BCCI To Increase IPL Prize Money: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నేడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ బ్రాండ్‌లలో ఒకటి. ఈ ఏడాది దీని విలువ రూ.91 వేల కోట్లకు పైగా పెరిగింది. మీడియా హక్కులు, కొత్త ఫ్రాంచైజీల వేలం కారణంగా ఈ వృద్ధి పెరిగింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ రాబోయే కొన్నేళ్లలో రెండు-మూడు నెలలకు విస్తరించనుంది. ఈ ప్రతిష్టాత్మక లీగ్‌కు ఐసీసీ విండోను కూడా క్లియర్ చేస్తుంది. లీగ్‌కు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఐపీఎల్ ప్రైజ్ మనీని పెంచాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ప్రైజ్ మనీ ప్రకటించిన తర్వాత భారత్ ఈ చర్య తీసుకోనుంది.


అత్యధిక ప్రైజ్ మనీ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సీజన్ వారీగా ధనికంగా మాచుతోంది. దీని కారణంగా ఐపీఎల్ 2023 ప్రైజ్ మనీ పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ మొత్తం ప్రైజ్ మనీ రూ.46.5 కోట్లు. ఈ ప్రైజ్ మనీ ప్రపంచంలోని ఇతర క్రికెట్ లీగ్‌ల కంటే ఎక్కువ.


వచ్చే ఏడాది ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌కు రూ.33.5 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ప్రైజ్ మనీకి సంబంధించి ILT20 కూడా పెద్ద ప్రకటన చేస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ప్రైజ్ మనీని కూడా పెంచే ఆలోచనలో బీసీసీఐ ఉంది.


విజేతకు రూ.20 కోట్లు
ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టుకు రూ.20 కోట్లు ఇస్తారు. కాగా రన్నరప్‌కు రూ.13 కోట్లు. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.7 కోట్లు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.6.5 కోట్లు లభిస్తాయి. ఈ విధంగా మొత్తం రూ.46.5 కోట్లుగా ఉంది.


IPL ప్రైజ్ మనీని పెంచడం గురించి బీసీసీఐ అధికారి మాట్లాడుతూ, ‘ఇతర లీగ్‌ల మాదిరిగా IPLలో ప్రైజ్ మనీ పెద్ద అంశం కాదు. మేం కొంతకాలంగా ప్రైజ్ మనీని సవరించలేదు. దీనిపై త్వరలో చర్చిస్తాం.’ అన్నారు. నివేదిక ప్రకారం BCCI అధికారులు IPL ప్రైజ్ మనీని 20 నుండి 25 శాతం పెంచవచ్చు. ప్రైజ్ మనీని పెంచేందుకు చర్చలు జరుగుతున్నాయని అధికారి తెలిపారు.