LSG vs SRH, IPL 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) రెండో మ్యాచ్ ఆడుతోంది. ఏకనా వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో (Lucknow Supergiants) తలపడుతోంది. ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిన సన్‌రైజర్స్ సఫారీల రాకతో మరింత బలంగా మారాయి. ఈ మ్యాచులో ఆరెంజ్ ఆర్మీకి ఐదుగురు ఆటగాళ్లు అత్యంత కీలకం కానున్నారు! వారు ఎవరంటే?
అయిడెన్ మార్‌క్రమ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఈ సీజన్లో అయిడెన్ మార్‌క్రమ్ నాయకత్వం వహించనున్నాడు. ఎస్‌ఏటీ20లో అతడు సన్‌రైజర్స్‌కు ఏకంగా ట్రోఫీ అందించాడు. కెప్టెన్సీలో రోజురోజుకీ మెరుగవుతున్నాడు. ఈ మధ్యే దక్షిణాఫ్రికా జట్టు అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఓపెనింగ్, వన్‌డౌన్, సెకండ్ డౌన్, థర్డ్ డౌన్ వరకు ఎక్కడైనా అతడు ఆడేస్తాడు. ఓపెనర్లు బాగానే ఉన్నారు కాబట్టి మిడిలార్డర్ బాధ్యత ఇక మార్‌క్రమ్‌దే!
రాహుల్ త్రిపాఠి: తొలి మ్యాచులో రాహుల్ త్రిపాఠి అంతగా రాణించలేదు. కానీ అతడు నిలబడితే స్కోరు బోర్డు పరుగులు పెడుతుంది. పేస్, స్వింగ్, స్పిన్‌ను అతడు సమర్థంగా ఎదుర్కొంటాడు. ఓపెనర్లు విఫలమైన ప్రతిసారీ అతడిమీదే ఒత్తిడి ఉంటుంది. అభిషేక్, మయాంక్ మంచి భాగస్వామ్యం అందిస్తే త్రిపాఠి రెచ్చిపోతాడు.
హ్యారీ బ్రూక్: ఈ ఇంగ్లాండ్ యువ విధ్వంసకర ఆటగాడు తొలి మ్యాచులో విఫలమయ్యాడు. ఒక్క మ్యాచుకే అతడిపై అంచనాకు రాలేం. లక్నో మ్యాచులో బ్రూక్ కీలకం కానున్నాడు. తన సీనియర్ మార్క్‌వుడ్ వీక్‌నెస్‌లు అతడికి తెలుసు. అతడు గనక క్రీజులో నిలిస్తే పరుగుల పండగే.
టి నటరాజన్: యార్కర్ల కింగ్ నటరాజన్ ప్రతి సీజన్లో మినిమం గ్యారంటీగా రాణిస్తాడు. ఒక ఓవర్లో వరుసగా ఆరు యార్కర్లు సంధించగల నైపుణ్యం అతడి సొంతం. తొలి మ్యాచులోనూ వికెట్లు తీశాడు. డెత్ ఓవర్లలో రాజస్థాన్‌ను ఇబ్బంది పెట్టాడు. బౌలింగ్‌కు అనుకూలించే లక్నో పిచ్‌పై అతడు కీలకం.
ఉమ్రాన్ మాలిక్: 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరే జమ్మూ ఎక్స్‌ప్రెస్ తనదైన రోజున ప్రత్యర్థులకు చుక్కలు చూపించగలడు. లక్నో పిచ్‌పై మార్క్‌వుడ్‌ను అనుసరిస్తే ఉమ్రాన్ హిట్టైనట్టే! అనుభవం వచ్చే కొద్దీ అతడిలో పరిణతి పెరుగుతోంది. వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులను నియంత్రిస్తే హీరోగా మారుతాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.
పిచ్ ఎలా ఉందంటే?
తొలి మ్యాచులో లక్నో ఏకనా పిచ ప్రవర్తన అర్థమవ్వలేదు. పేస్ బౌలర్లు, స్పిన్నర్లకు అనుకూలించింది. రాగానే బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టమైంది. అయితే నిలబడితే సిక్సర్లు, బౌండరీలు కొట్టగలరు. అటు పేస్, ఇటు స్పిన్‌ను ఉపయోగపడుతుంది. బౌండరీలూ పెద్దవే. రెండు జట్లకూ సమాన అవకాశాలే ఉంటాయి. ఈ పిచ్‌పై లోకల్ బాయ్ భువీకి అనుభవం ఉంది.