్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అమన్ ఖాన్ అద్భుతమైన క్యాచ్‌తో ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. చూడటానికి తేలికగా కనిపించే ఈ క్యాచ్ అస్సలు సులభం కాదు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో అమన్ ఖాన్ ఈ క్యాచ్ పట్టాడు.




4 ఎయిడెన్ మార్క్రమ్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఇప్పటివరకు టోర్నీలో అద్భుతమైన ఫీల్డింగ్‌ను ప్రదర్శించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా దీన్ని రుజువు చేశాడు. ఈ మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ వేసిన బంతిని భారీ షాట్ కొట్టబోయిన ముంబై స్టార్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌, ఎయిడెన్ మార్క్రమ్ చేతికి చిక్కాడు. ఈ క్యాచ్‌ను పట్టుకోవడానికి మార్క్రమ్ మొదట చాలా దూరం నుండి పరుగెత్తాడు. చివరికి అతను లాంగ్ డైవ్ చేశాడు.




5 నారాయణ్ జగదీషన్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫీల్డర్ నారాయణ్ జగదీషన్ కూడా ఈ సీజన్‌లో అద్భుతమైన క్యాచ్‌లు పట్టిన వారి లిస్ట్‌లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహాను నారాయణ్ జగదీషన్ అద్భుతంగా క్యాచ్ ద్వారా పెవిలియన్ బాట పట్టించాడు. నారాయణ్ జగదీషన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ క్యాచ్‌ను పట్టుకున్నాడు.