IPL 2023 Playoffs Qualification Scenarios For All Teams: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ అంటే IPL 2023లో ఇప్పటివరకు 52 మ్యాచ్‌లు జరిగాయి. అయితే ప్లేఆఫ్‌లకు వెళ్లే టీమ్స్ గురించి క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు అన్ని జట్లు ప్లేఆఫ్స్ అంటే టాప్-4కి చేరుకోవడానికి రేసులో ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.


ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది
ఐపీఎల్ 2023లో 52 మ్యాచ్‌లు జరిగినప్పటికీ, ఏ జట్టు కూడా ప్లేఆఫ్ రేసులో నుంచి తప్పుకోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 10 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. కానీ ఆ జట్టు కూడా ప్లేఆఫ్ రేసులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ లీగ్ మరింత ఉత్కంఠభరితంగా సాగనుందని చెప్పడంలో తప్పులేదు.


గుజరాత్ బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్!
పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం. హార్దిక్ పాండ్యా జట్టు 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో రెండో స్థానంలో ఉంది. అయితే చెన్నై ఆడాల్సిన ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో వారు ఒక పాయింట్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది.


16 పాయింట్లతో ప్లేఆఫ్‌కు చేరుకోవడం ఐపీఎల్‌లో ఎక్కువగా కనిపించింది. కానీ ఈ సీజన్‌లో అలా జరగలేదు. గుజరాత్‌కు 16 పాయింట్లు ఉన్నాయి. కానీ అధికారికంగా ఇంకా అర్హత సాధించలేదు. మరోవైపు లక్నో, రాజస్థాన్‌లు తాము ఆడిన 11 మ్యాచ్‌ల్లో చెరో ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇద్దరికీ ఇప్పటికీ టాప్-4లోకి వచ్చే అవకాశం ఉంది.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తాము ఆడిన 10 మ్యాచ్‌ల్లో చెరో ఐదు మ్యాచ్‌ల్లో గెలిచాయి. అటువంటి పరిస్థితిలో ఈ మూడు జట్లకు కూడా టాప్ నాలుగు స్థానాల్లోకి వచ్చే అన్ని అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత కోల్‌కతా, ఢిల్లీ, హైదరాబాద్‌లు ఆడిన 10 మ్యాచ్‌ల్లో తలో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచాయి. అయితే ఈ మూడు జట్లకు కూడా ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశం ఉంది.


హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా. ఐపీఎల్ లో కొత్త జట్లైన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ను నడిపిస్తున్న కెప్టెన్లు. ఇలా రెండు ఐపీఎల్ టీమ్స్ కి బ్రదర్స్ కెప్టెన్ చేయటం ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి.


కేఎల్ రాహుల్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకోవటంతో లక్నోను ను నడిపించే బాధ్యతలను టీమ్ మేనేజ్మెంట్ కృనాల్ పాండ్యా కు అప్పగించింది. లాస్ట్ ఇయర్ కొత్త టీమ్ గా గుజరాత్ టైటాన్స్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యానే టీమ్ ను నడిపిస్తున్నాడు. గతేడాది ఐపీఎల్ ట్రోఫీని గెలిచి షేన్ వార్న్ తర్వాత కెప్టెన్ అయిన ఏడాదే ట్రోఫీని గెలిచిన కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు నిన్న లక్నోతో గుజరాత్ మ్యాచ్ ఆడటంతో పాండ్యా బ్రదర్స్ ఇద్దరికీ ఫస్ట్ టైమ్ కెప్టెన్లుగా ఫేస్ ఆఫ్ పడింది.