PBKS vs MI, IPL 2023:
ఐపీఎల్ 2023లో 46వ మ్యాచ్ జరుగుతోంది. మొహాలి వేదికగా ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ టాస్ వేశారు. ముంబయి సారథి రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. శిఖర్ ధావన్‌ను అడిగితే బౌలింగ్ తీసుకోమని చెప్పాడని.. అందుకే అలాగే చేశానని వివరించాడు. మెరిడీత్ గాయపడటంతో ఆకాశ్ మద్వాల్‌ను జట్టులోకి తీసుకున్నామని వివరించాడు.
'టాస్ గెలిస్తే ఏం చేయాలని శిఖర్ ధావన్‌ను అడిగాను. బౌలింగ్ తీసుకోమన్నాడు. అందుకే బౌలింగ్ ఎంచుకున్నాం. పిచ్ బాగుంది. టార్గెట్లు బాగా ఛేదిస్తున్నాం. అందుకే మా బలానికి తగ్గట్టే మొదట బౌలింగ్ ఎంచుకున్నాం. ఇలాంటి పిచ్‌లపై చాలా పరుగులు చేయాలి. జట్టుకు బ్యాలెన్స్ ముఖ్యం. ఇప్పటికే చాలా ఐపీఎల్ మ్యాచులు ఆడాం. పరిస్థితులు వేగంగా మారిపోతాయి. పాయింట్ల పట్టిక ఎంత బిజీగా ఉందో చూస్తూనే ఉన్నారు. ప్రతి మ్యాచ్‌ను తాజాగా ఆడాలి. ప్రణాళికలను చక్కగా అమలు చేయాలి. మెరిడీత్ స్థానంలో ఆకాశ్ మద్వాల్‌ను తీసుకున్నాం' అని ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు.
'మేం కూడా మొదట బౌలింగే చేయాలనుకున్నాం. వికెట్ చాలా బాగుంది. పొడిగా లేదు. ఏం మారలేదు. మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు చేయడం ముఖ్యం. మేం ప్రశాంతంగా ఆడటం ముఖ్యం. మానసికంగా ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. నాయకుడిగా నాకైతే మరీనూ. కాగిసో రబాడా ప్లేస్‌లో మాథ్యూ షార్ట్ వచ్చాడు' అని పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు.
పంజాబ్ కింగ్స్: ప్రభుసిమ్రన్ సింగ్, శిఖర్ ధావన్, మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, సామ్ కరన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
ముంబయి ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహల్ వదేరా, జోఫ్రా ఆర్చర్, పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మద్వాల్, అర్షద్ ఖాన్