పీఎల్‌లో టీమ్‌ల మధ్య కోల్డ్ వార్ సహజమే. అయితే, అది మైదానం వరకు ఉంటే పర్వాలేదు. హద్దులు దాటితే.. ఫలితంగా గట్టిగానే ఉంటుంది. ఇందుకు రాజస్థాన్ రాయల్స్ చేసిన ట్వీటే నిదర్శనం. ఈ పోస్ట్ ఇప్పుడు క్రికెట్ వర్సెస్ సినిమా లవర్స్ వార్‌గా మారింది. చివరికి.. రాజమౌళి టీమ్ కూడా ఘాటుగా స్పందించాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. 


RRR కంటే SSS గ్రేట్


సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠభరిత పోరు జరిగింది. ఇక రాజస్థాన్ రాయల్స్‌దే విజయం అనుకుంటున్న సమయంలో.. సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. మ్యాచ్ చివరి ఓవర్లో అనూహ్య మలుపు తిరిగింది. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. మరి, ఈ విజయాన్ని రాజస్థాన్ టీమ్ అవమానంగా భావించిందో ఏమిటో.. ట్విట్టర్ ద్వారా తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ను తక్కువ చేసేందుకు ప్రయత్నించింది. రాజస్థాన్ రాయల్ కెప్టెన్ సంజూ శాంసన్ (SSS).. ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ కంటే గొప్ప అనేలా పోస్ట్ పెట్టింది. అది కాస్తా ఫ్యాన్స్ మధ్య సోషల్ వార్‌కు దారి తీసింది. 






తోలు తీస్తానంటూ దానయ్య టీమ్ ట్వీట్


ఈ విషయం తెలిసి.. నిర్మాత డీవీవీ దానయ్య ఎంటర్‌టైన్మెంట్ స్పందించింది. ఈ సందర్భంగా ఇడియెట్‌లోని పోలీస్ స్టేషన్ సీన్‌ను షేర్ చేసింది. ‘‘తొక్క తీస్తా...’’ అనే డైలాగ్‌తో రాజస్థాన్ రాయల్స్‌కు వార్నింగ్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ‘వెంకీ’ సినిమాలో రైల్లో బ్రహ్మానందం.. రవితేజను చెంప కొట్టే మీమ్‌తో సమాధానం ఇచ్చారు. దీంతో నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. మీ నుంచి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరీ RRR‌తో అతడి పోలీస్తే ఎలా ఊరుకుంటాం అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి ఈ ట్వీట్ మీద పెద్ద రచ్చే జరుగుతోంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ స్పందించక తప్పలేదు.










క్షమించాలంటూ ట్వీట్


ఆ ట్వీట్‌పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ టీమ్ స్పందించక తప్పలేదు. ‘‘ఈ మూవీ ప్రపంచాన్నే మెప్పించింది. క్షమాపణలు తెలియజేస్తున్నాం’’ అని మరో ట్వీట్‌లో పేర్కొంది. దీనిపై ‘ఆర్ఆర్ఆర్’కు చెందిన మరో ట్విట్టర్ ఖాతా ద్వారా రాజమౌళి టీమ్ స్పందించింది. బ్రహ్మానందం GIF ఇమేజ్‌తో ‘‘అదే మ్యాజిక్కు’’ అని ఆ ట్వీట్‌కు రిప్లయ్ ఇవ్వడంతో ఫ్యాన్ వార్ కాస్త సద్దుమణిగింది. మొత్తానికి భలే సమాధానం ఇచ్చారు అంటూ సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను పొగిడేస్తున్నారు.


Also Read: సమంత హార్డ్ వర్కర్ - ఫోన్ పగలగొట్టాలనిపిస్తాది: నాగ చైతన్య


‘ఆర్ఆర్ఆర్’ కు ప్రపంచ వ్యాప్త గుర్తింపు రావడంతో ఈ సినిమాను జపాన్ లో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అక్కడ కూడా ‘ఆర్ఆర్ఆర్’ తన సత్తాను చాటింది. ఈ సినిమాను అక్కడ విడుదల చేసినప్పటినుంచీ నిరంతరాయంగా థియేట్రికల్ రన్ కొనసాగుతూ దిగ్విజయంగా 20 వ వారంలోకి ప్రవేశించింది. అంతే కాదు ఇప్పటి వరకూ 80 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. జపాన్ లో 44 నగరాలలో 209 స్క్రీన్ 31 ఐమాక్స్ లలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన సినిమాగా నిలిచింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ టైమ్ ముగిసే సరికి 100 కోట్ల కలెక్షన్లను సాధిస్తుందని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. నిజంగా జపాన్ లో ఈ మూవీ 100 కోట్ల మార్క్ దాటితే మరో సంచలనమే అవుతుందని చర్చించుకుంటున్నారు ఫిల్మ్ లవర్స్.